న్యూయార్క్: ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య భేటీ ఆహ్వానించదగిన పరిణామం అని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్ కీ మూన్ అన్నారు. వారి మధ్య చోటుచేసుకున్న స్వల్ప వ్యవధి సంభాషణ భారత్, పాక్ దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు చిన్నమార్గాన్ని ఏర్పరిచినా తాను ఎంతో సంతోషిస్తానని చెప్పారు. ఈ మేరకు బాన్ కీ మూన్ అధికారిక ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. పారిస్ లో జరగుతున్న ప్రపంచ వాతావారణ శిఖరాగ్ర సమావేశం కాప్ 21కు ప్రధాని నరేంద్రమోదీ హాజరైన విషయం తెలిసిందే. దీనికి షరీఫ్ కూడా వచ్చారు.
అయితే, అంతకుముందు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు వెళ్లినప్పుడు పక్కపక్క గదుల్లోనే ఉండి కూడా కనీసం కన్నెత్తి చూసుకొని ఇరు దేశాల ప్రధానులు ఈ కాప్ సమావేశంలో కూడా ఒకరినొకరు కలుసుకోరేమోనని పలు వర్గాలు భావించాయి. అదీ కాకుండా అంతకుముందు ఇరు దేశాలకు చెందిన రక్షణ అధికారుల సమావేశం కూడా అనూహ్యంగా రద్దు కావడంతో ఇక చర్చలు ముగిసినట్లేనని భావించారు. ఆ సమయంలో బాన్ కీమూన్ ఒక ప్రకటన కూడా చేశారు.
పంతాలకు పోకుండా మరొకరి మధ్యవర్తిత్వం తీసుకోవడం ద్వారానైనా దాయాది దేశాలు వారి సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందని అన్నారు. బహుశా ఈ పరిణామం వల్లనే మోదీ తాజాగా పారిస్ సమావేశంలో షరీఫ్ కు ఆత్మీయ కరచాలనం అందించారు. అనంతరం పక్కపక్కనే చాలా దగ్గరగా కూర్చుని మంచి మిత్రులుగా మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాన్ కీ మూన్ సంతోషం వ్యక్తం చేశారు.
'వారి కలయిక సంతోషాన్నిచ్చింది'
Published Tue, Dec 1 2015 10:13 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM
Advertisement