చైనాలోని షాంఘై నగరంలో వెంగ్స్ కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రియల్ కంపెనీలోని రిఫ్రిజరేషన్ యూనిట్లో ఈ రోజు ఉదయం ద్రవ అమోనియా గ్యాస్ విడుదలై 15 మంది కార్మికులు మరణించారని ఉన్నతాధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. మరో 26 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఆరుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.