
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నూతనకల్: మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నూతన్‌కల్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పుల వెంకన్న(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు మల్లయ్య తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు. కాగా, మల్లయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు.
ఇదే విషయంపై తండ్రికొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కుమారుడు తాగి రావడంతో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకన్న తలపై మల్లయ్య కర్రతో దాడిచేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంకన్నకు ఎలాంటి వైద్యచికిత్స అందించకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు సీఐ రవి పర్యవేక్షణలో ఎస్‌ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
( చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి )
Comments
Please login to add a commentAdd a comment