బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాషాయ నేతపై వేటు వేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. ఓ కార్యక్రమంలో బీజేపీ నేత ప్రీతం సింగ్ లోధీ మాట్లాడుతూ.. బ్రాహ్మణులు మతం పేరుతో ప్రజలను మోసగించి, వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల డబ్బు, వనరులతో బ్రాహ్మణులు సంపద కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. మహిళల పట్ల కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో సొంత పార్టీకి చెందిన ప్రవీణ్ మిశ్రా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ అధిష్టానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రీతం సింగ్ లోధీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. అతడిపై వేటు వేసింది. బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది. కాగా, మాజీ సీఎం ఉమాభారతికి అత్యంత సన్నిహితుడైన ప్రీతం సింగ్ లోధీ..శివ్‌పూరి జిల్లా పిచ్చోర్ స్థానం నుంచి 2013,2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
#MadhyaPradesh: Insult of #Brahmins by #BJP leader Pritam Singh Lodhi in Shivpuri. #Trending #Viralvideo #India pic.twitter.com/VelePtoYHl
— IndiaObservers (@IndiaObservers) August 19, 2022
ఇది కూడా చదవండి: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment