woman pinned down by a man for a Covid test: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా విజృభిస్తుంది. ఇప్పటికే లాక్‌డౌన్ వంటి పలు ఆంక్షలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది చైనా. అదీగాక వరుస లాక్‌డౌన్‌లతో విసుగుపోయిన ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది. మరోవైపు అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. అంతేగాదు ప్రజలు నివాసాల నుంచి బయటకు రాకుండా కట్టుదిటమైన చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో చైనా అధికారులు ప్రజలకు బలవంతంగా కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. పైగా చైనా ప్రభుత్వ పేద ప్రజలను పరీక్షల పేరుతో ఎలా ఇబ్బందిపెడుతోంది వంటి వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి అక్కడ ప్రజలు కరోనా కంటే లాక్‌డౌన్ అంటేనే హడలిపోతున్నారు. కరోనా తగ్గిందనుకునే దశలో మళ్లీ విరుచుకుపడటంతో చైనా ప్రభుత్వం మళ్లీ ఆంక్షల కొరడా విధించింది. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, కార్యాలయాలు మూసివేయడంతో ప్రజలు ఆర్థిక సంక్షోభంతో సతమతమతున్నారు. అంతేగాదు చైనా కూడా కరోనాని కట్టడి చేసే దిశగా ప్రజలకు మూడోరౌండ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, టీనేజర్ల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ విడిచిపెట్టకుండా బలవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
Chinese government forcing grandma take a mandatory Covid test pic.twitter.com/tD1aZCdj6v
— Songpinganq (@songpinganq) March 19, 2022
(చదవండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!)
Comments
Please login to add a commentAdd a comment