ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..! | Sakshi
Sakshi News home page

Professor Alok Sagar: ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!

Published Fri, Apr 12 2024 2:04 PM

Inspiring True Story Of Professor Alok Sagar IIT Delhi  - Sakshi

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ డిగ్రీలు చేశాడు. అతడి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులగా పనిచేస్తున్నారు. అతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయినా వాటన్నింటికి కాదని కరెంటు సౌకర్యం కూడా లేనో ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అత్యంత సాదాసీదాగా జీవితం గడుపుతాడు. ప్రజల సేవ పరమావధిగా భావించే మహోన్నత వ్యక్తి ప్రోఫెసర్‌ అలోక్‌ సాగర్‌. అతడెవరూ? అతని నేపథ్యం ఏంటంటే..

అలోక్‌ సాగర్‌ ఐఐటీ ఢిల్లీ  గ్య్రాడ్యేయేట్‌, ఎన్నో మాస్టర్స్‌ డిట్రీలు చేసిన వ్యక్తి. పైగా యూఎస్‌ఏలోని టెక్సాస్‌లో హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ కూడా చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన కొన్నాళ్లు ఐఐటీ ఢిల్లీలో మాజీ ప్రోఫెసర్‌గా పనిచేశారు అలోక్‌ సాగర్‌. అంతేగాదు ఐఐటీ ఢిల్లీలో ప్రోఫెసర్‌గా పాఠాలు బోధిస్తున్నప్పుడూ అలోక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ వంటి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాడు. ఏమయ్యిందో ఏమో సడెన్‌గా ప్రోఫెసర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి అలోక్‌ మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి నివశించడం ప్రారంభించారు.

ఆ గ్రామంలో సరైన రోడ్డు సదుపాయాలు, కరెంట్‌ సౌకర్యం వంటివి ఏమీలేవు. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల మాండలికాన్ని నేర్చుకున్నారు. వారి జీవన విధానాన్ని స్వీకరించారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముతారు అలోక్‌. అందుకోసమే ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అంతేగాదు ప్రొఫెసర్‌ అలోక్‌ పేరుమీద ఢిల్లీలో కోట్ల ఆస్తులున్నా వాటన్నింటి త్యజించి గిరిజనుల కోసం పాటు పడ్డారు. ఆయన తల్లి మిరాండా హౌస్‌ డిల్లీలో ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ తండ్రి ఇండియన్‌ రెవెన్నయూ సర్వీస్‌ అధికారి, తమ్ముడు ఐఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్యావంతుడు అయ్యి ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరింటిలో జీవించడం, కేవలం మూడు కుర్తాలతో ఉండటం అంత ఈజీ కాదు.

చాలామంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటూరు గానీ ఇలా వారి జీవన విధానం స్వీకరించి మరీ సంక్షేమం కోసం పాటుపడరు. కానీ అలోక్‌ అలా కాదు గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పాటుపడ్డారు. అంతేగాదు ఆ గ్రామంలో పయనించేందుకు కూడా ఓ సాదారణ సైకిల్‌నే వినియోగిస్తారు. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50 వేలకు పైగా చెట్లను నాటారు. దీంతోపాటు గ్రామాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీట్లరు సైకిల్‌పై ‍ప్రయాణించి మరీ ఇస్తారు.

ఆయన చాలామంది డిగ్రీలు చేసి స్టేటస్‌ చూపించుకోవడం, ఆస్తులు సంపాదించే పనిలోనే ఉన్నారు. సమాజ సేవ కోసం తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదని ఆశోక్‌ బాధగా అన్నారు. ఇక ఆయాన దాదాపు 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు. ఆయన చేస్తున్న సమాజ సేవ చూసి ఆ జిల్లా అధికారులు, గ్రామాధికారులు నాయకుడిగా ఎదగాలనుకుంటున్నాడేమోనన్న భయంతో ఈ ఊరి వదిలి వెళ్లిపోమనడంతో..ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. తన వివరాలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపోయాయి. ఈ విషయం వార్తల్లో హైలెట్‌ అయ్యింది కూడా. చివరికి ఆయన చెప్పిందంతా నిజమేనని తేలింది. ఐఐటీ ప్రొఫెసర్‌ స్థాయి అయ్యి ఉండి కూడా కించెత్తు నామోషి లేకుండా ఓ మారుమూల ప్రాంతంలోని గిరిజనుల కోసం పాటుపడటం వారితో కలిసి జీవించడం నిజంగా గ్రేట్‌ కదూ. ఇలా మరెవ్వరూ చేయరేమో.!గిరిజనుల సంక్షేమం కోసం వచ్చిన 'శ్రీమంతడు' ‍‍ప్రొఫెసర్‌ అలోక్‌ సాగర్‌..!

(చదవండి: ఐస్‌ క్రీమ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.)

Advertisement
Advertisement