భారత సరిహద్దులోని ప్యాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసినట్ల తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డులను కలుపుతూ 400 మీటర్ల వంతెనను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన సాటిలైట్ అమెరికాకు చెందిన బ్లాక్‌స్కై సంస్థ విడుదల చేసింది. ఈ బ్రిడ్జ్ పూర్తి కావటం వల్ల సరిహద్దుల్లో సైనిక దళాలు, సామగ్రిని మోహరించడానికి చైనాకు సమయం తగ్గనున్నట్లు తెలుస్తోంది.
🛑 China has completed a 400-meter bridge over Pangong Lake in #Ladakh, enhancing troop movement between the north and south banks and reducing travel by 50-100 km. Located 2 km from the Line of Actual Control (#LAC) in the disputed Aksai Chin area, this bridge is strategically… pic.twitter.com/qMCVzN7ypg
— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 30, 2024
ఈ వంతెన పూర్తి అయి జూలై 9 నుంచే ఉపయోగంలోకి వచ్చి పలు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ సరిహద్దుకు కేవలల 25 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఈ బ్రిడ్జ్‌కి ఉత్తరంగా ఉన్న ఖుర్నాక్ కోట ప్రాంతంలో చైనా ఆర్మీ రెండు హెలిపాడ్లు నిర్మించినట్లు కూడా ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఈ ప్రాంతం 1958కి ముందు భారత్ భాగంగానే ఉండేది. కానీ, అనంతరం ఈ ప్రాంత్నాన్ని చైనా ఆక్రమించింది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావటం వల్ల ప్యాంగాంగ్ సరస్సు మధ్య 50 నుంచి 100 కిలోమిటర్ల దూరం తగ్గనుంది. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై గతంలో భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘‘దాదాపు 60 ఏళ్లుగా చైనా అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఇలాంటి అక్రమ ఆక్రమణలను భారతదేశం ఎన్నడూ అంగీకరించదు’’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment