![China to Reopen Over 200 Cinemas in Shanghai - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/31/movie-theatre-image.jpg.webp?itok=mL0wXXh9)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ను మూసివేశారు. సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్స్ కళ తప్పాయి. అయితే చైనాలో థియేటర్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు. షాంఘై నగరంలోని థియేటర్స్‌లో శనివారం, నుంచి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడిని లోపలికి అనుమతించాలని, ఏ ఇద్దరూ పక్క పక్కనే కూర్చోకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందట. ప్రస్తుతానికి పాత సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. కొత్త సినిమాలు విడుదల కావడానికి మరికొంచెం సమయం పట్టేలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment