Jiang Zemin
-
చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత
బీజింగ్: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్(96) బుధవారం కన్నుమూశారు. లుకేమియాతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. అంతర్గత అవయవాలు పూర్తిగా పనిచేయకుండా పోవడం వల్ల షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆయన మృతిని ప్రకటిస్తూ కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైన్, పార్లమెంట్, మంత్రివర్గం, ఆర్మీ జారీ చేసిన ఓ లేఖను ప్రచురించింది. ‘పార్టీకి, సైన్యానికి, చైనా జాతికి జియాంగ్ జెమిన్ మరణం తీరని లోటు. ఆయన మరణం మాకు తీవ్ర వేదనను మిగిల్చింది. జెమిన్ మంచి వ్యూహకర్త, గొప్ప దౌత్యవేత్త, పార్టీ అత్యున్నత నాయకుడు.’ అని లేఖలో పేర్కొన్నారు. జెమిన్ మృతితో సంతాప దినంగా ప్రకటించారు. చైనా జాతీయ పతాకాన్ని అవనంత చేయనున్నట్లు సీసీటీవి పేర్కొంది. 1989లో తియానాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత డెంగ్ షావోపింగ్ నుంచి జియాంగ్ జెమిన్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటికే అంతర్జాతీయంగా చైనా పరపతి దెబ్బతిన్నది. దానిని తిరిగి గాడినపెట్టిన ఘనత జియాంగ్ జెమిన్‌కే చెందుతుంది. హాంకాంగ్‌పై పట్టు సాధించటం, 2008 ఒలింపిక్స్ బిడ్‌ను గెలుచుకోవటం, ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామి కావడం వంటి కీలక పరిణామాలు ఆయన హయాంలోనే జరిగాయి. ఇదీ చదవండి: చీటింగ్ చేస్తున్నాడనే అనుమానం.. ప్రియుడి ఇంటిని తగలెట్టిన ప్రేయసి -
ట్యాంక్ వీరుడిపై వీడని మిస్టరీ
ట్యాంక్‌మ్యాన్ ప్రతిఘటనకు దిగిన వేళ – 1989 జూన్ 5న కొందరు అతడి ఫొటోలు తీశారు. ఆ సమయంలో అతడు తెల్ల చొక్కా వేసుకున్నాడు. చేతిలో రెండు సంచులు న్నాయి. నేరుగా వెళ్లి భారీ ట్యాంకులకు ఎదురొడ్డి నిలబడ్డాడు. విదేశీ పత్రికల ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సమీప హోటళ్ల బాల్కనీల్లో నుంచి అతడి ఫొటోలు తీశారు. ఆ తర్వాత అతడు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. అతడికి మరణశిక్ష అమలు చేశారని కొందరు భావిస్తుంటారు. ఎక్కడో రహస్య జీవనం గడుపుతున్నాడనేది మరికొందరి అభిప్రాయం. మిలటరీ అతడి ప్రాణానికి ఎలాంటి హానీ తలపెట్టలేదని చైనా అధికారులు ప్రకటించారు. చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కూడా 1990లో బార్బరా వాల్టర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతణ్ణి చంపలేదని చెప్పారు. మొత్తం మీద ట్యాంక్‌మ్యాన్ గురించిన చర్చ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఆ ధీరునికి ఏమయ్యిందో వెల్లడించాలని చైనా ప్రభుత్వాన్ని కోరుతూ తియానన్మెన్ నిరసనల్లో పాల్గొని, ప్రస్తుతం ఆమెరికాలో హక్కుల కార్యకర్తగా పని చేస్తున్న యాంగ్ జియాన్లీ ఇటీవల ఒక పిటిషన్ రూపొందించి విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాడు. ట్యాంక్ మ్యాన్ జ్ఞాపకాలను తుడిచేసే పనిలో పడిన చైనా.. ఇటీవల అతడి ఆన్లైన్ ఫొటోలపై నిషేధం విధించింది. ఆజ్ఞలను ధిక్కరించిన వారికి శిక్ష విధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 49 శాతం మంది అతడి ఫొటోలను తాము గుర్తుపడతామంటారు. చైనా వెలుపల ట్యాంక్‌మ్యాన్ ఒక హీరో. అతడిని కేంద్రంగా చేసుకుని పలు పుస్తకాలు, డాక్యుమెంటరీలు వెలువడ్డాయి. టీవీ షోలు ప్రసారమయ్యాయి. ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటయ్యాయి. ‘చిమెరికా’పేరిట ఇటీవల ప్రారంభమైన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ ట్యాంక్‌మ్యాన్ పాపులారిటీకి ఒక ఉదాహరణ. ట్యాంక్‌మ్యాన్ మిస్టరీని ఛేదించేందుకు ఓ అమెరికన్ ఫొటో జర్నలిస్టు జరిపే అన్వేషణ ఇందులోని ఇతివృత్తం. మొత్తం మీద – తన చిత్రాలు, పోస్టర్లు, తన చిత్తరువులు ముద్రితమైన టీ షర్టులు, టీవీ షోల ద్వారా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు ట్యాంక్‌మ్యాన్. అమెరికా, చైనా పరస్పర విమర్శలు బీజింగ్/వాషింగ్టన్: ఊచకోత ఘటనలో ఎంతమంది ప్రజాస్వామ్యవాద నిరసనకారులు మరణించారో బహిరంగంగా ప్రకటించాలంటూ చైనాను అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో కోరారు. మారణకాండకు చైనా ఆర్మీదే బాధ్యత అని అన్నారు. దీనిపై చైనా విదేశాంగ మంత్రి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ అమెరికా ఆరోపణలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. పాంపియో వ్యాఖ్యలపై అమెరికాతో తీవ్ర చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ‘ప్రజాస్వామ్యం, మానవహక్కులనే నెపంతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే కొందరు అమెరికా వ్యక్తులు తమ సొంత దేశంలోని సమస్యలపై మాత్రం మాట్లాడటం లేదు’ అని షువాంగ్ అన్నారు. చైనా మౌనం వీడాలి: ఈయూ తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన దారుణాలపై చైనా పెదవి విప్పాలనీ, 30 ఏళ్ల క్రితం అక్కడ చనిపోయిన నిరసనకారులు ఎంతమందో, ఇంకెందరిని జైళ్లలో పెట్టారనే సంఖ్యలను చైనా ప్రకటించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) డిమాండ్ చేసింది. అప్పుడు అరెస్టయిన వారిలో ఇంకా జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని చైనాను ఈయూ కోరింది. -
కటకటాల కథకు వెనుక...
బో కథలోని చాలా చిక్కు ప్రశ్నలకు బీజింగ్‌లోని విలాసవంతమైన ఒక భవనం సమాధానాలను చెబుతుంది. అది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ది. ముచ్చటపడి బో దాన్ని జియాంగ్‌కు కట్టించి ఇచ్చాడు! అంత డబ్బు బోకి ఎక్కడిదని అడగటం అమాయకత్వం. భావి చైనా అధినేతగా 2011 చివరి వరకు ఒక్క వెలుగు వెలిగి గత ఏడాదే మలిగిపోయిన బో క్సిలాయ్ ‘కథ’ ఎట్టకేలకు ముగిసింది. బో ‘తలరాత’ మారడానికి ముందు ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) అత్యున్నత నాయకత్వ సంస్థ పొలిట్ బ్యూరోలో కీలక నేత. గత నెల 22న వెలువడ్డ కోర్టు ‘తీర్పు’ ఆయనకు జీవిత ఖైదును విధించింది. ఆ సందర్భంగా బో అన్నట్టు... తీర్పు వాస్తవాలపై ఆధారపడినదీ కాదు, విచారణ సజావుగా, న్యాయంగా జరిగిందీ కాదు. అలా అని బో అవినీతి మకిలి అంటని పవిత్రుడూ కాడు. అవినీతికి పాల్పడ్డ నేతలను జైళ్లకు పంపేట్టయితే కొత్త జైళ్లను కట్టాల్సివస్తుంది. చైన్ లింగ్యూ అనే ఓ ఛోటా నేత ఆ మధ్య 40 కోట్ల డాలర్ల షాంఘై పెన్షన్ నిధులను కైంకర్యం చేసి పట్టుబడ్డారు. భావి చైనా అధినేత హోదా వెలగబెట్టిన బో ఇంకెంత భారీ మొత్తం దిగమింగి ఉండాలి? 44 లక్షల డాలర్లు! ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిం చిన అంతర్జాతీయ హత్య, గూఢచర్యం, అమెరికాలో ఆశ్ర యం కోసం ప్రయత్నం, పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకోడానికి కుట్ర, మరో సాంస్కృతిక విప్లవం, వగైరా హాటు హాటు ఘాటు సీరియల్ కేసు కాస్తా అవినీతి కేసుగా ‘తేలిపోయింది.’ బో అవినీతి కేసు అవినీతి కేసు కానే కాదు. చైనా నేతల అవినీతి అతి పదిలంగా ఉంది. బ్రిటన్ ఎమ్16 గూఢచారి సంస్థతో సంబంధాలున్నాయని అందరికీ తెలి సిన నీల్ హేవుడ్తో బో కుటుంబానికి సంబంధాలుఉండేవి. బ్రిటన్ జాతీయుడైన అతడ్ని బో భార్య గు కాయ్లాయ్ హత్య చేయలేదనేది బహిరంగ రహస్యం. హేవుడ్ హత్యానేరంపై గత అక్టోబర్‌లో ఆమెకు మరణశిక్ష పడింది. ఆ శిక్ష ఇంకా అమలుకాలేదు, కాదు. న్యూయార్క్‌లో చదువుతున్న కొడుకు గువాగువా జోలికి పోకుండా వదిలేస్తే, బుద్దిగా పార్టీ నూతన నేతలు చెప్పినట్లు నోరు కుట్టేసుకోడానికి గు ఒప్పందం కుదుర్చుకుంది. 2007లో చనిపోయిన తండ్రి బో యావో ప్రభావంతోనే బో క్సిలాయ్ రాజకీయ హత్యలు, గూఢచర్యం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని అప్పట్లో పార్టీ నేతలు బాకాలూదారు. డెంగ్ హయాంలోని ‘చిరస్మరణీయమైన ఎనిమిది మంది నేతల’లో యావో ఒకడు! మావో సాంస్కృతిక విప్లవ కాలంలో అతడు జైలు పాలయ్యాడు. ఆ యావో ప్రోత్సాహంతోనే బో తాను కార్యదర్శిగా ఉన్న క్సింజియాంగ్‌లో మావోయిజాన్ని, సాంస్కృతిక విప్లవాన్ని పునరుద్ధరించ యత్నించాడని ప్రచారం సాగింది! గత ఏడాది నవంబర్‌లో లాంఛనంగా పార్టీ 18వ కాంగ్రెస్ జరిగేలోగానే నూతన నాయకత్వ ప్రకటన జరిగింది. ఆ తదుపరి బో పై సంధిస్తున్న ఆరోపణల అస్త్రాలన్నీ ఆగిపోయాయి. బో అవినీతికి పాల్పడి, నిధులను విదేశాలకు తరలించారనే ఆరోపణపైనే విచారణ తతంగం సాగింది. బో కథలోని చాలా చిక్కు ప్రశ్నలకు బీజింగ్‌లోని ఒక విలాసవంతమైన భవనం సమాధానాలను చెబుతుంది. అది పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ది. ముచ్చటపడి బో దాన్ని జియాంగ్‌కు కట్టించి ఇచ్చాడు! అంత డబ్బు బోకి ఎక్కడిదని అడగటం అమాయకత్వం. జియాంగ్‌తో పాటూ, మాజీ ప్రధాని వెన్ జియావో బావోకు కూడా బో అనుయాయి. వారి అండతోనే అతడు ఒక్కొక్క మెట్టే ఎక్కి పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ వాకిట నిలిచాడు. అక్కడ నుంచి కథ అడ్డం తిరిగింది. బోకి పార్టీలో ప్రధాన ప్రత్యర్థి, నేటి అధ్యక్షుడు క్సీ జింగ్పింగ్ తెలివిగా పావులు కదిపి, జియాంగ్, వెన్లను ప్రసన్నం చేసుకున్నాడు. అయినా బోలాంటి గట్టి పిండాన్ని వదుల్చుకోడం తేలికేం కాదు. క్సీకి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. బో కుడి భుజం వాంగ్ లిజున్ ఆశ్రయం కోసం అమెరికా కాన్సలేట్‌ను ఆశ్రయించి సంచలనం రేపాడు. చాంగ్కిగ్యాంగ్ పోలీస్ బాస్ అయిన వాంగ్ ప్రత్యర్థులను గుట్టుగా హతమార్చడంలో సిద్ధహస్తుడు. వాంగ్లాంటి పోలీసు బాసులను వాడుకొని, తర్వాత వారిని బలి పశువులను చేయడం చైనా అగ్రనేతలకు అలవాటే. వాంగ్ మిగతావారికంటే రెండాకులు ఎక్కువే చదివాడు, దీపం ఉండగానే అమెరికాకు పారిపోవాలని ప్రయత్నించాడు. హేవుడ్ అసలు హంతకుడైన వాంగ్‌కు అవినీతి ఆరోపణలపై 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. ఓ రెండేళ్లు గడిచేసరికే వాంగ్ ‘సత్ప్రవర్తన’కు మెచ్చి విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. వాంగ్‌ను తురుపు ముక్కగా వాడి క్సి, బో ఆట కట్టించాడు. పనిలో పనిగా పార్టీలోని మరో ప్రత్యర్థి జౌ యాంగ్ కాంగ్‌ను పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలోకి రాకుండా చేశాడు. ప్రపంచంలోనే అతి పెద్ద దేశానికి కొద్ది మంది నేతృత్వమే సమర్థవంతమైనదని సూత్రీకరించారు. పీబీ స్టాండింగ్ కమిటీని ఏడుగురికి కుదించి జౌను సాధారణ పీబీ సభ్యునిగా మిగిల్చారు. 2022 వరకు పార్టీలో క్సీకి తిరుగు లేదు. - పిళ్లా వెంకటేశ్వరరావు