ఒబామా గో టు హెల్
ఒబామా గో టు హెల్
Published Wed, Oct 5 2016 12:27 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొట్రిగో డుటెర్టె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను హిట్లర్కు సోదరునిలాంటి వాన్నని చంపడానికి వెనుకాడని తేల్చి చెప్పిన ఆయన తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విరుచుకుపడ్డారు. ఒబామా నరకానికిపోతాడని శపించారు. ఇందుకు కారణం ఫిలిప్పీన్స్ కు ఆయుధాలు అమ్మమని అమెరికా తెగేసి చెప్పడమే.
అమెరికా తన గౌరవాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. ఫిలిప్పీన్స్ లో డ్రగ్స్కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటాన్ని తప్పుగా చూసేవారు మూర్ఖులని పేర్కొన్నారు. అమెరికా తమకు ఆయుధాలు ఇవ్వకుంటే రష్యా, చైనాలు ఆయుధాలు ఇస్తామని ఆహ్వానిస్తున్నాయని చెప్పారు. ఒక్క సంతకంతో తాను ఆ దేశాల నుంచి తెచ్చుకోవడానికి సిద్దమని తెలిపారు.
దేశ ప్రజలు డ్రగ్స్ కు బానిసలు కావడం తాను సహించనని చెప్పారు. అందుకు చంపడానికి సైతం సిద్దమని మరోసారి స్పష్టం చేశారు. అమెరికాతో తమ దేశానికి ఉన్న రక్షణ సహకార ఒప్పందాన్ని త్వరలోనే సమీక్షిస్తానని తెలిపారు. కాగా ఫిలిప్పీన్ కు ఆయుధాలను నిరాకరించడంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ యేడాది మేలో పదివీ బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో ప్రభుత్వం ఇప్పటి వరకు 3,400 మందిని హతమార్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Advertisement