హైదరాబాద్కు అద్భుత భవిష్యత్
హైదరాబాద్ : హైదరాబాద్ను ప్రపంచవ్యాప్త ఐటీ నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. నానక్‌రామ్‌గూడలో టిస్మన్ స్పెయిర్ వేవ్‌రాక్ ఐటీ పార్క్‌ను కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను డిజిటల్ సిటీగా రూపొందిస్తామని తెలిపారు. బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి ఆయన స్పష్టం చేశారు.
నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ ఆలవాలం కావాలని, హైదరాబాద్‌కు అద్భుత భవిష్యత్ ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడిదారులు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవచ్చని, వారికి ప్రభుత్వం అంగా నిలుస్తుందని కేసీఆర్ చెప్పారు. పెట్టుబడిదారులు తన కార్యాలయంలో ఎప్పుడైనా కలవవచ్చని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారుల కోసం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు. రూ.450 కోట్లతో వేవ్ రాక్ ఐటీ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు.