
హైదరాబాద్ : పర్యాటక రంగానికి ప్రపంచ శాంతికి ఎనలేని సంబంధం ఉందని గ్లోబల్ అంబాసిడర్స్ ఫర్ పీస్ థ్రూ టూరిజం (జీఏపీటీ) ఛైర్మన్ తాజ్‌ముల్ హుసేన్ అన్నారు. పర్యాటక రంగం ద్వారా శాంతి విరాజిల్లుతుందని, ప్రతి పర్యాటకుడు శాంతి దూతేనని ఆయన అభివర్ణించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన పర్యాటక రంగం ద్వారా ప్రపంచ శాంతి అనే కార్యక్రమంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఏపీటీ పోస్టర్‌ను వక్తలు విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ సురేష్ చుక్కపల్లి, స్కాల్ ఇంటర్నేషనల్‌కు చెందిన విజయ్ మోహన్‌రాజ్, అద్నాన్ అల్టే తదితరులు పాల్గొన్నారు.