చైనాలో సంక్రాంతి సంబరాలు | Sankranthi celebrations in China | Sakshi
Sakshi News home page

చైనాలో సంక్రాంతి సంబరాలు

Published Thu, Jan 18 2018 2:54 PM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

Sankranthi celebrations in China - Sakshi

షాంఘై : చైనాలోని షాంఘైలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు అసోసియేషన్ అఫ్ చైనా (టాక్) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలుగువారంతా ఒకచోట చేరి సంబరాలు జరుపుకొన్నారు. షాంఘై లోని ఎంబసి క్లబ్ లో ఘనంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ఇండియన్ అసోసియేషన్ అఫ్ చైనా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ ఖోసా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులపై భోగిపళ్లు పోశారు. అనంతరం ఫ్యాన్సీడ్రెస్‌ పోటీలు, గాలి పటాల పోటీలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు.

వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలతో ఆద్యంతం సంక్రాంతి వేడుకలు ఉల్లాసంగా సాగాయి. తెలుగువారందరూ కలుసుకోవడమే పెద్ద పండుగ అని సాయిరాం క్రోవి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. పలువురు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు వారి సందేశాలను, శుభాకాంక్షలను వీడియో రూపం లో తెలియజేశారు. 





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement