భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల క్రితం జన్మించిన చీతా కూన మంగళవారం చనిపోయిందని అటవీ శాఖ తెలిపింది. దీంతో, ఆఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చిన వాటితో కలిపి రెండు నెలల కాలంలో మృతి చెందిన చీతాల సంఖ్య నాలుగుకు చేరింది.
నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన ‘జ్వాల’కు మార్చిలో నాలుగు కూనలు పుట్టాయి. మంగళవారం తల్లితోపాటు మూడు కూనలు అటవీ ప్రాంతంలో తిరుగాడుతుండగా, నాలుగో కూన మాత్రం కదలకుండా ఉంది. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కొద్ది సేపటికే చనిపోయింది’ అని అటవీ శాఖ వివరించింది. ఈ కూన పుట్టినప్పటి నుంచి బలహీనంగానే ఉందని తెలిపింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకువచ్చిన చీతాల్లో మూడు గత రెండు నెలల్లో చనిపోవడం తెలిసిందే.
ఇది కూడా చదవండి: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..
Comments
Please login to add a commentAdd a comment