
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుకనుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు సిద్ధి నుంచి రేవాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నంది. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సమయంతో సహాయ చర్యలను చేపట్టారు. కాగా ప్రమాదానికి బస్సు అతివేగమే కారణమని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment