liquor habit
-
భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య మృతి
అతిగా మద్యం తాగడం వల్లే ? హైదరాబాద్: అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న ఓ మహిళ భర్త ఊరెళ్లొచ్చేసరికి మరణించింది. నల్లకుంట ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం... వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన జి.చలపతిరావుకు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్‌కు చెందిన స్వరూప(30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కడపలో ఉద్యోగం చేస్తున్న చలపతిరావు భార్యతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. స్వరూపకు నిత్యం మద్యం తాగే అలవాటుంది. విధి నిర్వహణలో భాగంగా చలపతిరావు ఈనెల 22న కడపకు వెళ్లగా... స్వరూప ఒక్కత్తే ఇంట్లో ఉంది. గురువారం ఉదయం 8.30కి ఇంటికి తిరిగి వచ్చి భర్త తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో చలపతిరావు చుట్టు పక్కల వారి సహాయంతో కిచెన్ డోర్ తెరిచి లోపలికి వెళ్లగా.. మంచంపై స్వరూప చలనం లేకుండా పడి ఉంది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ వైద్యురాలిని పిలిపించగా.. అప్పటికే స్వరూప మృతి చెందినట్టు వెల్లడించింది. చలపతిరావు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న స్వరూపకు కాలేయం పూర్తిగా పాడైందని వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్కరోజైనా ‘గ్యాప్’ ఇవ్వండి
మద్యం ప్రియులు ఎన్ని రకాలుగా ఎంత సమర్థించుకున్న మద్యం తాగడం మంచిది కాదన్న మాటతో అందరు ఏకీభవించక తప్పదు. మద్యం అలవాటు వల్ల ‘లివర్ సిరోసిస్’(కాలేయ వ్యాధి) వస్తుందని, అది ముదురితే మృత్యువు తప్పదని డాక్టర్లు స్టెతస్కోప్ నెత్తికి కొట్టుకొని చెప్పినా మన మందుబాబులు వినిపించుకోరు. అయితే వారానికి ఎన్ని రోజులు ఎంత డోసు తీసుకుంటే మృత్యువును ముద్దాడాల్సి వస్తుందనే అంశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి డెన్మార్క్‌లోని కోపెన్హాగన్ విశ్యవిద్యాలయం నిపుణులు ఇటీవల అధ్యయనం చేశారు. ఇక్కడ ఒకరు ఎంత తాగుతారన్నది ముఖ్యం కాదని, వారానికి ఎన్ని రోజులు తాగుతారన్నదాన్ని బట్టే కాలేయ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్ గ్రోఆస్కార్డ్ బృందం తేల్చింది. వారానికి ఒకటి లేదా రెండు రోజులు తాగకుండా వుంటే కాలేయ వ్యాధి ముప్పు నుంచి ఎక్కువ వరకు బయటపడవచ్చని వారు దాదాపు 54 వేల మంది మందుభాయిలపై జరిపిన అధ్యయనంలో బయటపడింది. కనీసం వారానికి ఒక్కరోజైనా మందుకు ‘గ్యాప్’ ఇస్తే కాలేయం తనను తాను మరమ్మతు చేసుకోవడానికి వీలుంటుందని నిపుణుల బృందం పేర్కొంది...మానవ శరీరంలోని కీలక అవయవాల్లో ఒక్క కాలేయ కణాలకు మాత్రమే పునరుత్పత్తి లక్షణాలు ఉండడమే దీనికి కారణం. పూర్తి వివరాలకు హెపటాలజీ పత్రికను చూడవచ్చు.