చైనాలో ఐసీఐసీఐ బ్యాంకు తొలి శాఖ ఆరంభం
షాంఘై: ఇరు దేశాలలోని వ్యాపారవేత్తలకు ఉపయుక్తంగా ఉండటం కోసం ప్రైవేట్ బ్యాంకుల అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంకు చైనాలోని షాంఘైలో తన తొలి శాఖను శనివారం ఏర్పాటుచేసింది. ఆ శాఖను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ శాఖ కార్పొరేట్ బ్యాంకింగ్, ఫైనాన్స్, ట్రెజరీ వంటి పలు సేవలను అందించనుంది. బ్యాంకు నూతన శాఖ ప్రారంభోత్సవంలో మోదీతో పాటు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఇరు దేశాల సీనియర్ అధికారులు, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వాణిజ్య వృద్ధిలో, పెట్టుబడుల పెరుగుదలలో తమ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుం దని చందా కొచ్చర్ అన్నారు. తమ బ్యాంకు చైనాలో భార త్‌కు చెందిన జాయింట్ వెంచర్ల అభివృద్ధికి సాయపడుతుందని చెప్పారు. అలాగే భారత్‌లో మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టే చైనా కంపెనీలకు తోడ్పాటునందిస్తుందని తెలిపారు.