బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్‌లో ప్రముఖులుండే చయోయంగ్ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇక్కడి 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది. బీజింగ్‌లో ఆదివారం బయటపడిన 14 కేసుల్లో 11 చయోయంగ్ జిల్లాలోనివేనని అధికారులు తెలిపారు. షాంఘైలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా మరో 51 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో, ఇక్కడ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 138కి చేరుకుంది. షాంఘైలో కొత్తగా 2,472 కేసులు నిర్థారణయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలో ఆదివారం ఒక్క రోజే మరో 20,190 కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment