బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్(96) బుధవారం కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. అంతర్గత అవయవాలు పూర్తిగా పనిచేయకుండా పోవడం వల్ల షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైన్, పార్లమెంట్, మంత్రివర్గం, ఆర్మీ జారీ చేసిన ఓ లేఖను ప్రచురించింది. ‘పార్టీకి, సైన్యానికి, చైనా జాతికి జియాంగ్ జెమిన్ మరణం తీరని లోటు. ఆయన మరణం మాకు తీవ్ర వేదనను మిగిల్చింది. జెమిన్ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త, పార్టీ అత్యున్నత నాయకుడు.’ అని లేఖలో పేర్కొన్నారు. జెమిన్ మృతితో సంతాప దినంగా ప్రకటించారు. చైనా జాతీయ పతాకాన్ని అవనంత చేయనున్నట్లు సీసీటీవి పేర్కొంది.
1989లో తియానాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత డెంగ్ షావోపింగ్ నుంచి జియాంగ్ జెమిన్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా పరపతి దెబ్బతిన్నది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్ జెమిన్‌కే చెందుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించటం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణామాలు ఆయన హయాంలోనే జరిగాయి.
ఇదీ చదవండి: చీటింగ్ చేస్తున్నాడనే అనుమానం.. ప్రియుడి ఇంటిని తగలెట్టిన ప్రేయసి
Comments
Please login to add a commentAdd a comment