నూతన సంవత్సర వేడుకల్లో విషాదం | Asia-Pacific New Year's stampede kills 35 in Shanghai | Sakshi
Sakshi News home page

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

Published Thu, Jan 1 2015 7:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

బీజింగ్ : చైనాలో నూతన సంవత్సర వేడుకలు విషాదాన్ని నింపాయి. షాంఘై పట్టణంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా  లక్షల్లో జనాలు ఓ మైదానం వద్ద గుమికూడిన సందర్భంగా గతరాత్రి 11.35 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఊహించని రీతిలో ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరు అయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement