శాంతి, సామరస్యాల కోసం ప్రార్థించాలి
Published Tue, Aug 16 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడానికి అల్లాహ్‌ను ప్రార్థించాలని నగరానికి చెందిన అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం సంస్థ సభ్యులు సూచించారు. మంగళవారం స్థానిక ఆ సంస్థ కార్యాలయంలో నగరం నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలను సత్కరించారు. మక్కాకు వెళ్లి అక్కడి ఆచార, సంప్రదాయాల ప్రకారం నడుచుకుని నగరం సుభిక్షంగా ఉండేలా అల్లాహ్‌ను వేడుకోవాలని ముహాఫిజల్ కోరారు. హజ్ యాత్రలో అనుసరించాల్సిన విధానాలను మతపెద్దలు వివరించారు. ఏలూరు నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఈ ఏడాది పది మంది హజ్ యాత్రకు వెళుతున్నారు. అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎం అక్బర్, ఎండీ సాధిక్, ఉపాధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీలు అబ్దుల్ రహమాన్ ఖురేషీ, ఎండీ బహబూబ్ పాషా, కోశాధికారి ఎండీ సులేమాన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement