బోధన్ టౌన్ : బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్‌ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన కేసీఆర్, ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
2001 నుంచి 2014 వరకు కేసీఆర్ తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే దళితున్ని ముఖ్య మంత్రి చేస్తానని వెయ్యిసార్లు చెప్పి దళితులను మోసంచేశారని విమర్శించారు. ఉద్య మ సమయంలో, ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు బోధన్ వచ్చిన కేసీఆర్, కవిత, కేటీఆర్ ఫ్యాక్టరీని ప్రభుత్వంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని హామీలు ఇచ్చారని, దళితులను మోసం చేసినట్లు ఫ్యాక్టరీ పై ఆధారపడి ఉన్న కార్మికుల, నిరుద్యోగుల కుటంబాలను మో సం చేయవద్దని కోరారు. ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకునే దిశగా ఉద్యమిస్తామని, త్వరలో ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేస్తామన్నారు.
ఒకే రోజు సర్వే నిర్వహించానని గొప్ప లు చెప్పుకునే కేసీఆర్ ఒకే రోజు దళితులకు భూపంపిణీ ఎందుకు చేయలేదన్నారు. ప్రభుత్వ, మిగులు భూములను పరిశ్రమలకు ఇస్తే సహించేది లేదన్నారు. ఎన్నికలకు ముందు నక్సల్స్ ఎజెండాలను అమలు చేస్తామని చెప్పిన సీఎం, వారి ఎజెండాను ఎందుకు వారితో చర్చిం చరన్నారు. వారిపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు మానికొల్ల గంగాధర్, జిల్లా ఇన్‌చార్జి సామ్యెల్, జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, వీహెచ్‌పీ రాష్ట్ర మహిళా వి భాగం అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ పాల్గొన్నారు.
‘నిజాం షుగర్స్’ను సర్కార్ స్వాధీనం చేసుకోవాలి
Published Tue, Aug 26 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement