
సాక్షి, పుట్టపర్తి/అనంతపురం : బతుకుదెరువుకోసం విదేశాలకు వెళ్లిన జిల్లావాసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. వివరాలు.. కొత్తచెరువు మండలంలోని తిప్పబట్లపల్లికి చెందిన కోలాటి తిప్పన్న, వెంగమ్మ కుమారుడు కిశోర్ పొట్టకూటి కోసం కొంతకాలం క్రితం చైనా వలస వెళ్లాడు. అక్కడ షాంఘైలోని రెస్టారెంట్లో పనిచేస్తున్న కిశోర్ పనిముగించుకొని ఇంటికి చేరుతుండగా అతని వాహనం డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన కిశోర్ ప్రాణాలు విడిచాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment