కశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్‌లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు.
కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది.
ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment