ఒక్కరోజైనా ‘గ్యాప్’ ఇవ్వండి
అయితే వారానికి ఎన్ని రోజులు ఎంత డోసు తీసుకుంటే మృత్యువును ముద్దాడాల్సి వస్తుందనే అంశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్యవిద్యాలయం నిపుణులు ఇటీవల అధ్యయనం చేశారు. ఇక్కడ ఒకరు ఎంత తాగుతారన్నది ముఖ్యం కాదని, వారానికి ఎన్ని రోజులు తాగుతారన్నదాన్ని బట్టే కాలేయ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్ గ్రోఆస్కార్డ్ బృందం తేల్చింది. వారానికి ఒకటి లేదా రెండు రోజులు తాగకుండా వుంటే కాలేయ వ్యాధి ముప్పు నుంచి ఎక్కువ వరకు బయటపడవచ్చని వారు దాదాపు 54 వేల మంది మందుభాయిలపై జరిపిన అధ్యయనంలో బయటపడింది.
కనీసం వారానికి ఒక్కరోజైనా మందుకు ‘గ్యాప్’ ఇస్తే కాలేయం తనను తాను మరమ్మతు చేసుకోవడానికి వీలుంటుందని నిపుణుల బృందం పేర్కొంది...మానవ శరీరంలోని కీలక అవయవాల్లో ఒక్క కాలేయ కణాలకు మాత్రమే పునరుత్పత్తి లక్షణాలు ఉండడమే దీనికి కారణం. పూర్తి వివరాలకు హెపటాలజీ పత్రికను చూడవచ్చు.