
షాంఘై తరహాలో ఏపీ నూతన రాజధాని
హైదరాబాద్: చైనాలోని షాంఘై తరహాలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 1991 నాటి నుంచి చైనా 68 రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రపంచంలో ప్రముఖ నౌకాశ్రయాల్లో నాలుగు చైనాలోనే ఉన్నాయని... అలాగే ప్రపంచంలో 60 శాతం సెల్ ఫోన్లు చైనాలోనే తయారువుతున్నాయని చంద్రబాబు చెప్పారు.
భారత్తో సంబంధాలకు చైనా ఉత్సాహాం చూపిస్తుందని అన్నారు. షాంఘైలో రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ల తరహాలో ఉన్నాయన్నారు. ఏపీ రాజధాని ప్రాంతానికి ప్రపంచస్థాయి పరిశ్రమలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి పరిశ్రమలు రావాలని చంద్రబాబు ఆకాక్షించారు. గంటకు 450 కి.మీ వేగంతో నడిచే రైల్వే ట్రాక్ చైనా ఉందన్నారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే రైల్వే ట్రాక్ను చైనీయులు 10 ఏళ్లలో నిర్మించారని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.