కర్నూలు: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్, అలాగే గణేష్ నిమజ్జనం ఒకే రోజు రావడంతో పోలీసు శాఖ ఉత్కంఠకు లోనైంది. ఎస్పీ ఆకే రవికష్ణ ప్రత్యేక దష్టి సారించి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు శ్రమించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది కూడా ఈ రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఆ అనుభవంతో ఈ ఏడాది కూడా ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. సివిల్ పోలీసులతో పాటు ఏపీఎస్పీ ఆర్మ్‌డ్ రిజర్వు విభాగం పోలీసు సేవలను బందోబస్తు విధులను వినియోగించుకున్నారు. మతసామరస్యాన్ని చాటుతూ హిందు ముస్లింలు కలసిమెలసి పండుగలను ఘనంగా జరుపుకున్నారని, ఇదే స్పూర్తిని నిరంతరం చాటాలని ఎస్పీ ఆకే రవికష్ణ ఆకాంక్షించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు, యువకులు, విద్యార్థులు, రాజకీయ పక్షాలు, మీడియా ప్రతినిధులకు ఎస్పీ ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలిపారు. కాగా.. మద్యం, బాణసంచా విక్రయాలు, రంగులు చల్లడంపై పోలీసు శాఖ నిషేధం ప్రకటించినప్పటికీ అమలు కాలేదు. నగరంలో య«థేచ్ఛగా మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలను ఎకై ్సజ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ ముందురోజే స్టాకును పక్కకు తరలించి విక్రయాలు జరిపి సొమ్ము చేసుకున్నారు.
చిన్నమార్కెట్ దగ్గర స్వల్ప ఘర్షణ
గణేశ్ విగ్రహాల ఊరేగింపులో పాతబస్తీలోని చిన్నమార్కెట్ దగ్గర స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు కుమారుడు సముద్రాల శ్రీధర్‌పై గుర్తు తెలియని యువకులు దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయాలకు గురైన శ్రీధర్ స్థానిక గౌరీగోపాల్ ఆసుపత్రిలో వైద్యచికిత్సలు పొందారు. ఈ మేరకు గౌరీగోపాల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ లీగల్ కేస్ సమాచారం చేరింది. అయితే ఈ విషయంపై ఒకటో పట్టణ సీఐ కష్ణయ్యను వివరణ కోరగా అలాంటి సమాచారం తమ దష్టికి రాలేదని, గణే‹శ్ విగ్రహాల ఊరేగింపులో కూడా ఎలాంటి చిన్నపాటి ఘర్షణ జరగలేదని తెలిపారు.
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
Published Wed, Sep 14 2016 12:51 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement