ban ki moon
-
ఐరాసలో పాకిస్థాన్‌కు చుక్కెదురు
పాకిస్థాన్ కుటియత్నానికి ఐక్యరాజ్యసమితిలో మరోసారి చుక్కెదురైంది. కశ్మీర్ సమస్యకు ఏవేవో రంగులు పూసి, దాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి, ఆ సమస్య పరిష్కారంలో వివిధ దేశాలతో వేలు పెట్టించాలనుకున్న ఆ దేశ ప్రయత్నానికి మళ్లీ గండిపడింది. కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటూ పాకిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అది ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కారం అవ్వాల్సిన సమస్య అని, భారత్-పాక్ దానిపై చర్చించుకోవాలని నవాజ్ షరీఫ్‌కు స్పష్టం చేశారు. ఇది ఆ రెండు దేశాల ప్రయోజనాలతో పాటు ఆ ప్రాంతం మొత్తం ప్రయోజనాలకు మేలు చేస్తుందని తెలిపారు. కశ్మీరీలపై మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, భారత సైన్యం అక్కడ అఘాయిత్యాలు చేస్తోందని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన వివరాలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్.. బాన్ కీ మూన్ కు అందించారు. కశ్మీర్లో జరుగుతున్న చట్టవిరుద్ధమైన హత్యలపై స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు. అయితే, ఎన్నిసార్లు ఐక్యరాజ్యసమితిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని చూసినా పాకిస్థాన్‌కు మాత్రం భంగపాటు తప్పడం లేదు. ఈసారి కూడా సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ మరోసారి పాక్ వాదనను తిప్పికొట్టారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య సమస్య మాత్రమేనని, అందువల్ల ఇందులో అంతర్జాతీయ జోక్యానికి తావులేదని తెలిపారు. అలాగే ఆయన తన ప్రసంగంలో కూడా ఎక్కడా కశ్మీర్ అంశాన్ని అస్సలు ప్రస్తావించలేదు. మయన్మార్, శ్రీలంకలలో నెలకొన్న పరిస్థితులు, కొరియన్ ద్వీపంలో, మధ్యప్రాచ్యంలో అస్థిరతను గురించి మాట్లాడారు తప్ప కశ్మీర్ ఊసెత్తలేదు. ఇది పాకిస్థాన్‌కు పెద్ద భంగపాటుగా మిగిలింది. నవాజ్ షరీఫ్ మాత్రం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడేటప్పుడు కశ్మీర్ సమస్యను ఐరాస పరిష్కరించాలని కోరారు. కేవలం భారత్, పాక్ రెండు దేశాలూ కోరితే మాత్రమే కశ్మీర్ సమస్య పరిష్కారానికి తమవంతు సాయం అందిస్తామని బాన్ కీ మూన్ కార్యాలయం ఇంతకుముందు కూడా పలుమార్లు తెలిపింది. -
అమెరికా అధ్యక్షుడిని అలా అనలేదు!
జకర్తా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తాను వెలయాలి కొడుకు అని అనలేదని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యురెటె పేర్కొన్నారు. లావోస్ లో సమ్మిట్ కు ముందు యూఎన్ చీఫ్ మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తడం ఆయన వెర్రితనానికి నిదర్శనమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియా పర్యటనకు వచ్చిన డ్యురెటెపై వ్యాఖ్యలు చేశారు. ఒబామాతో సమావేశం కోసం తాను వేచిచూసినట్లు చెప్పారు. ఒబామాను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కావాలంటే తన స్టేట్ మెంట్ ను మరోసారి పరిశీలించుకోవాలని అన్నారు. తాను అమెరికాతో పోరాటం చేయడం లేదని పేర్కొన్నారు. అది తన ఉద్దేశం కూడా కాదని అన్నారు. సోమవారం డ్యురెటె వ్యాఖ్యల అనంతరం సమావేశాన్ని అప్పటికప్పుడు రద్దు చేసుకున్న ఒబామా.. బుధవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. -
బాన్‌కీ మూన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
ది హాగ్యు: యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్‌కు డచ్ అత్యున్నత రాయల్ పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది నెదర్లాండ్స్ లయన్' లభించింది. మంగళవారం నెదర్లాండ్స్‌లోని ది హాగ్యు పట్టణంలో మూన్ ఈ పురస్కారాన్ని డచ్ విదేశాంగ శాఖ మంత్రి బెర్ట్ కోఏండర్స్ చేతుల మీదుగా అందుకున్నారు. సభలో మూన్ గురించి మాట్లాడిన బెర్ట్.. ప్రపంచ శాంతిభద్రతలు, న్యాయం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేశావని ప్రకృతి విపత్తుల బాధితులకు గొంతుక అయ్యారని మూన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచ శాంతితో పాటు దేశాల మధ్య సఖ్యతను నెలకొల్పడం, మానవ హక్కుల కోసం పోరాటం కింద డచ్ ప్రభుత్వం మూన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.1815లో ప్రారంభమైన ఈ పురస్కార ప్రధానం ప్రపంచంలోని అన్ని రంగాల్లో నిపుణులకు డచ్ ప్రభుత్వం అందజేస్తోంది. గతంలో యూఎన్ జనరల్‌గా పనిచేసిన కొఫ్పి అన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. -
'ఆ దాడిని ఖండిస్తున్నా.. ఈ దాడి తెలియదు'
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లోని భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఖండించారు. అదే సమయంలో భారత్‌లోని పంజాబ్ లోగల పఠాన్ కోట్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై మాత్రం స్పందించలేదు. ఆదివారం రాత్రి కొందరు ఉగ్రవాదులు అప్గానిస్తాన్‌లోని మజరీఈ షరీప్ నగరంలోని భారత దౌత్యకార్యాలయంపైకి దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ దాడిని భద్రతా బలగాలు సమర్ధంగా ఎదుర్కొన్నాయి. దీనికి సంబంధించి బాన్ కీ మూన్ స్పందిస్తూ 'మజరీ ఈ షరీఫ్ లోగల భారత్ కార్యాలయంపై జరిగిన దాడి ముమ్మాటికి ఖండించాల్సినదే. అన్ని దేశాల్లోని అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకు గట్టి భద్రత కల్పించాలని గతంలోనే నేను చెప్పాను' అని అన్నారు. పఠాన్ కోట్‌పై పాక్ ఉగ్రవాదుల దాడిపై మాత్రం 'దానిపైన నేను ప్రత్యేకంగా మాట్లాడిల్సింది ఏమీ లేదు. దానిపై మాట్లాడేందుకు నా వద్ద వివరాలు కూడా ఏమీ లేవు' అని బాన్ కీ మూన్ చెప్పినట్లు ఆయన వ్యక్తిగత అధికార ప్రతినిధి స్టీపెన్ దుజారిక్ చెప్పారు. -
'వారి కలయిక సంతోషాన్నిచ్చింది'
న్యూయార్క్: ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య భేటీ ఆహ్వానించదగిన పరిణామం అని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ అన్నారు. వారి మధ్య చోటుచేసుకున్న స్వల్ప వ్యవధి సంభాషణ భారత్, పాక్ దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు చిన్నమార్గాన్ని ఏర్పరిచినా తాను ఎంతో సంతోషిస్తానని చెప్పారు. ఈ మేరకు బాన్ కీ మూన్ అధికారిక ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పారిస్ లో జరగుతున్న ప్రపంచ వాతావారణ శిఖరాగ్ర సమావేశం కాప్ 21కు ప్రధాని నరేంద్రమోదీ హాజరైన విషయం తెలిసిందే. దీనికి షరీఫ్ కూడా వచ్చారు. అయితే, అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు వెళ్లినప్పుడు పక్కపక్క గదుల్లోనే ఉండి కూడా కనీసం కన్నెత్తి చూసుకొని ఇరు దేశాల ప్రధానులు ఈ కాప్ సమావేశంలో కూడా ఒకరినొకరు కలుసుకోరేమోనని పలు వర్గాలు భావించాయి. అదీ కాకుండా అంతకుముందు ఇరు దేశాలకు చెందిన రక్షణ అధికారుల సమావేశం కూడా అనూహ్యంగా రద్దు కావడంతో ఇక చర్చలు ముగిసినట్లేనని భావించారు. ఆ సమయంలో బాన్ కీమూన్ ఒక ప్రకటన కూడా చేశారు. పంతాలకు పోకుండా మరొకరి మధ్యవర్తిత్వం తీసుకోవడం ద్వారానైనా దాయాది దేశాలు వారి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందని అన్నారు. బహుశా ఈ పరిణామం వల్లనే మోదీ తాజాగా పారిస్ సమావేశంలో షరీఫ్ కు ఆత్మీయ కరచాలనం అందించారు. అనంతరం పక్కపక్కనే చాలా దగ్గరగా కూర్చుని మంచి మిత్రులుగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాన్ కీ మూన్ సంతోషం వ్యక్తం చేశారు. -
ఆయన ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు
న్యూయార్క్: తమ మధ్య సయోధ్యను కుదిర్చేందుకు భారత్, పాకిస్థాన్ దేశాలు ఒప్పుకుంటే ఆ పనిచేసేందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ఎప్పుడూ సిద్ధమేనని ఆయన ఉప అధికార ప్రతినిధి ఫరాన్ హక్ తెలిపారు. ఈ విషయాన్ని ఎప్పుడంటే అప్పుడు సమావేశమై చర్చించేందుకు ఆయన ఇది వరకే నిర్ణయించుకుని ఉన్నారని, అందుకు ఇరు దేశాలు మాత్రం కచ్చితంగా ఒప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యాన్ని భారత్ ఏ మాత్రం అంగీకరించని విషయం తెలిసిందే. ప్రత్యేకంగా కాశ్మీర్ విషయంలో మాత్రం భారత్ చాలా అప్రమత్తం ఉండి ఇరు దేశాలు మాత్రమే ఆ సమస్యను సావధానంగా పరిష్కరించుకోవాలని మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దని ఇప్పటికే స్పష్టం చేసింది కూడా. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్‌లో పాక్ పర్యటనకు బాన్ కీ మూన్ వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఈ విషయంపై తాజాగా కొందరు విలేకర్లు ఆయన కార్యాలయాన్ని సంప్రదించగా బాన్ కీ మూన్ ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారని ఫరాన్ హక్ పునరుద్ఘాంటించారు. -
అమలులోకి అంతర్జాతీయ ఆయుధాల ఒప్పందం
ఐక్యరాజ్యసమితి: అంతర్జాతీయ ఆయుధ వ్యాపారానికి సంబంధించి 85 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5 లక్షల 40 వేల కోట్లు) విలువైన నియంత్రణ ఒప్పందం బుధవారం నుంచి అమలులోకి వచ్చినట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ వెల్లడించారు. ఉగ్రవాదులు, మానవ హక్కుల దుర్వినియోగానికి పాల్పడే వారికి ఆయుధాలు చేరకుండా ఈ ఒప్పందం సహాయపడుతుందని, ప్రధానమైన ఆయుధాల ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఈ ఒప్పందంలో చేరాలని ఆయన సూచించారు. అయితే భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్ సహా 23 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేయలేదు.