
బట్టల్లేకుండా టాటూ ప్రదర్శనలు చేస్తూ..
షాంఘై: సాధారణంగా పచ్చబొట్టంటే(టాటూ) ఈతరం యువతకు మహా సరదా. పూర్వపు రోజుల్లో పచ్చబొట్లయితే జీవితాంతం ఉండేది కానీ.. ఇప్పుడు టాటూలు మాత్రం తాత్కలికమే. గతంలో అయితే.. ఏ నుదుటిపైనో ఒక చిన్నచుక్కలాగ.. అరచేతిలో చందమామలాగ.. లేదంటే చేతిపై తమకు ఇష్టం వచ్చిన వారిపేరునో వేసుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. టాటూ అంటే తమ శరీరంలోని ఏ భాగంపైనైనా వేయించుకునేవారున్నారు. ఎలాంటి బొమ్మలనైనా టాటూగా వేసుకునేవారున్నారు. అసలు టాటూ అంటే పడిచచ్చేవాళ్లు ఎందరో.. మరి అలాంటి వారంతా ఒకే చోట చేరి తమ దుస్తులన్నీ విప్పేసి టాటూ ప్రదర్శన నిర్వహిస్తే..
అవును చైనాలో ఇది జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా టాటూలను బాగా ఇష్టపడే వారందరు ఐదురోజులపాటు షాంఘైలోని ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరై టాటూల ప్రదర్శన చేశారు. ఒక్క నూలుపోగు కూడా లేకుండా ఒంటినిండా టాటూలు వేయించుకొని రాంప్ వాక్లు చేశారు. చిన్న పిల్లలు కూడా టాటూ ప్రదర్శనలకు హాజరయ్యారు. మహిళలు కూడా తమ దేహమంతా కూడా టాటూలు వేయించుకొని అర్ధనగ్నం ప్రదర్శనలతో ర్యాంప్ వాక్ లు చేస్తూ హడావుడి చేశారు. అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే ఈ షోలకు జనాలు కుప్పలుగా హాజరై ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.