కునో నేషనల్‌ పార్క్‌లో సందడి.. మూడు చీతాలకు జన్మనిచ్చిన ‘ఆశా’ | Namibian Cheetah Gives Birth To Four Cubs In Kuno National Park | Sakshi
Sakshi News home page

కునో నేషనల్‌ పార్క్‌లో సందడి.. మూడు చీతాలకు జన్మనిచ్చిన ‘ఆశా’

Jan 3 2024 9:32 PM | Updated on Jan 3 2024 9:35 PM

Namibian Cheetah Gives Birth To  Four Cubs In Kuno National Park - Sakshi

‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమీబియా నుంచి తీసుకోచ్చిన ‘ఆశా’ అనే చీతా తాజాగా మూడు చీతా పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయానికి సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

‘కునో నేషనల్‌ పార్క్‌లో ‘ఆశా’ చీతా.. మూడు చీతా కూనలకు జన్మనిచ్చిన విషయం పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది. ‘ఆశా’ను ప్రాజెక్టు చీతాలో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చారు. ఈ ప్రజెక్టులో చీతాల సంరక్షణకు కృషి చేస్తున్న కునో నేషనల్‌ పార్క్‌ వైల్డ్‌ లైఫ్‌ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు’ అని భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. 

దశాబ్దాల క్రితం ఇండియాలో అంతరిచిన పోయిన చీతాలను తిరిగి అభివృద్ధి చేయాలన్నలక్ష్యంతో 17 సెప్టెంబర్‌ 2022న ప్రాజెక్టు చీతాను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా పుట్టిన మూడు చీతా పిల్లతో కలిపి మొత్తం చీతాల సంఖ్య 18కి చేరింది. అయితే నమీబియా నుంచి తీసుకువచ్చిన ‘సాశా’ అనే ఆడ చీతా 2023 మార్చి 27న మరణించిన విషయం తెలిసిందే. ‘ప్రాజెక్టు చీతా’  భాగంగా మొత్తం 8 చీతాలను నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

చదవండి: ప్చ్‌.. మన బాహుబలికి అంత బలం లేదట! అందుకే ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement