ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కోట. ఈ కోట పాకిస్తాన్‌లోని సింద్ ప్రావిన్స్‌లో ఉంది. దీని పేరు రాణికోట. పదిహేడో శతాబ్దంలో సింద్ ప్రాంతాన్ని పరిపాలించిన తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను జమ్‌షోరో జిల్లా సన్ పట్టణంలో నిర్మించారు. ఈ కోట గోడ చుట్టుకొలత ఏకంగా 32 కిలోమీటర్లు. తాల్పూర్ వంశ పాలకులు ఈ కోటను 1812లో మరింత పటిష్ఠంగా పునర్నిర్మించారు. పునర్నిర్మాణం కోసం అప్పట్లో వారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
కోట గోడ చుట్టూ బురుజులను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. వీటిలో మూడు పెద్దబురుజులను అర్ధచంద్రాకారంలో నిర్మించారు. మెలికలు మెలికలుగా కనిపించే ఈ కోట నిర్మాణం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. పంతొమ్మిదో శతాబ్దిలో బ్రిటిష్ సేనలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత దీని పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. యూనెస్కో 1993లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
(చదవండి: క్రీస్తూ పూర్వం నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...)
Comments
Please login to add a commentAdd a comment