జకర్తా: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను తాను వెలయాలి కొడుకు అని అనలేదని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యురెటె పేర్కొన్నారు. లావోస్ లో సమ్మిట్ కు ముందు యూఎన్ చీఫ్ మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తడం ఆయన వెర్రితనానికి నిదర్శనమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియా పర్యటనకు వచ్చిన డ్యురెటెపై వ్యాఖ్యలు చేశారు.
ఒబామాతో సమావేశం కోసం తాను వేచిచూసినట్లు చెప్పారు. ఒబామాను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. కావాలంటే తన స్టేట్ మెంట్ ను మరోసారి పరిశీలించుకోవాలని అన్నారు. తాను అమెరికాతో పోరాటం చేయడం లేదని పేర్కొన్నారు. అది తన ఉద్దేశం కూడా కాదని అన్నారు. సోమవారం డ్యురెటె వ్యాఖ్యల అనంతరం సమావేశాన్ని అప్పటికప్పుడు రద్దు చేసుకున్న ఒబామా.. బుధవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిని అలా అనలేదు!
Published Fri, Sep 9 2016 6:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement