తల్లి ఎదుటే కోపంతో బ్రిడ్జ్‌పై నుంచి దూకి.. | Angry boy jumped off a bridge in Shanghai in front of his mother | Sakshi
Sakshi News home page

తల్లి ఎదుటే కోపంతో బ్రిడ్జ్‌పై నుంచి దూకి..

Published Thu, Apr 18 2019 3:50 PM | Last Updated on Thu, Apr 18 2019 4:12 PM

Angry boy jumped off a bridge in Shanghai in front of his mother - Sakshi

షాంగై : కన్నతల్లి ముందే ఓ యువకుడు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైనాలో బుధవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి షాకైన ఆ తల్లి బ్రిడ్జ్‌పైనే కుప్పకూలి ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. దీనికి సబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

వివరాలు.. కారులో షాంగై బ్రిడ్జ్‌ మీదుగు వెలుతున్నసమయంలో తల్లికి తన 17 ఏళ్ల కుమారిడికి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు కారు లోంచి దిగి బ్రిడ్జ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement