సమస్య చెబుతున్న గ్రామీణ మహిళపై కస్సుమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శినీ రాజే సింధియా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. గ్రామీణ మహిళ పట్ల ఆమె ప్రవర్తినపై విమర్శలు వెల్లువెత్తాయి.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్య ప్రదేశ్‌లోని గుణ-శివపురి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రియదర్శిని తన భర్త విజయం కోసం కుమారుడితో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియదర్శిని రాజే ఖుజ్రీ గ్రామానికి వెళ్లగా అక్కడ కొందరు మహిళలు గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను లేవనెత్తారు. దీంతో ఆమె సమస్యలను రాసి తమకివ్వలని చెప్పారు. ఇంతలో ఓ మహిళ “నువ్వే రాసుకో” అంది. అది విన్న ప్రయదర్శిని రాజే ఆగ్రహానికి గురై, "మీరు రాసి నాకు ఇవ్వండి, మీ పని చేయడం నా పని కాదు" అంటూ చిరాకుపడ్డారు.
ఖుజ్రీ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, మహిళలు ప్రయదర్శిని సింధియాను ఆశ్రయించారు. గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదని ఆ గ్రామ మహిళలు వాపోతున్నారు. ఈ సమయంలో, ఒక మహిళ, "మేడమ్, మీరు దయచేసి ఒకసారి ఇక్కడికి రండి. ఇక్కడ నీటి కోసం ఒక ట్యాంక్ ఉంది, కానీ అందులో నీరు లేదు" అంటూ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment