ది హాగ్యు: యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్కు డచ్ అత్యున్నత రాయల్ పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది నెదర్లాండ్స్ లయన్' లభించింది. మంగళవారం నెదర్లాండ్స్లోని ది హాగ్యు పట్టణంలో మూన్ ఈ పురస్కారాన్ని డచ్ విదేశాంగ శాఖ మంత్రి బెర్ట్ కోఏండర్స్ చేతుల మీదుగా అందుకున్నారు. సభలో మూన్ గురించి మాట్లాడిన బెర్ట్.. ప్రపంచ శాంతిభద్రతలు, న్యాయం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేశావని ప్రకృతి విపత్తుల బాధితులకు గొంతుక అయ్యారని మూన్ను ఉద్దేశించి అన్నారు.
ప్రపంచ శాంతితో పాటు దేశాల మధ్య సఖ్యతను నెలకొల్పడం, మానవ హక్కుల కోసం పోరాటం కింద డచ్ ప్రభుత్వం మూన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.1815లో ప్రారంభమైన ఈ పురస్కార ప్రధానం ప్రపంచంలోని అన్ని రంగాల్లో నిపుణులకు డచ్ ప్రభుత్వం అందజేస్తోంది. గతంలో యూఎన్ జనరల్గా పనిచేసిన కొఫ్పి అన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
బాన్కీ మూన్కు ప్రతిష్టాత్మక పురస్కారం
Published Wed, Apr 20 2016 3:26 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement