12 నుంచి హనుమాన్ మహాయజ్ఞం
విజయవాడ(చిట్టినగర్) :
విశ్వశాంతి కోసం పుష్కరాల సమయంలో ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు పాలప్రాజెక్టు సమీపంలోని హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ హనుమాన్ మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీ తెలిపారు. పీఠం ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన యజ్ఞం వివరాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పుష్కరాలు జరిగే 12 రోజులు పీఠంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, అఖండనామ సంకీర్తనలు, అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని తెలిపారు. పీఠం కన్వీనర్ రాంపిళ్ల జయప్రకాష్ మాట్లాడుతూ పుష్కరయాత్రికులు హనుమత్ దీక్షా పీఠానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న అన్న ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. పారిశ్రామికవేత్త గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం జరుగుతున్న మహా యజ్ఞంలో భక్తులందరూ పాల్గొన్నారు. పవనానందస్వామి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.