reopens
-
ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్.. ఖాతా పునరుద్ధరించినట్లు మస్క్ ప్రకటన
ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్.. ఖాతా పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటన -
తెలంగాణలో మోగిన బడి గంట..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బడి గంట మోగింది. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో.. 17 నెలల తర్వాత విద్యార్థులు బడి బాట పట్టారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝళిపిస్తోంది. రాజేంద్రనగర్‌లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 12 పాఠశాల బస్సులను అధికారులు సీజ్ చేశారు. పిల్లల్ని స్కూళ్లకు పంపాలా? లేదా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ఎలాంటి భయం లేకుంటేనే విద్యార్థుల్ని పాఠశాలలకు పంపాలని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలలు మినహా అన్ని విద్యాసంస్థలను నేటి నుంచి తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ ఉంటాయని స్పష్టం చేసింది. అయితే గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్ల ప్రారంభాన్నీ నిలిపి వేసింది. విద్యా సంస్థల పునఃప్రారంభంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో.. విద్యాశాఖ మంగళవారం ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, స్కూళ్లలో శానిటైజేషన్ ప్రక్రియపై గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో ప్రైవేటు పాఠశాలలు టీచర్ల ద్వారా ఆన్లైన్లో బోధన కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది. స్కూల్‌ని సందర్శించిన గవర్నర్ తమిళసై రాజ్ భవన్ స్కూల్‌ని గవర్నర్ తమిళిసై బుధవారం ఉదయం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మాస్కు ధరించడంపై పిల్లలకు అవగాహన ఉందన్నారు. చిన్న పిల్లలు మాత్రమే మాస్కులు సరిగా పెట్టుకోవడం లేదని అన్నారు. విద్యార్థులతో మాట్లాడటం సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. విద్యార్థులను ధైర్యంగా స్కూళ్లకు పంపుతున్న పేరెంట్స్‌కు తమిళిసై అభినందనలు తెలిపారు. -
మాట్లాడండి పిల్లలతో
స్కూలుకు వెళ్లడం మొదలెట్టిన పిల్లలతో మాట్లాడండి అంతా సరిగ్గా ఉందా అని. స్కూలుకు వెళ్లబోతున్న పిల్లలతో మాట్లాడండి... అంతా సరిగ్గా ఉండబోతోందని. చాన్నాళ్ల తర్వాత స్కూలుకు వచ్చిన పిల్లలతో టీచర్లు మాట్లాడండి ఇంట్లో ఎలాంటి వొత్తిళ్ల మధ్య రోజులు గడిచాయోనని. పిల్లలకు ఇప్పుడు మాటలు అవసరం. ఏ మాటలు లేక వాళ్లు ఇళ్లల్లో చాలా కాలంగా మూగబోయి ఉన్నారు. భయాలు సందేహాలు మూటగట్టుకుని ఉన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు వారితో ఎంత మాట్లాడితే అంత మంచిది ఇప్పుడు. కొందరు పిల్లలకు కోవిడ్ అంటే భయం లేదు. కొందరు పిల్లలకు కోవిడ్ అంటే ఇంకా భయం పోలేదు. వీరు రోజంతా మాస్క్‌లు పెట్టుకుని క్లాసుల్లో కూచోవడం ఎంత సాధ్యమో ఈ పిల్లలకే తెలియదు. క్లాసులో దూరం కూచున్నా బ్రేక్ టైమ్‌లో లంచ్ టైమ్‌లో ఒకరితో ఒకరు దగ్గరగా కూడకుండా ఈ పిల్లలు ఉండలేరు. ఆడుకోవడానికి పరిగెత్తకుండా ఉండలేరు. అయితే ఆ రోజులు మళ్లీ వస్తాయి. మరి కొన్నాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఈ పిల్లలతో పదే పదే మాట్లాడాల్సి ఉంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేకపోవడం వల్ల ఆన్లైన్ క్లాసులు మిస్సయిన పిల్లలు చదువులో వెనకబడినా, ఇప్పటికిప్పుడు పుంజుకోకపోయినా ‘మరేం పర్వాలేదు. మెల్ల మెల్లగా అన్నీ చదువుకో’ అని తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టనని హామీ ఇవ్వాల్సి ఉంది. టీచర్లు కూడా పరీక్షలు, మార్కులు అంటూ వారిని న్యూనత పరచమని చెప్పాల్సి ఉంది. చాలా మంది పిల్లలు ఒక సంవత్సర కాలంగా తమ మనసులో గూడు కట్టుకుపోయిన విషయాలను తమ స్నేహితులతో పంచుకోవాలనుకుంటారు. హైపర్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వారిని అర్థం చేసుకునే విధంగా తమ తీరు ఉంటుందని టీచర్లు వారికి చెప్పాల్సి ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా కోవిడ్ పట్ల ఎక్కువ భయం కాని తక్కువ భయం కాని కల్పించకుండా ఇది అందరు కలిసి సమర్థంగా ఎదుర్కొనగలిగిన మహమ్మారి అని వారిలో ధైర్యం నింప గలగాలి. అందుకూ మాట్లాడాలి. ఇప్పుడు పిల్లలు మొదలెడుతున్నది కొత్త చదువు. టీచర్లు చెప్పాల్సింది తల్లిదండ్రులు ఆశించాల్సింది కూడా కొత్త చదువే. మార్కులు, గ్రేడ్లు కన్నా పాఠాలు, స్నేహాలు, నవ్వులు, దూరం దూరంగా ఆడదగ్గ ఆటలు, వొత్తిడి లేని క్లాస్‌రూమ్‌లు, ఊరడించే కథలు ... ఇవి ఇప్పటి అవసరమని, స్కూలు అలాగే ఉంటుందని టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు భరోసా ఇవ్వాలి. ప్రమాదం గడిచిపోయే వరకు పిల్లలకు స్కూలు ఒక సురక్షితమైన ప్రేమ పూర్వక అమ్మ ఒడి అని అర్థం చేయించ గలిగితే పిల్లలు నిజమైన వికాసం పొందుతారు. కేస్ 1 ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పల్లెటూరులో ఎనిమిదవ తరగతి విద్యార్థి వేణు (అసలు పేరు కాదు) లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఉండిపోయాడు. లాక్డౌన్ ఎత్తేశాక స్కూలు తెరిచే పరిస్థితి రానందున తండ్రి పని చేసే చోటుకు ఆయనతో వెళ్లి కాలక్షేపం చేసేవాడు. తండ్రికి సాయం చేసేవాడు. మధ్యలో పుస్తకాలు చూడటం, టీవీ క్లాసులు వినడం అంతగా చేయలేదు. ఇప్పుడు స్కూళ్లు తెరిచారు. కాని స్కూలుకు రావాలంటే జంకు. పాఠాలు ఏమాత్రం చదవగలననే జంకు. మళ్లీ ఒక క్రమశిక్షణకు రావడం పట్ల జంకు. కాని తల్లిదండ్రులు వేణును తప్పనిసరిగా చదువులో పెట్టాలనుకున్నారు. స్కూలుకు తీసుకొచ్చి ‘నాడు నేడు’ వల్ల వచ్చిన కొత్త హంగులను చూపించారు. పుస్తకాలు యూనిఫామ్‌లు బూట్లు స్కూల్ నుంచి ఇప్పించి ఉత్సాహపరిచారు. టీచర్లతో మాట్లాడించారు. సిలబస్ తక్కువగా ఉంటుందని, మళ్లీ కొన్ని బేసిక్స్ చెప్పి పాఠాలు చెప్తామని టీచర్లు చెప్పారు. వేణుకు మెల్లగా ధైర్యం పుంజుకుంది. స్కూలుకు రావడం మొదలెట్టాడు. తల్లిదండ్రులు, టీచర్లు ఇలాంటి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇంకా స్కూలుకు రావాల్సిన ‘వేణు’లు అక్కడక్కడా కొద్దిమంది ఉన్నారు. వారితో మాట్లాడాల్సి ఉంది. కేస్ 2 ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పెద్ద టౌన్లో ప్రయివేటు స్కూల్లో లత (పేరు మార్పు) ఇప్పుడు తొమ్మిదో తరగతికి హాజరు కావాలి. లతకు స్కూలుకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలో ఆమె భయపడింది. అదీగాక రోజూ న్యూస్‌లో థర్డ్ వేవ్ గురించి వింటోంది. అదీ ఒక భయమే. కాని ఇన్నాళ్లూ స్కూల్ లేక ఇంట్లోనే ఉండిపోతున్న లత మెల్లగా డల్ అయిపోవడం గమనించిన తల్లిదండ్రులు కోవిడ్ జాగ్రత్తలతో లతను స్కూలు పంపించాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పారు. టీచర్లతోనూ చెప్పించారు. కాని లత తొలి రోజు స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చేసింది. ఆమెకు ఆ స్కూల్లో ఇష్టమైన ఇద్దరు ముగ్గురు టీచర్లు ఇప్పుడు లేరు. మానేశారు. క్లాస్‌లో కూడా మునపటిలా ఫ్రెండ్స్‌తో దగ్గర దగ్గరగా కూచునే వీలు లేదు. ఇదంతా లతకు నచ్చలేదు. కాని ఈ పరిస్థితి కొన్నాళ్లే ఉంటుందని, క్లాస్‌రూమ్‌లో ఫ్రెండ్స్‌ను దూరం నుంచైనా చూసి మాట్లాడటం మంచిదని, పాత టీచర్లు వెళ్లి కొత్త టీచర్లు వచ్చినా వారు కూడా మెల్లగా నచ్చుతారని లతకు చెప్పాల్సి ఉంది. ఆ అమ్మాయితో ఇంకా మాట్లాడాల్సి ఉంది. కేస్ 3 హైదరాబాద్‌లో ఒక పేరున్న ప్రయివేట్ స్కూల్లో చదువుతున్న కౌశిక్ (పేరు మార్పు) సెవన్త్ క్లాస్ పాఠాలను ఆ స్కూల్ టంచన్‌గా నడిపిన ఆన్లైన్ క్లాసుల ద్వారా వింటూ వచ్చాడు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో సెప్టెంబర్ 1 నుంచి స్కూల్‌కు హాజరయ్యి వినాలనే సరికి డల్ అయిపోయాడు. ‘నేను స్కూల్‌కి పోను. కోవిడ్ ఉంది’ అంటున్నాడు తల్లిదండ్రులతో. అసలు కారణం వేరే ఉంది. కౌశిక్ కెమెరా ఆఫ్‌లో పెట్టి మధ్య మధ్యలో యూ ట్యూబ్ చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, ఎగ్జామ్స్ కూడా తల్లిదండ్రులను అడిగి రాయడం, ఒక్కోసారి సోఫాలో పడుకుని హెడ్‌ఫోన్స్ ద్వారా పాఠాలు వినడం... వీటికి అలవాటు పడ్డాడు. ఇవన్నీ స్కూల్‌కు వెళితే ఉండవు. టీచర్లు కెమెరాలో కనపడితే పెద్ద భయం ఉండదు. నేరుగా కనపడితే వారిని నిజంగా ఫేస్ చేయాలి. గతంలో లేని భయం ఇప్పుడు కొత్తగా పట్టుకుంది. కౌశిక్‌తో తల్లిదండ్రులు ఇంకా ఏం మాట్లాడలేదు. ‘ఏయ్.. నువ్వు స్కూల్‌కు వెళ్లాల్సిందే’ అంటున్నారు. టీచర్లు కూడా స్కూల్‌కు రావాల్సిందే అంటున్నారు. కౌశిక్‌ను ఆన్లైన్ విద్యార్థి నుంచి ఆఫ్‌లైన్ విద్యార్థిగా మార్చడానికి మాట్లాల్సింది. మాట్లాడాల్సిన అవసరాన్నే ఇరుపక్షాలు ఇంకా గుర్తించడం లేదు. ‘స్కూల్ ఫోబియా’ పోగొట్టాలి గతంలో ‘ఎగ్జామినేషన్ ఫోబియా’ వినేవాళ్లం. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత స్కూల్‌కు వెళ్లాల్సి రావడం వల్ల పిల్లల్లో స్కూల్ ఫోబియా కనిపించవచ్చు. వాళ్లు ఇన్నాళ్లు హాయిగా హాలిడేస్ గడిపి స్కూల్‌కు వెళుతున్నారనే ఆలోచన పేరెంట్స్ తీసేయాలి. వారి స్ట్రెస్ వారు అనుభవించి మళ్లీ కొత్తగా స్కూల్లో అడుగుపెడుతున్నారు. 6 నుంచి 8 వారాల కాలం వారు అడ్జస్ట్ కావడానికి పడుతుంది. ఈ కోవిడ్ సందర్భంలో తేలిక వాతావరణం లో ఉంచుతూ పాఠాల్లోకి తీసుకెళ్లాలి. ఏ సమస్య వచ్చినా మనసు విప్పి చెప్పుకోమని తల్లిదండ్రులు, టీచర్లు భరోసా ఇవ్వాల్సిన అసలైన సమయం ఇది. టీచర్లు కాని తల్లిదండ్రులు కాని స్నేహపూర్వకంగా ఉంటామని హామీ ఇస్తేనే ఈ కాలంలో పిల్లలు మునుపటి ఉత్సాహం నింపుకుంటారు. – డా. కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్. -
సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో
కెమెరా ఆన్ అయ్యేదెప్పుడు? క్లాప్ బోర్డ్ కొట్టేదెప్పుడు? డైరెక్టర్ స్టార్ట్ యాక్షన్ అనేదెప్పుడు? నటీనటులు మేకప్ బాక్స్ తెరిచేదెప్పుడు? అనే ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆదివారం ఒకటి, సోమవారం ఒకటి, మంగళవారం ఒక సినిమా... సెట్టుకి వెళదాం.. షూటింగు చేద్దాం... ఛలో ఛలో అంటూ షూటింగ్స్ ప్రారంభించుకున్నాయి. నెలాఖరుకల్లా మరిన్ని సినిమాల షూటింగ్స్‌తో పరిశ్రమ కళకళలాడనుంది. ఆన్ సెట్స్‌లో ఉన్న, త్వరలో ఆన్ సెట్స్‌కి రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మరోవైపు సంపూర్ణేష్‌బాబు హీరోగా చేస్తున్న ‘క్యాలీఫ్లవర్’ షూటింగ్ ఆల్రెడీ హైదరాబాద్‌లో మొదలైపోయింది. ఈ నెలాఖరు లోపు మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ షూటింగ్ ఈపాటికే పూర్తి కావాల్సింది. కానీ కోవిడ్ వల్ల కుదరలేదు. ఈ సినిమా షూటింగ్‌ని ఈ నెలాఖరున ప్రారంభించాలనుకుంటున్నారు. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ జూలై 30న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప’ షూటింగ్ మూడు నాలుగు రోజులు చేస్తే పూర్తయ్యే పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చిపడింది. ఈ నెల చివర్లో ఈ సినిమా షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. అలాగే కోవిడ్ కారణంగా బ్రేక్ పడిన ‘ఖిలాడి’ చిత్రీకరణ కూడా ఈ నెల చివర్లో షురూ కానుంది. రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మే 28న విడుదల కావాల్సింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇక ‘మనం’ మూవీ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ ఫైనల్ షెడ్యూల్ మినహా పూర్తయింది. మేజర్‌గా వైజాగ్, ఇటలీలో షూటింగ్ జరుపుకున్న ‘థ్యాంక్యూ’ చిత్రం ఫైనల్ షెడ్యూల్ ఈ నెల 20 తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గౌర్ కీలక పాత్రధారి. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ అన్ని జాగ్రత్తలతో కొన్నాళ్లు ‘శాకుంతలం’ చిత్రీకరణ జరిగింది. లాక్డౌన్ వల్ల బ్రేక్ పడింది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ఈ మైథాలాజికల్ మూవీ చిత్రీకరణ కూడా ఈ నెలాఖరున ఆరంభం కానుంది. ఈ చిత్రాలతో పాటు నాని ‘శ్యామ్ సింగరాయ్’, బెల్లంకొండ గణేష్ కొత్త చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాలు ఈ నెలలోనే పక్కాగా సెట్స్‌కి వెళతాయని తెలిసింది. ఇక ఎన్టీఆర్–రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా, రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్‌లోని మూవీ, నిఖిల్ ‘18 పేజెస్’, బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ చిత్రాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయని సమాచారం. బాలీవుడ్లో కూడా షూటింగ్స్ బెల్ మోగింది. తన తాజా చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్లో సోమవారం నుంచి ఆమిర్ ఖాన్ పాల్గొంటున్నారు. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నేను సైతం అంటూ షూటింగ్‌కి రెడీ అయ్యారు. ‘‘లాక్డౌన్ 2.0 తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నాను. షాట్ కోసం ఉదయం ఏడు గంటలకే లొకేషన్‌కు చేరుకునేందుకు డ్రైవింగ్ చేస్తున్నాను’’ అని అమితాబ్ తన సోషల్æమీడియా అకౌంట్లో షేర్ చేశారు. ‘గుడ్ బై’ షూటింగ్లో పాల్గొంటున్నారాయన. ఇదే సినిమా షూటింగ్లో జాయినయ్యారు రష్మికా మందన్నా. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న ‘మహారాజా’ సినిమా షూటింగ్ ఆల్రెడీ ముంబైలో స్టార్ట్ అయ్యింది. ‘‘ఇక వర్క్ చేయాల్సిన టైమ్ వచ్చింది’ అని రీసెంట్గా షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి షారుక్‌ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’ చిత్రీకరణ ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇంకా ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’, సల్మాన్‌ఖాన్ ‘టైగర్ 3’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’, అజయ్ దేవగణ్ ‘మైదాన్’ వంటి చిత్రాలు కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. కోలీవుడ్‌లో కూడా షూటింగ్స్ జరుపుకునేందుకు ఆయా చిత్రబృందాలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. విశాల్ తాజా సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇక కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా, సూర్య హీరోగా పాండిరాజ్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం, విక్రమ్ ‘కోబ్రా’, కార్తీ ‘సర్దార్’ చిత్రాలు షూటింగ్స్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. -
శుక్రవారం పండగ
శుక్రవారం సినీప్రియులకు ప్రియమైన రోజు. శుక్రవారమైతే కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. అయితే కొన్ని నెలలుగా శుక్రవారం కిక్ మిస్ అయింది. కోవిడ్ వల్ల థియేటర్స్ మూసేశారు. ఈ శుక్రవారం తెలంగాణలో థియేటర్స్ తెరచుకున్నాయి. హాలీవుడ్ చిత్రం ‘టెనెట్’ విడుదలైంది. థియేటర్స్‌కు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంది అన్నాయి ట్రేడ్ వర్గాలు. ఆ విశేషాలు. సినిమాలో ఉన్న మజా తెలిసేది పెద్ద తెర మీదే. సినిమాను పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేయగలిగేది థియేటర్స్‌లోనే. సినిమాలో ఉన్న ఎనర్జీ తాలూకు రీసౌండ్ వినిపించేదీ థియేటర్స్‌లోనే. 50 శాతం సీటింగ్ కెపాసిటితో తెలంగాణాలో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాయి. ‘థియేటర్స్‌కు రండి. భద్రమైన మూవీ ఎక్స్పీరియన్స్ అందిస్తాం’ అంటూ థియేటర్స్ ఓపెన్ చేశారు. అసలు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూస్తాడా? ఎన్ని టిక్కెట్లు తెగుతాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్ సంఖ్య ఆశాజనకంగా ఉంది అంటున్నారు థియేటర్స్ ఓనర్లు. ‘ఇంత సంఖ్యలో ప్రేక్షకులు రావడం చాలా సంతోషమైన విషయం. ఇది ఇలా కొనసాగితే థియేటర్స్ సిస్టమ్ త్వరగా కోలుకుంటుంది’ అన్నారు కొందరు ఎగ్జిబిటర్స్. ∙ఏయంబీ మల్టీప్లెక్స్‌లో 22 షోలు వేస్తే, అన్ని షోలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో మొత్తం 650 సీటింగ్ అంటే.. కోవిడ్ మార్గదర్శకాల నేపథ్యంలో 50 శాతం టిక్కెట్లే అమ్మాలి. అంటే 325 మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుంది. ఆ థియేటర్లో సుమారు 300 టిక్కెట్లు తెగాయని తెలిసింది. అంటే అటూ ఇటూగా స్క్రీన్ నిండినట్లే. ఎల్బీ నగర్‌లోని విజయలక్ష్మీ థియేటర్లో ఉదయం ఆటకు 117 మంది, మధ్యాహ్నం ఆటకు 63 మంది ప్రేక్షకులు కనిపించారని ఓ ఎగ్జిబిటర్ పేర్కొన్నారు. అలాగే సింగిల్ స్క్రీన్‌లో దేవి థియేటర్‌ను రీ ఓపెన్ చేశారు. ఒక ఆటకు 130 మంది వరకూ వచ్చారట. ‘‘ఇది (‘టెనెట్’) హాలీవుడ్ సినిమా కాబట్టి మాస్ ఏరియాల్లో తక్కువ ఆడియన్స్ కనిపించారు. అదే తెలుగు సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాం. ఏది ఏమైనా అసలు ప్రేక్షకులు వస్తారా? అనే సందేహం మాత్రం తీరిపోయింది. వస్తారని తేలిపోయింది. ఇది శుభపరిణామం. పైగా నాగచైతన్య, సాయిధరమ్ తేజ్ వంటివాళ్లు థియేటర్లకు వెళ్లడం ఆనందించదగ్గ విషయం. సెలబ్రిటీలు కూడా థియేటర్లకి వెళ్లడంతో ప్రేక్షకుల్లో భయం తగ్గుతుంది. ఇక థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు జాగ్రత్తల విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భార్యాభర్తలు మాత్రం ఒక సీటు గ్యాప్ తర్వాత కూర్చుని చూడ్డానికి ఇబ్బందిపడ్డట్లు చెప్పారు’’ అన్నారు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్. స్టార్స్ సందడి ‘‘సినిమా ప్రేమికుడికి థియేటర్‌ను మించిన హ్యాపీ ప్లేస్ ఏంటి? థియేటర్స్‌కు రండి. సినిమాలను ఎంజాయ్ చేయండి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. శానిటైజర్‌ను ఎప్పటికప్పుడు వాడండి’’ అని థియేటర్స్‌కు ప్రేక్షకులను రమ్మంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు సాయిధరమ్ తేజ్. ‘‘9 నెలల తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి వచ్చాను. థియేటర్స్ సార్... థియేటర్స్ అంతే!’ అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. నాగచైతన్య, నిఖిల్, విశ్వక్ సేన్, మారుతి కూడా థియేటర్స్‌కు వెళ్లి సినిమాని వీక్షించినవారిలో ఉన్నారు. ధైర్యంగా అనిపించింది సినిమాకు వచ్చే ప్రేక్షకుడికి భద్రతతో పాటు ధైర్యం కూడా కలిగించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. థియేటర్‌కు వచ్చిన కొందరు ప్రేక్షకుల అనుభవాన్ని పంచుకోమంటే ఇలా అన్నారు. ‘‘శానిటైజేషన్, సీటింగ్‌లో దూరం పాటించడం, ఎక్కడికక్కడ శానిటైజర్లు ఏర్పాటు చేయడం బావుంది. ధైర్యంగా అనిపించింది’’ అన్నారు కొందరు. ‘‘సీట్‌కి సీట్‌కి గ్యాప్ ఇవ్వడం వల్ల ప్రేమికులకు కాస్త ఇబ్బంది అనిపించే అవకాశం ఉంది’’ అన్నారు కొందరు. -
మళ్లీ మేజిక్!
థియేటర్లు ఆరంభమయ్యాయి. 50 శాతం సీటింగ్‌తో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారీ సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందేమోననే ఆలోచన చాలామందికి ఉంది. మరి.. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలానే ఆలోచించారేమో. ‘బాహుబలి’ రెండు భాగాలను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మళ్లీ మేజిక్ జరగబోతోంది’’ అంటూ ఈ శుక్రవారం తొలి భాగం, వచ్చే శుక్రవారం మలి భాగాన్ని థియేటర్లు ఆరంభమైన రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రేక్షకులు ఎక్కడ?
నిండుగా ఉంటేనే థియేటర్స్‌కి అందం. థియేటర్స్ నడిపేవారికి ఆనందం. థియేటర్ గేట్‌కి హౌస్‌ఫుల్ బోర్డ్‌కి మించిన మెడల్ ఏముంటుంది? అయితే కరోనా థియేటర్స్ బిజినెస్‌ను బాగా దెబ్బకొట్టింది. ఏడు నెలలు ఖాళీగా, సందడి లేకుండా ఉండిపోయాయి హాళ్లు. థియేటర్స్ మళ్లీ తెర్చుకోండి, కానీ కొన్ని షరతులు అంది ప్రభుత్వం. 50 శాతం మించి ఆడియన్స్‌కు అనుమతి లేదు. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. మరి థియేటర్స్‌కి ప్రేక్షకులు వచ్చారా? పరిస్థితి ఏంటి? చూద్దాం. లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లు మూసివేసి ఉన్నప్పుడు, ప్రేక్షకులు వస్తారో రారా అనేది పక్కనపెడితే ముందైతే థియేటర్స్ తెరవాలి, దాన్ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? అనే వాదనలు వినిపించాయి. జాగ్రత్తలు తీసుకుందాం, జనమే అలవాటు పడతారు అనే ధైర్యం కూడా ఉంది థియేటర్స్ యాజమాన్యంలో. అక్టోబర్ 15నుంచి థియేటర్స్ తెరుచుకోమని, గైడ్‌లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి ఉండడంతో కొత్త చిత్రాలేవీ రిలీజ్ చేయలేదు. గతంలో విడుదలైన చిత్రాలనే మళ్లీ ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో మునుపటికంటే టికెట్ రేట్ చాలా తగ్గించారు. ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షించే భాగంలో ఇదొకటì . అయితే థియేటర్స్‌కి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం షాక్‌కి గురి చేస్తోంది. పలు చోట్ల పట్టుమని పదిమంది కూడా కనిపించలేదట. ఢిల్లీలో... ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో కోవిడ్ గైడ్‌లైన్స్‌తో థియేటర్ గేట్లు తెరిచారు. 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో 150 వరకు అనుమతిస్తూ, టికెట్ కౌంటర్ వద్ద సిబ్బంది టికెట్లు తెంచడానికి రెడీ అయ్యారు. ఏడు నెలలవుతోంది, టికెట్లు చింపి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవాళ్లకు చిన్న షాక్ తగిలింది. కేవలం ఐదుగురు మాత్రమే సినిమా చూడటానికి వచ్చారు. ఇంకెవరైనా వస్తారని అరగంట ఆగారు. ఉహూ... వచ్చిన ఆ ఐదుగురికి సినిమా వేశారు. ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే కుతూహలంతోనే వచ్చాను’ అని సమాధానమిచ్చాడో ప్రేక్షకుడు. గురువారం మ్యాట్నీ షో పరిస్థితి ఇది. శుక్రవారం కుటుంబంతో కలసి సినిమా చూడాలని ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆ థియేటర్‌కి వచ్చిన వ్యక్తి, ‘ఇంకా ఇంట్లోనే ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందుకే థియేటర్లో సినిమా చూడాలనుకున్నాం’ అనడం విశేషం. వైజాగ్‌లో.. వైజాగ్‌లో వరుణ్ ఐనాక్స్, పూర్ణ అనే థియేటర్‌ను ఓపెన్ చేశారు. ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల సంఖ్య పదికి దాటలేదు. వైజాగ్‌లో రాత్రి 7 గంటల షో ఎప్పుడూ హౌస్‌ఫుల్. అది కూడా ఏడుగురుకంటే ఎక్కువ మంది లేరట. ఇలా షోకి వెయ్యి రూపాయిల వసూళ్లు కూడా రావడంలేదట. ఓ మూడు పాత ఇంగ్లిష్ సినిమాలను రిలీజ్‌కి రెడీ చేసి, ప్రేక్షకులు రాకపోవడంతో షోలు రద్దు కూడా చేశారని సమాచారం. ఖర్చులు కూడా మిగలవు థియేటర్స్‌లో ఒక్క షో వేస్తే... తెగిన టికెట్లు, కరెంటు బిల్లులు, థియేటర్ రెంటు ఇలా ప్రతీది లెక్క కట్టుకుని మిగిలినది లాభం. ఇక వసూళ్లు వెయ్యి రూపాయిలైతే కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావు. ఇలా నడపడమెందుకు? అనే ఆలోచన కూడా రాకమానదు. ఈ క్లిష్ట పరిస్థితి గురించి చర్చించడానికి థియేటర్స్ యూనియన్‌కి సంబంధించి త్వరలో ఓ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. పాత సినిమాలు కదా, థియేటర్స్‌కి ఏం వెళ్తాం అని ప్రేక్షకులు భావిస్తున్నారా? కరోనా టైమ్‌లో ఇంటిపట్టున ఉండటం బెటర్ అనుకుంటున్నారా? కొత్త సినిమాలు పడితే థియేటర్స్ వైపు నడుస్తారా? థియేటర్స్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు? ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే. -
సినిమా థియేటర్లను ఆదుకోవాలి
‘‘కోవిడ్ కారణంగా ఆర్నెళ్లుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఈ నెల 15 నుంచి 50 శాతం సీట్లు నిండేలా థియేటర్లు ప్రారంభించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా థియేటర్లు తెరుచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు పెద్ద మనసుతో అనుమతించాలి’’ అని ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం పలువురు థియేటర్ యజమానులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ థియేటర్ల సంఘం’ ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘థియేటర్లు మూత పడటంతో తీవ్రంగా నష్టపోయాం. ఎన్నో వేల మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపరు. కనీసం సగం సీట్లు నిండినా మాకు సంతోషమే. ప్రేక్షకులకు కోవిడ్ సోకకుండా శానిటైజర్లతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. టికెట్లు చేతితో తాకకుండా చూసుకుంటాం. విశ్రాంతి సమయంలో ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడకుండా చర్యలు చేపడతాం. థియేటర్లకు ఎక్కువ కరెంటు బిల్లులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఆదుకుంటేనే సినిమా థియేటర్ల పరిశ్రమ పూర్వవైభవం తెచ్చుకుంటుంది’’ అన్నారు. -
పారితోషికం కట్
‘‘కరోనా ప్రభావం నుంచి అందరం కోలుకోవడం ప్రారంభించాం. ఇండస్ట్రీ పనులు మెల్లిగా మొదలయ్యాయి. థియేటర్స్ తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ థియేటర్లు నిండుతాయా? ఫారిన్ మార్కెట్ సంగతి ఏంటి? ఇలా మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు, ప్రశ్నలు చాలానే ఉన్నాయి’’ అని పేర్కొంది యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. శనివారం ఓ ప్రెస్‌నోట్‌ని కూడా విడుదల చేశారు. పారితోషికం తగ్గించుకునే విషయం ఇందులో ఓ ముఖ్యాంశం. ఆ ప్రెస్‌నోట్ వివరాలు. ‘‘కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఆర్టిస్టులు ఎప్పుడూ మొదటి అడుగు వేస్తూ ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరియు గిల్డ్ కలసి ఆర్టిస్టులు పారితోషికాన్ని (లాక్డౌన్ ముందు తీసుకుంటున్న లెక్క ప్రకారం) 20 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించాం. రోజుకి ఇరవై వేలు వరకూ తీసుకుంటున్న ఆర్టిస్టులను ఇందులో నుంచి మినహాయించాం. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే... సినిమాకు 5 లక్షలు వరకు తీసుకుంటున్న వారిని 20 శాతం తగ్గించుకోవడం నుంచి మినహాయించాం. మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఎప్పటిలానే పారితోషికాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ నిర్ణయం అందరికీ వర్తిస్తుంది’’ అని పేర్కొన్నారు. -
పలు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలు తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. 9,10, ఇంటర్మీడియెట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు కోవిడ్ నిబంధనల ప్రకారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో 21 నుంచి ఇక సర్కార్ బడుల టీచర్లు 50 శాతం మంది హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు సగం మంది చొప్పున రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కంటైన్మెంట్ జోన్లలో పాఠశాలలు మూసే ఉంటాయి. (చదవండి: కేసుల కంటే రికవరీలే ఎక్కువ) దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత మార్చి 25 నుంచి దేశంలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, గత 24 గంటల్లో 92,605 కొత్త కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసులు 54 లక్షలను అధిగమించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. -
1 నుంచి మెట్రో సర్వీసులు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్‌లాక్–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం కౌంటర్‌పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం. -
ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత జిమ్‌లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్‌లాక్– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్‌లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్ సెషన్లో పాల్గొన్న ఆమె ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్‌లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది. -
జిమ్‌లు రేపట్నుంచే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. మార్గదర్శకాలివే.. ► స్పాలు, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. ► యోగా సెంటర్లు, జిమ్‌లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ► జిమ్‌లో సెంట్రలైజ్డ్ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూడాలి. ► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిది. ► హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్/జిమ్ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి. ► ఫేస్ మాస్కు/కవర్ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ► యోగా కేంద్రం/జిమ్‌లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. ► జిమ్/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్ తప్పకుండా ఫేస్ షీల్డ్‌లు ధరించాలి. ► కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. -
స్కూళ్ల పునఃప్రారంభంపై సంప్రదింపులు షురూ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో మూతపడిన పాఠశాలలను ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలన్న దానిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఈ అంశంతో సంబంధం ఉన్న వారితో(స్టేక్ హోల్డర్లు) చర్చిస్తోంది. సోమవారం సంప్రదింపులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి అనితా కార్వాల్ వివిధ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో మాట్లాడారు. పాఠశాలలను తెరవడంపై యాజమాన్యాల సన్నద్ధత, విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాలల్లో పరిశుభ్రత, ఆన్లైన్, డిజిటల్ ఎడ్యుకేషన్ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్షుణ్నంగా పరిశీలించి, తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, హోంశాఖకు నివేదించనున్నట్లు మానవ వనరుల అభవృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రాలతో సంప్రదింపులు ఇప్పుడే మొదలయ్యాయని, స్కూళ్ల పునఃప్రారంభంపై తుది నిర్ణయం కేంద్ర హోంశాఖదేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
లాకులెత్తారు!
న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ‘లాక్డౌన్’ నుంచి వ్యూహాత్మక ‘అన్‌లాక్’ దిశగా దేశం మరో అడుగు వేసింది. మార్చి 25 తరువాత తొలిసారి దేశవ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనల మధ్య ఆయా ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనాలయాలు, మాల్స్‌లో ప్రవేశానికి సంబంధించి.. పరిమిత సంఖ్యలో వ్యక్తులను లోనికి అనుమతించడం, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి చేయడం, ఆ ప్రదేశమంతా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, ప్రవేశ ప్రాంతాలు సహా ఇతర ముఖ్య ప్రదేశాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.. తదితర నిబంధనలను పాటించారు. అయోధ్యలోని రామజన్మభూమి, ఉడిపిలోని మూకాంబికా దేవాలయం, ఢిల్లీలోని జామామసీదు, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం మొదలైనవి తెరుచుకున్నాయి. షాపింగ్ మాల్స్‌కి ఊహించిన స్థాయిలో వినియోగదారులు రాలేదు. కరోనా భయం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు అందుకు కారణంగా భావిస్తున్నారు. రెస్టారెంట్లలోనూ అరకొరగానే ఆహార ప్రియులు కనిపించారు. వెయిటర్లు ఫేస్ షీల్డ్‌లు ధరించి సర్వీస్ చేశారు. టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లలో డిజిటల్ మెన్యూస్, డిజిటల్ పేమెంట్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ప్రార్థనాలయాలు, మాల్స్‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. -
సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 8 నుంచి తెరుచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని గురువారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఏముందంటే.. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే హోటళ్లలో నియమించుకోవాలి. వినియోగదారుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఇక సామాజిక దూరం తప్పనిసరి. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో హోటళ్లలో రద్దీ పెరగకుండా నియంత్రించాలి. హోటళ్లలో పనిచేస్తున్న వారిలో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులతో డైరెక్టు కాంటాక్టు ఉండే విధులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు, సిబ్బంది రావడానికి, తిరిగి వెళ్లడానికి.. అలాగే సరుకుల రవాణాకు వేర్వేరు దారులు ఉండాలి. సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలోనే.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం ఆర్డర్ ఇవ్వడానికి, నగదు చెల్లింపులకు డిజిటల్ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఇందుకు ఈ–వ్యాలెట్లు ఉపయోగించడం మేలు. హోటళ్లకు వచ్చిన అతిథుల ఆరోగ్యం, ప్రయాణ చరిత్ర వంటి వివరాలను రికార్డుల్లో భద్రపర్చాలి. వారి నుంచి గుర్తింపు పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. అతిథుల లగేజీని రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్) చేయాలి. అతిథులు, హోటల్ సిబ్బంది నేరుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇంటర్‌కామ్/మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. గేమింగ్ జోన్లు, చిన్న పిల్లల ఆటస్థలాలను కచ్చితంగా మూసివేయాలి. హోటళ్లలో ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్కిన్లు ఉపయోగించాలి. రెస్టారెంట్లలోనే ఆహారం తినే అవకాశాన్ని నిరుత్సాహపరుస్తూ సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ డెలివరీ సిబ్బంది ఆహార ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి డోర్ల దగ్గర వదిలేయాలి. నేరుగా వారి చేతికే అందజేయడం తగదు. హోం డెలివరీకి వెళ్లే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. మాస్కులు ధరిస్తేనే అనుమతి షాపింగ్ మాళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలను వంద శాతం పాటించాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు విధించిన మార్గదర్శకాలే షాపింగ్ మాళ్లకు కూడా వర్తిస్తాయి. మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలి. మాల్ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలి. సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. షాపింగ్ మాల్ లోపల సందర్శకులు చేత్తో తాకేందుకు అవకాశం ఉనఅన్ని ప్రాంతాలు, వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. లోపల ఉమ్మివేయడం నేరం. కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలోనూ ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు చేసిన పాటలు, ఆధ్యాత్మిక గీతాలు, బృంద గానాలకు ఇలాంటి చోట అనుమతి లేదు. ప్రసాదాలు పంచడం, జనంపై పవిత్ర జలాలు చల్లడం వంటివి చేయకూడదు. ఒకవేళ అన్నదానం చేస్తే అక్కడ భౌతిక దూరం పాటించాలి. మార్కింగ్ చేయాల్సిందే హోటళ్ల ముఖద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అలాగే వినియోగదారులకు, సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. ఒక్కొక్కరికి మధ్య కనీసం 6 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని హోటళ్ల యాజమాన్యాలు నియమించుకోవాలి. వినియోగదారులు సామాజిక దూరం పాటించడం కోసం హోటల్ లోపల, బయట మార్కింగ్ చేయాలి. ఇక ఏసీలు 24–30 డిగ్రీల సెల్సియస్ మధ్య నడిచేలా చూడాలి. -
దూ..రం.. అ..యి..తే.. నష్టమే!
మనిషికీ మనిషికీ మధ్య మూడు సీట్ల దూరం ఉంటుందా? ఒకే కుటుంబానికి చెందినవారు వెళితే నాలుగు సీట్లు ఒకేచోట ఉంటాయా? కపుల్ అయితే రెండు సీట్లు కేటాయిస్తారా? సింగిల్‌గా వెళ్లినవాళ్లు సీటు సీటుకి మధ్య గ్యాప్ ఉండే వరుసలో కూర్చోవాలా? కలిసికట్టుగా థియేటర్‌కి వెళ్లినా దూరం దూరంగా కూర్చుని సినిమా చూడాలా? లాక్డౌన్ తర్వాత థియేటర్లు ఏ విధంగా మారబోతున్నాయి? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారు? తెలుసుకుందాం. ‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా?...’ ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. కరెక్టే.. ఎప్పుడొచ్చామన్నది కాదు.. రైట్ టైమ్‌లో వచ్చామా? లేదా? అన్నదే ముఖ్యం. ‘కొంచెం జరగరా.. నాకు స్పేస్ కావాలి’ అంటుంది పూజా హెగ్డే. ఎన్టీఆర్ స్పేస్ ఇస్తాడు. ‘అరవిందసమేత వీర రాఘవ’ సినిమాలో సీన్ ఇది. కరెక్టే.. ఇప్పుడు అందరికీ స్పేస్ కావాలి. దూరం పాటించాలి. వినోదం కోసం కుటుంబమంతా కలిసి సినిమాకెళ్లినా... దూరం దూరంగా కూర్చోవాలా? పిల్లలిద్దరికీ కలిపి ఒక్క పాప్‌కార్న్ కొంటే.. ఒక కుర్చీ అవతల ఉన్న తమ్ముడికో లేదా చెల్లెలికో చేతులు సాగదీసుకుంటూ పాప్‌కార్న్ షేర్ చేయాలా? ప్రేమికులైతే... ఒకే కూల్‌డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసుకుని పక్కపక్కనే కూర్చుని సినిమాని ఆస్వాదించలేరా? ‘భౌతిక దూరం పాటించాలి’ అంటూ థియేటర్లలో సీటు సీటుకి మధ్య గ్యాప్ ఇస్తే పరిస్థితి ఇదే. ‘నీదో దారి నాదో దారి’ అన్నట్లు సినిమా చూడాల్సిందే. ‘ఇలానూ సినిమా చూడాలా?’.. అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయ్యే ప్రమాదం ఉంది. మరి.. థియేటర్ అధినేతల పరిస్థితి ఏంటి? ‘సినిమా హాల్’ నిండటానికి లేదు. 500 సీట్లు ఉంటే 250కే పరిమితం చేయాలన్నప్పుడు నష్టమే? అందుకే ‘థియేటర్లో మార్పులు’ చేయడానికి చాలామంది సుముఖంగా లేరు. ‘నో గ్యాప్’ అంటున్నారు. థియేటర్ ఫుల్ అయినా కాకపోయినా కరెంట్ బిల్ అదే వస్తుంది. స్టాఫ్ జీతాలు ఇవ్వాల్సిందే. ఇంకా శానిటైజేషన్, ఇతర మెయిన్టెనెన్స్ ఖర్చులు ఎలానూ ఉంటాయి. ఈ విషయం గురించి చారీని అడుగుదాం. నైజాంలోని పలు థియేటర్ల నిర్వహణ చారి ఆధ్వర్యంలో ఉంది. ఆయన మాట్లాడుతూ –‘‘భార్య ఒకచోట, భర్త ఒకచోట, పిల్లలు మరోచోట కూర్చుని సినిమా చూడ్డానికి ఎందుకు ఇష్టపడతారు? సీట్ల మధ్య గ్యాప్ సిస్టమ్ పెడితే ఫ్యామిలీస్ రావడానికి ఇష్టపడరు. నలుగురైదుగురు స్నేహితులు సినిమాకి రావాలనుకున్నప్పుడు పక్కపక్కనే కూర్చుని సినిమా చూడాలనుకుంటారు కానీ విడివిడిగా కాదు కదా. సీట్ల మధ్య గ్యాప్ అనేది వసూళ్లపై ప్రభావం చూపుతుంది. కరోనా భయంతో అసలు ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారా? రారా? అనే పరిస్థితిలో సీట్ల మధ్య గ్యాప్ పెంచి రీ ఓపెన్ చేయడం అనేది సరైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. పైగా అదనపు ఖర్చు కూడా అవుతుంది. ఎలాగంటే షో షోకీ శానిటైజేషన్ చేయాలి. ఒక సింగిల్ థియేటర్ శానిటైజేషన్‌కి నెలకు సుమారు లక్ష రూపాయలవుతుంది. ఇప్పుడైతే కరెంట్ బిల్ మినిమమ్ టారిఫ్ కట్టొచ్చు. సినిమా ఆడటం మొదలుపెట్టాక పవర్ బిల్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు కొందరు ఎగ్జిబిటర్లు స్టాఫ్‌కి జీతాల్లో కోత విధించారు. రీ ఓపెన్ అయ్యాక ఫుల్ జీతం ఇవ్వాల్సిందే. పెరిగే ఖర్చులతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. ఎవరికీ సీట్లు తగ్గించి, థియేటర్ ఓపెన్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. సినిమా అనేది కంపల్సరీ కాదు. మద్యం షాపులు, బార్లు, పబ్బులు ఓపెన్ చేస్తే... బాధలో ఉన్నవాళ్లూ వెళతారు. సంతోషంగా ఉన్నా మందు కొనుక్కుంటారు. సినిమా అంటే ఎక్కువ శాతం మంది మూడ్ బాగున్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడే వస్తారు. పైగా కరోనా వైరస్ భయంతో సినిమాలు చూడ్డానికి వచ్చే అవకాశం తక్కువ. అందుకే పరిస్థితులన్నీ చక్కబడి ఏ భయం లేకుండా సినిమా చూడొచ్చు అనుకున్నప్పుడే థియేటర్లు రీ ఓపెన్ చేస్తే బాగుంటుంది. సీట్లలో మార్పనేది మంచి నిర్ణయం కాదు’’ అన్నారు చారి. రైట్ టైమ్ ముఖ్యం ఈ విషయం గురించి ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు డి. సురేష్‌బాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయమే ఏ వ్యాపార విజయానికైనా ప్రధాన కారణం. ‘రైట్ టైమ్..’ అనేది చాలా ముఖ్యం. వ్యాపారం దెబ్బతింటోంది కదా అని తొందరపడి థియేటర్లు రీ ఓపెన్ చేస్తే నష్టమే. సీటు సీటుకి మధ్య గ్యాప్ ఇచ్చి సినిమాలు ఆడిస్తామంటే ఎగ్జిబిటర్‌కి లాభం రావడం అనేది జరగదు. భయపడుతూ సినిమా చూడాలా? అని ప్రేక్షకులు అనుకుంటారు. అంతెందుకు? చైనాలో థియేటర్లు రీ ఓపెన్ చేస్తే, ఎవరూ రాలేదు. దాంతో మూసేశారు. దుబాయ్‌లోనూ అంతే! థియేటర్ తెరవగానే ప్రేక్షకులు వస్తారనుకున్నారు. నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళదామనుకుంటారు. నిత్యావసరాలు కొనుక్కోవడానికి వెళతారు. అంతేకానీ ధైర్యం చేసి థియేటర్‌కి వెళతారనుకోను. రెండు నెలలుగా థియేటర్లు మూసి ఉంచాం. పరిస్థితులు చక్కబడేవరకూ ఓపిక పడదాం. పరిస్థితులన్నీ చక్కబడ్డాక సీటు సీటుకి మధ్య స్పేస్ అవసరంలేదనుకున్నప్పుడే రీ ఓపెన్ చేయాలి. లేకపోతే చైనా, దుబాయ్ పరిస్థితే మనకూ ఎదురవుతుంది. ఇప్పుడు ఒక రోగికి ఆపరేషన్ జరిగాక అతను పూర్తిగా రికవర్ అయ్యేవరకూ రెస్ట్ తీసుకోవాలి. అలా కాకుండా రొటీన్లో పడ్డాడనుకోండి.. రోగం తిరగబెట్టొచ్చు. థియేటర్స్ విషయంలోనూ అంతే. అన్నీ అనుకూలించాకే తెరవాలి. పైగా వచ్చే రెండు మూడు నెలల్లో విడుదలకు సిద్ధమయ్యే సినిమాలు చాలా లేవు. షూటింగ్స్ మొదలయ్యాక ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. అందుకే థియేటర్ల రీ ఓపెన్‌కి టైమ్ తీసుకుంటే బెటర్. ఇంకో విషయం ఏంటంటే... మా ఇండస్ట్రీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని మేం ఏం కోరుతున్నామంటే... ‘పవర్ రేట్’ కమర్షియలైజ్డ్గా కాకుండా ‘ఇండస్ట్రియల్ టారిఫ్’ ఇవ్వాలి. అలాగే కొన్నాళ్ల పాటు సినిమాలపరంగా ‘జీఎస్టీ’కి హాలిడే ఇవ్వాలి, తక్కువ వడ్డీకి ఎక్కువ మారటోరియం పీరియడ్‌తో బ్యాంకు రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఇవి చేస్తే నిర్మాతలు, ఎగ్జిబిటర్లు... ఇలా అందరికీ ఎంతో కొంత ఊరట ఉంటుంది’’ అన్నారు. ‘ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్స్’ గ్రూప్ అధినేత, ‘ఏఎంబి’ థియేటర్‌కి ఓ అధినేత, ప్రముఖ పంపిణీ దారుడైన సునిల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘సీట్లు తగ్గించడం అనేది జరగని పని. పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు ఎవరూ అందుకు ఒప్పుకోరు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ సరేసరి. వాళ్లూ ఒప్పుకోరు. అలాగే థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులను దూరం దూరంగా కూర్చుని సినిమాలు చూడమని చెప్పలేం. సీట్ల మధ్య దూరం అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాని పని. ఫుల్ సీటింగ్ ఉన్నప్పుడే థియేటర్లు రీ ఓపెన్ చేయడం బెటర్’’ అన్నారు. సునిల్ నారంగ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ వీఎంఆర్ మాట్లాడుతూ –‘‘అన్నీ బాగున్నప్పుడే సినిమా థియేటర్లు తెరవాలి. గుంటూరులాంటి ఏరియాలో మెయిన్ థియేటర్లో 350 నుంచి 400 సీట్లు ఉంటాయి. భౌతిక దూరం పేరుతో సీట్లు తగ్గించేస్తే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నష్టపోక తప్పదు. లేట్ అయినా ఫుల్ సీటింగ్ అనే పరిస్థితి ఉన్నప్పుడే థియేటర్లు ఓపెన్ చేయాలి. సీట్ల తగ్గింపుతో ఇప్పుడు ఓపెన్ చేసినా ప్రయోజనం లేదు’’ అన్నారు. ప్రముఖులు చెప్పిన మాటలు వింటుంటే... ఇప్పట్లో థియేటర్లు రీ ఓపెన్ అయ్యే అవకాశం కనిపించడంలేదు. ఆగస్ట్ నుంచి ఓపెన్ అవుతాయని ఎవరికి వారు అనుకుంటున్నప్పటికీ మరో రెండు నెలలు అదనంగా అయ్యే పరిస్థితే కనబడుతోంది. 2020 ఎండింగ్‌కి అయినా పరిస్థితులు చక్కబడి ఫుల్ సీట్లతో థియేటర్లు రీ ఓపెన్ అయి, 2021కి మంచి ప్రారంభం కావాలని కోరుకుందాం. – డి.జి. భవాని -
గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ / శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు తిరిగి వచ్చేలా చర్యలు చేపడుతోంది. జూలై 6 నుంచి మరిన్ని నగరాల్లో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుందని ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు ఈ ఏడాది చివరి వరకు చాలా మంది ఇంటి నుండే పనిచేసే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ ఖర్చుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఉద్యోగికి 1,000 డాలర్లు (సుమారు రూ. 75,000) ఇస్తున్నట్లు ప్రకటించారు. కొంతమంది ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. జూన్ 10 లోగా సంబంధిత మేనేజర్లు ఆయా ఉద్యోగులకు సమాచారం ఇస్తారని, వారు వీలైతే ఆఫీసుకు రావడం, లేదా ఇంటి నుంచే పని కొనసాగించవచ్చని తెలిపారు. వారి వారి సామర్థ్యాలను బట్టి తిరిగి రావాలనుకునే వారికి పరిమితంగా అనుమతినిస్తున్నట్టు పిచాయ్ చెప్పారు. మిగతా అందరికీ ఈ ఏడాది చివరకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉంటుందని తెలిపారు. (42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత) ప్రతి రెండు వారాలకు ఒక రోజు ఆఫీసుకు వచ్చేలా ఉద్యోగులు ప్లాన్ చేసుకుంటే, ఒక ఆఫీసులో సుమారు 10 శాతం సిబ్బంది ఉంటారని దీన్ని ఆలోచించాలన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే రొటేషన్ ప్రోగ్రామ్ ద్వారా సెప్టెంబర్ నాటికి 30 శాతం ఉద్యోగుల హాజరు ఉంటుందని గూగుల్ సీఈవో భావించారు. సామాజిక దూరం, పరిశుభ్రత లాంటి కఠినమైన ఆరోగ్య, భద్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గతం కంటే ఇపుడు ఆఫీసు వాతావరణం భిన్నంగా ఉంటుందని కొత్త అనుభూతి పొందుతారని ఆయన వెల్లడించారు. కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఆఫీసులను నెమ్మదిగా తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఉద్యోగుల రిమోట్‌గా పని చేసేందుకు అవసరమైన అన్ని చర్యలపైనా ఎక్కువ దృష్టి పెట్టామని పిచాయ్ ప్రకటించారు. -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్‌లో తమ కార్పొరేట్ ఆఫీస్‌ను, కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్‌లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్‌ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
కార్లు హోం డెలివరీ - మారుతి సుజుకి
సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. కరోనావైరస్, లాక్డౌన్ మూసివేసిన 600 డీలర్‌షిప్‌లను తిరిగి తెరిచినట్లు బుధవారం తెలిపింది. వాహనాల డెలివరీలను కూడా ప్రారంభించింది. దీనికి సంబంధించిన స్టాక్ తమ దగ్గర వుందని సంస్థ వెల్లడించింది. ప్లాంట్ల కార్యకలాపాలు ప్రస్తుతానికి ఇంకా మొదలుకాలేదని ప్రకటించింది. (కరోనా : అయ్యయ్యో మారుతి!) కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాహనాల కొనుగోలుకు సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు చేశామని తెలిపింది. అలాగే డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని ఆటో మేజర్ తెలిపింది. దేశవ్యాప్తంగా 600 డీలర్‌షిప్‌లను తెరిచామని ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. గత కొన్ని రోజులుగా 55 యూనిట్లతో ఇప్పటికే కార్ల డెలివరీలను కంపెనీ ప్రారంభించిందని తెలిపారు. సంబంధిత అనుమతులు తప్పనిసరైన రాష్ట్రాల్లో డీలర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొత్తం అమ్మకపు నెట్‌వర్క్‌లో కార్యకలాపాలను ప్రారంభంపై ప్రశ్నించినపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎంత త్వరగా ఆమోదం వస్తుందనే దానిపై ఆధారపడి వుంటుందని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. (కారు.. జీరో) కంపెనీ సీఎండీ కెనిచి ఆయుకావా మాట్లాడుతూ కరోనా కట్టడికి సంబంధించి పూర్తి భద్రత, పరిశుభ్రత, శానిటైజేషన్ చర్యలను విధిగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. కొనుగోలు సమయలో షోరూమ్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులకు సహాయపడేలా డిజిటల్ ప్రక్రియను కంపెనీ ఏర్పాటు చేసిందన్నారు. వాహనాల డెలివరీకి కూడా షోరూమ్‌లకు రావాల్సిన అవసరం లేకుండానే ఇంటివద్దకే పంపే ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా డీలర్‌షిప్‌లు టెస్ట్ డ్రైవ్ వాహనాలను పూర్తి స్టెరిలైజేషన్‌ను చేపడతాయని చెప్పారు. కాగా దేశంలోని 1960 నగరాలు, పట్టణాల్లో సుమారు 3080 డీలర్షిప్లున్న ఈ సంస్థ 474 అరేనా అవుట్లెట్లు, 80 నెక్సా డీలర్‌షిప్‌లు, 45 వాణిజ్య వాహనాల అమ్మకపు దుకాణాలను తెరవగలిగింది. లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఏప్రిల్ నెలలో ఒక్క కారును కూడా విక్రయించలేకపోయింది. (పెట్రోపై పన్ను బాదుడు) -
చైనాలో థియేటర్స్ ప్రారంభం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ను మూసివేశారు. సినిమాలు వాయిదా పడ్డాయి. థియేటర్స్ కళ తప్పాయి. అయితే చైనాలో థియేటర్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు. షాంఘై నగరంలోని థియేటర్స్‌లో శనివారం, నుంచి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడిని లోపలికి అనుమతించాలని, ఏ ఇద్దరూ పక్క పక్కనే కూర్చోకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందట. ప్రస్తుతానికి పాత సినిమాలనే ప్రదర్శిస్తున్నారు. కొత్త సినిమాలు విడుదల కావడానికి మరికొంచెం సమయం పట్టేలా ఉంది. -
మొదటి రోజు హాజరు నామమాత్రమే
నల్లగొండ : పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎండలు తగ్గకపోవడంతో మొదటిరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే నమోదైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2 నుంచే పాఠశాలలు పునః ప్రారంభించాలని ప్రభుత్వం మొదట భావించింది. 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కానీ ఎండల తీవ్రత మాత్రం తగ్గలేదు. బుధవారం నల్లగొండలో41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మిర్యాలగూడలో 41, సాగర్‌లో 40, దేవరకొండ లో కూడా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎండల తీవ్రతతో అంతంతమాత్రంగానే విద్యార్థులు ఎండాకాలం మాదిరిగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో బుధవారం పాఠశాలలు తెరిచినా ఎక్కడా పెద్దగా విద్యార్థులు హాజరుకాలేదు. 100 ఉన్న చోట 20 మందికి మించి హాజరు కాలేదు. దీంతో పాఠశాలలన్నీ విద్యార్థులు లేక వెలవెలబోయాయి. నల్లగొండ పట్టణంలోని మాన్కంచెల్క ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ముగ్గురువిద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. పాఠశాలకు పంపేందుకు సుముఖత చూపని తల్లిదండ్రులు ఎండతీవ్రతతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపేందుకు కూడా సుముఖత చూపలేదు. సాధారణంగా మొదటి రోజు మంచి రోజు లేకుంటే పంపరు. కానీ బుధవారం మంచిరోజు ఉన్నప్పటికీ పిల్లలను కేవలం ఎండల కారణంగానే బడికి పంపలేదు. ఇదంతా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించిన పరిస్థితి. హాస్టల్లో ఉండే విద్యార్థులు కూడా ఎవరూ రాని పరిస్థితి. గతంలో పాఠశాల పునఃప్రారంభానికి ముందు రోజే సరంజామా అంతా సిద్ధం చేసుకొని హాస్టల్‌కు చేరుకునేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించ లేదు. ప్రైవేట్ పాఠశాలల వద్దే సందడి ప్రైవేట్ పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పుస్తకాలు, డ్రెస్సులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆయా పాఠశాలల వద్ద పెద్ద ఎత్తున కనిపించారు. వారు కూడా ఒక్కపూట మాత్రమే పాఠశాల నడిపారు. మధ్యాహ్నం తర్వాత పిల్లలను ఇంటికి పంపారు. -
మోగిన బడిగంట
ఆదిలాబాద్‌టౌన్: బడిగంట మోగింది. ఆట పాటలకు చిన్నారులు బైబై చెప్పారు. దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా గడిపిన చిన్నారులు బుధవారం బడిబాట పట్టారు. ఇన్ని రోజులు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కళకళలాడాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు తమ పిల్లల్ని నిద్రలేపి.. యూనిఫాం, బ్యాగు, పుస్తకాలు వాటర్‌బాటిళ్లు, టిఫిన్ బాక్సులు సిద్ధం చేసి పాఠశాలల వరకు తీసుకెళ్లారు. కొందరు నవ్వుతూ వెళ్లగా.. నర్సరీ, ఎల్కేజీ చిన్నారులు ఏడుస్తూ.. మారం చేస్తూ కనిపించారు. స్కూల్ బస్సులు, ఆటోల్లో విద్యార్థుల రాకపోకలు మొదలయ్యాయి. బుక్ సెంటర్లు, షూ, దుస్తులు, షాపులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కిక్కిరిసాయి. జిల్లా వ్యాప్తంగా బడి మొదలైన సందడి కనిపించింది. సర్కారు వెలవెల.. ప్రైవేటు కళకళ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. 45 డిగ్రీలకు పైగా ఉండడంతో పాఠశాలలకు హాజరైన విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. తొలిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా సమయానికి హాజరు కాలేదు. పాఠాలు బోధించలేదు. వచ్చిన విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆడుతూ పాడుతూ కనిపించారు. సర్కారు పాఠశాలలకు భిన్నంగా ప్రైవేటు పాఠశాలలు కళకళలాడాయి. అధిక శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలకు రెండు పూటల బడి నిర్వహించారు. ఎల్కేజీ, యూకేజీ పిల్లలను ప్రైవేటు పాఠశాల్లో చేర్పించడంతో తల్లిదండ్రులు పాఠశాలలకు చేరుకుని విద్యార్థులను బుజ్జగించి తరగతి గదుల్లోకి తీసుకెళ్లి కూర్చొబెట్టారు. కొంత మంది చిన్నారులు కంటతడి పెట్టగా, వారిని సముదాయించి చాక్టెట్లు, బిస్కెట్లతో నచ్చజెప్పి మరీ పాఠశాలలకు పంపించారు. సమస్యలతో స్వాగతం.. ఏటా మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాల్లో సమస్యలు స్వాగతం పలికాయి. చాలా చోట్ల తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు యథావిధిగా దర్శనమిచ్చాయి. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. కొన్ని పాఠశాలల్లో కిటికీలు సరిగా లేక, ఫ్యాన్లు తిరగక చిన్నారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పాఠశాలలను శుభ్రపర్చకపోవడంతో పలు చోట్ల విద్యార్థులే తరగతి గదులను ఊడ్చుకోవడం, కడగడం చేశారు. సర్కారు పాఠశాలల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే కనిపించింది. చాలా స్కూళ్లల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో రెగ్యూలర్ ఉపాధ్యాయులు లేక పాఠశాలలు కొన్ని తెరుచుకోలేదు. కొన్ని చోట్ల మండల విద్యాధికారులు పక్కనున్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి పాఠశాలలను తెరిపించినా పాఠ్యాంశాల బోధన జరగలేదు. ఎండ తీవ్రతతో ఇబ్బందులు.. జిల్లాలో భానుడు ప్రతాం చూపుతున్నాడు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపలేదు. గత ఏడాది జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాగా అయితే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో 11 రోజులు అదనంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలు బుధవారం ఒంటి పూట బడి నిర్వహించగా, ప్రభుత్వ పాఠశాలలు రెండు పూటలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అదే విధంగా జైనథ్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. -
కీలక తీర్పులకు సుప్రీం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : వేసవి సెలవుల అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు తిరిగి ప్రారంభంకానుంది. 44 రోజుల విరామం తరువాత సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించేందుకు సిద్ధమైంది. వేసవి సెలవుల నేపథ్యంలో కోర్టు విధులకు దూరంగా ఉండటంతో పలు కీలక కేసులు పెండింగులో ఉన్నాయి. నేడు తిరిగి ప్రారంభవ్వడంతో పలు కీలక అంశాలపై తీర్పును వెలువరించనుంది. పౌరుల వ్యక్తిగత గోపత్యకు సంబందించిన ఆధార్ కేసు సుప్రీం ధర్మాసనం ముందు ఉంది. ఆయోధ్య వివాదం, ముస్లింల బహుభార్యత్వంపై తీర్పును వెలువరించాల్సి ఉంది. ఇటీవల వివాదంగా మారిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీలో కాలుష్యం, అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, వైష్ణో దేవి పునరావాసం, మణిపూర్‌లో ఇటీవల జరిగిన్ ఎన్కౌంటర్ వంటి అంశాలపై విచారణ చేపటాల్సిఉంది. నేటి నుంచి గుర్తింపు పొందని (నాన్ ఎక్రిడేట్) పాత్రికేయులు కూడా కోర్టు అవరణలోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లెందుకు సుప్రీం ధర్మాసనం అనుమతినిచ్చింది. -
మహా గాజు వంతెన పునఃప్రారంభం..