Updates..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్
►మధ్యప్రదేశ్‌లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు
►ఛత్తీస్‌గఢ్‌లో 70 శాతానికిపైగా పోలింగ్ నమోదు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఇలా..
►ఛతీస్‌గఢ్‌లో 38.22 శాతం.
►మధ్యప్రదేశ్‌లో 45.40 శాతం.
38.22% voter turnout recorded till 1 pm in the second phase of voting in Chhattisgarh and 45.40% in Madhya Pradesh. pic.twitter.com/FIR1pFdvp0
— ANI (@ANI) November 17, 2023
► కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు ఇష్టపడుతున్నారని చెప్పారు.
#WATCH | Gwalior, Madhya Pradesh: After casting his vote, Union Minister and BJP candidate Narendra Singh Tomar says, "There is a wave of BJP in Madhya Pradesh, the atmosphere is in favour of BJP and people are liking the schemes and development works of the Central Government… pic.twitter.com/n4qrvo4JIu
— ANI (@ANI) November 17, 2023
►ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అంబికాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్‌మోహినీ దేవి బాలిక కళాశాలలో ఓటు వేశారు.
#WATCH | Ambikapur: Chhattisgarh Deputy CM and Congress candidate from Ambikapur, TS Singh Deo casts his vote at a polling booth in Rajmohini Devi Girls College. pic.twitter.com/TV2awQRSOS
— ANI (@ANI) November 17, 2023
►ఓటు వేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్.
►ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒకరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి యువత ముందుకు రావాలన్నారు.
#WATCH | Chhattisgarh Elections | Governor Biswabhusan Harichandan cast his vote at a polling booth in Raipur. pic.twitter.com/aPgQNttHMO
— ANI (@ANI) November 17, 2023
►ఓటు వేసిన మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ 163 నంబర్ బూత్‌లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Former Lok Sabha Speaker Sumitra Mahajan casts her vote at polling booth number 163 in Indore.#MadhyaPradeshElection2023 pic.twitter.com/eqgWsUSrrS
— ANI (@ANI) November 17, 2023
►ఓటు వేసిన మాజీ సీఎం ఉమా భారతి. ఆమె స్వగ్రామం దుండా ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
#WATCH | Madhya Pradesh Elections | Former Chief Minister and senior BJP leader Uma Bharti cast her vote at her native place Dunda, Tikamgarh today. pic.twitter.com/vsxHvj1a58
— ANI (@ANI) November 17, 2023
►మధ్యప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
►ఉదయం 9 గంటల వరకు 11.13 శాతం ఓటింగ్ నమోదైంది.
► దిమాని అసెంబ్లీ సెగ్మెంట్‌ళోని రెండు పోలింగ్ బూత్‌లపై రాళ్ల దాడి, ఒకరికి గాయాలు.
► కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్, ఇతర బీజేపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
►సీఎం శివరాజ్ సింగ్ ప్రత్యేక పూజలు
►మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ పోలింగ్ సందర్బంగా ప్రత్యేక పూజలు. సెహోర్‌లో నర్మదా ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#WATCH | Madhya Pradesh Elections | MP CM Shivraj Singh Chouhan offers prayers at Narmada Ghat in Sehore. pic.twitter.com/iA6A4Dm00C
— ANI (@ANI) November 17, 2023
ఓటు వేసిన కమల్‌నాథ్
►మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి కమల్‌నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ►వస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు.
#WATCH | Madhya Pradesh Elections | State Congress president and party's candidate from Chhindwara, Kamal Nath casts his vote at a polling booth here. pic.twitter.com/L7nAyC2NCR
— ANI (@ANI) November 17, 2023
►ఇండోర్-1 బీజేపీ అభ్యర్థి కైలాశ్ విజయ్‌వర్గీయ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇండోర్‌లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
#WATCH | Madhya Pradesh Elections | BJP candidate from Indore-1, Kailash Vijayvargiya and his wife Asha Vijayvargiya cast their vote at a polling booth in Indore. pic.twitter.com/Mzzz3u6V4J
— ANI (@ANI) November 17, 2023
►కాంగ్రెస్ అభ్యర్థి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ గెలుస్తుంది. నాకు ప్రజల మీద నమ్మకముంది. బీజేపీ శివరాజ్‌సింగ్‌లా మేము ఇన్ని సీట్లలో గెలుస్తాము అని చెప్పను. ఎన్ని స్థానాల్లో గెలుపు అనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాష్ట్రంలో పోలీసులు, వ్యవస్థ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరికొన్ని గంటలు మాత్రమే వారు ఇలా చేయగలరు. తర్వాత అంతా మారిపోతుంది. వారు డబ్బులు, లిక్కర్ పంచుతున్నట్టు నిన్ని నాకు కొన్ని కాల్స్, వీడియోలు వచ్చాయి.
#WATCH | Madhya Pradesh Elections | State Congress president and party's candidate from Chhindwara, Kamal Nath says, "I have faith in the entire state that they will side with the truth. I trust the public, the voters. I am not Shivraj Singh that I will say that we will win these… pic.twitter.com/HtzQ2Ql0OR
— ANI (@ANI) November 17, 2023
►ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి..
►ఓటు వేసేందుకు ఉదయాన్నే వచ్చిన ఓటర్లు..
#WATCH | Madhya Pradesh Elections | People queue up outside polling stations as they await their turn to cast a vote.
— ANI (@ANI) November 17, 2023
Visuals from a polling station in Bhopal. pic.twitter.com/S2dOe5m390
#WATCH | Madhya Pradesh Elections | An elderly voter shows her inked finger after casting her vote at a polling booth in Gwalior. pic.twitter.com/ZnSA5RHDxp
— ANI (@ANI) November 17, 2023
►కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ప్రహ్లద్ పటేల్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 100 శాతం పోలింగ్ నమోదు కావాలి ఇది నా విజ్ఞప్తి. ఐదోసారి రాష్ట్రంలో బీజేపీ గెలవబోతుంది. మాకు ఫుల్ మెజార్టీ వస్తుంది.
#WATCH | Madhya Pradesh Assembly elections | Union Minister and BJP candidate from Narshinghpur, Prahlad Patel says, "...I urge all the people of Madhya Pradesh to touch the goal of 100% voting...I request them to vote together for development...We will come to power for the… pic.twitter.com/yb18qehBZe
— ANI (@ANI) November 17, 2023
►ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిగిలిన 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మీరు వేసే ఒక్క ఓటు.. రాష్ట్రంలో రైతులు, యూత్, మహిళల భవిష్యత్త్‌కు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఓటు వేయండి. ఛత్తీస్‌గఢ్ బంగారు భవిష్యత్త్ కోసం ఓటు వేయండి.
#WATCH | | Chhattisgarh Elections 2023 | CM Bhupesh Baghel says, "Today polling will happen for the remaining 70 seats...Your one vote will decide the future of youth, farmers, women...Please move out of your homes to vote...Vote for the betterment of Chhattisgarh." pic.twitter.com/Fgw59Q439x
— ANI (@ANI) November 17, 2023
►మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం.
Voting begins for the Madhya Pradesh Assembly elections, 230 assembly seats in the fray. pic.twitter.com/To0rATZpNV
— ANI (@ANI) November 17, 2023
►ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది.
#WATCH | Madhya Pradesh Elections 2023 | Preparation, mock poll underway as voting for #MadhyaPradeshElections2023 will begin at 7am today in the Sausar assembly constituency of Chhindwara district. pic.twitter.com/JBmEIJY29r
— ANI (@ANI) November 17, 2023
►ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లకు గాను రెండో, తుది దశలో భాగంగా 70 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది.
#WATCH | Madhya Pradesh Elections 2023 | District Election Officer, Ashish Singh says, "Bhopal has a total of 2049 polling booths. We have checked all the facilities at the polling booth...Around 17,000 workers were trained by us. Security arrangements are tight in all the… pic.twitter.com/bDy17B5gdW
— ANI (@ANI) November 17, 2023
►ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి దశలో 20 నక్సల్స్ ప్రాబల్య స్థానాల్లో పోలింగ్ ముగిసింది.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కుప్పకూలింది. శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ రెండింటితో పాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా మరోసారి గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
ఛత్తీస్‌గఢ్ రెండో దశలో...
రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 సీట్లతో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ ఐదేళ్లలో సీఎం భూపేశ్ బఘెల్ పలు ప్రజాకర్షక పథకాలతో రైతులతో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వచ్చారు. అనంరం ఉప ఎన్నికల విజయాలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71కి పెరిగింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment