సాక్షి, ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం కానుంది.
వివరాల ప్రకారం.. నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనుంది. ఇక, తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే.
#Election2023
— Aishwarya Paliwal (@AishPaliwal) October 9, 2023
Election dates for
Mizoram, Chhattisgarh,Madhya Pradesh, Rajasthan & Telangana to be announced today at 12 noon by Election Commission of India. pic.twitter.com/YTOrIPlLo4
ఇక, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు, రాజస్థాన్‌లో 200 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment