Deccan Nizam sugar factory
-
ప్రజల కలలు కల్లలయ్యాయి
► టీఆర్ఎస్ హామీలతో ప్రజలు కలలు కన్నారు ► కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సాక్షి, నిజామాబాద్: ‘‘ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలతో ప్రజలు కలలు కన్నారు. డబుల్బెడ్రూం ఇళ్లలో పడుకున్నట్లు.. మూడెకరాల భూమిలో దున్నుకున్నట్లు.. రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు.. కేసీఆర్ మాటలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ కలలు కల్లలై ఇప్పుడు అనుభవిస్తున్నారు’’ అని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు.నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్వంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 4 రోజులుగా చేస్తున్న పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా బోధన్‌లో జరిగిన సభలో జానారెడ్డి ప్రసంగించారు. షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని శాసనసభ, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెం చుతామన్నారు. 2019లో తాము అధికారంలోకి వచ్చాక ఎన్డీఎస్ఎల్తోపాటు, సిర్పూర్ పేపర్ మిల్లు, వరంగల్ రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్న కేసీఆర్ రైతుల రుణమాఫీకి రూ.6వేల కోట్లను ఏకకాలంలో బ్యాంకులకు విడుదల చేసి, 37 లక్షల మంది రైతుల పాస్‌బుక్కులు, బంగారు నగలను విడిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్డీఎస్ఎల్ను పున రుద్ధిస్తామన్న కేసీఆర్.. రెండేళ్లయినా చేయలేకపోవడానికి కారణం నిధుల కొరతా.. చెరుకు రైతులు, కార్మికులపై నిర్లక్ష్య వైఖరా చెప్పాలన్నారు. పోచారం పనితీరు బాగాలేదని తన సర్వేల ద్వారా కేసీఆర్ తేల్చారని, దీంతో ఆయన పదవి ఊడటం ఖాయమైనందున పదవి నుంచి తప్పుకోవాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ను సగం అమ్మితే, టీఆర్ఎస్ సర్కారు దాన్ని పూర్తిగా అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ.. టీడీపీ బీ టీం అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల పార్టీగా తయారైందని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శిం చారు. ఎన్డీఎస్ఎల్లో చెరుకు క్రషింగ్ ప్రారంభించకపోతే, టీఆర్ఎస్ ఎన్నికల హెలికాప్టర్ క్రాష్ అవడం ఖాయమని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, నేతలు సునీతాలక్ష్మారెడ్డి, ఈరవత్రి అనిల్, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్ తదిత రులు పాల్గొన్నారు. -
చెరకు రైతుకు తీపి కబురు...
* టన్ను చెరకుకు రూ.2,600 ఇచ్చేందుకు సీఎం సముఖత * సర్కార్ తరఫున రూ.340 రైతు ఖాతాల్లో జమ * డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడి * ఆనందంలో రైతన్నలు మెదక్: ధరాఘాతంతో విలవిల్లాడుతున్న చెరకు రైతుకు తీపి కబురు అందింది. చెరకుకు గిట్టుబాటు కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలిసిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి బర్త్‌డే గిఫ్ట్ దొరికింది. టన్ను చెరకుకు రూ.2,600 చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఈ మేరకు రెండు రోజుల్లో జీఓ వెలువడుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులకు ఈ సంవత్సరం ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.2,260 లు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే గత ఏడాది రూ.2600 చెల్లించిన యాజమాన్యం ఈసారి రూ.360లు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో సోమవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చెరకు రైతు నాయకులతో సీఎంను కలిసి రైతుల బాధలు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరఫున టన్ను చెరకుకు రూ.340 రైతుల ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో జీఓ వెలువడుతుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఎన్డీఎస్ఎల్ పరిధిలోని చెరకు రైతులను చెరకు సాగు అవగాహన నిమిత్తం మహారాష్ట్ర పంపేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. మహారాష్ట్రలో చెరకు రైతులు ఎకరాకు 80 నుంచి 100 టన్నుల చెరకును పండిస్తున్నందున వారి వ్యవసాయ విధానాన్ని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్డీఎస్ఎల్ మంభోజిపల్లి పరిధిలో ఈ సంవత్సరం 1.20 లక్షల టన్నుల చెరుకు గానుగ ఆడనుంది. సీఎం తాజా హామీతో సుమారు 2,590 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. నాకిది బర్త్‌డే గిఫ్ట్ చెరకు రైతు కష్టాలు తీర్చాలని సీఎం కలిశాను. మంగళవారం నా జన్మదినం. చెరకు రైతుకు మేలు జరిగేలా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఒకరోజు ముందుగానే నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ రైతుల కోసం ఎంతటి వ్యయ ప్రయాసలైనా భరిస్తుందని ఆ సంఘటనతో మరోసారి తేలిపోయింది. సీఎం నిర్ణయంతో రాష్ట్రంలోని ఎన్డీఎస్ఎల్ పరిధిలో గల మూడు ఫ్యాక్టరీల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. -పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
చేదు కబురు
మెదక్ రూరల్: ఇప్పుడు..అప్పుడంటూ..ఇన్నాళ్లూ క్రషింగ్ తేదీలను వాయిదా వేస్తూ వచ్చిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్ఎల్) శనివారం చెరకు రైతులకు చేదు వార్త చెవిన వేసింది. వాతావరణ పరిస్థితుల వల్ల క్రషింగ్ సమయానికి ఇంకొంత సమయం పడుతుందని, అందువల్ల ఫ్యాక్టరీకి తెచ్చిన చెరకును బోదన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలని సూచించింది. దీంతో చేసేది లేక నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ వద్ద పడిగాపులుగాచిన రైతులు చెరకును తీసుకుని బోధన్ బాట పట్టారు. మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో 12 మండలాల చెరకు రైతుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాతికేళ్ల క్రితం ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వం నష్టాలను సాకుగా చూపుతూ ఆ ఫ్యాక్టరీని దక్కన్ పేపర్ మిల్లు యజమానికి చాలా తక్కువకు విక్రయించింది. నాటి నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులతో పాటు ఈ ప్రాంత చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రషింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభించడం...డబ్బు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో చెరకు రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నెల ఆలస్యమన్నారు...ఇపుడు అదీలేదు ఎన్డీఎస్ఎల్లో ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో క్రషింగ్‌ను ప్రారంభించాల్సి ఉండగా, ఈ సంవత్సరం డిసెంబర్ 10న క్రషిం గ్ను ప్రారంభించారు. అయితే ఇంతవరకు టన్ను చెరకును కూడా గానుగ ఆడించలేదు. అయితే క్రషింగ్ తేదీని యాజమాన్యం ముందుగానే ప్రకటించడంతో 12 మండలాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలతో చెరకును ఫ్యాక్టరీకి తరలించారు. తీరా నాలుగు రోజులు గడిచాక, వాతావరణం చల్లగా ఉందన్న సాకును చూపుతూ క్రషింగ్ ప్రారంభించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఎన్డీఎస్ఎల్లో క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రైతులంతా తమ చెరకును బోధన్‌లోని ఫ్యాక్టరీకి తీసుకువెళ్లాలని సూచించింది. కావాలంటే బోధన్ వరకు రవాణా చార్జీల కింద టన్నుకు రూ.400 చొప్పున చెల్లిస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పటికే నాలుగురోజులుగా ఫ్యాక్టరీ ఎదుట చెరకుతో నిరీక్షిస్తున్న రైతులు ఏం చేయాలో తెలియని స్థితిలో బోధన్ బాటపట్టారు. అయితే 100 కి.మీ దూరం తీసుకెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, పైగా చెరకు బరువు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా నడిచేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అధికారి వివరణ ఈ విషయంపై ఫ్యాక్టరీ జీఎం నాగరాజును వివరణ కోరగా వాతావరణ చల్లగా ఉన్నందున క్రషింగ్ నడవటం లేదు. అందుకే నాలుగు రోజులుగా నిలువ ఉన్న చెరకును బోధన్ పంపుతున్నామని తెలిపారు. -
చేదెక్కిన చెరకు సాగు
మోర్తాడ్ : అందరికీ తీపిని పంచే చెరకును సాగు చేసే రైతుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గంలో ఫలితంగా చెరకు సాగు అంతరించిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని పల్లెల్లో ఒకప్పుడు చెరకు పంట అత్యధికంగా సాగయ్యేది. పం టపండిన తర్వాత చెరకును నరకడానికి వచ్చే కూలీలు, ఫ్యాక్టరీకి పంటను తరలించడానికి వినియోగించే వాహనాలతో పల్లెలు కళక ళలాడేవి. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో బాల్కొండ నియోజకవర్గం ఉండేది. ఒక్కో గ్రామంలో 50 నుంచి 100 హెక్టార్లలో చెరకును సాగు చేసేవారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో పండించే చెరకును ముత్యంపేట్ ఫ్యాక్టరీకి తరలించేవారు. చెరకుకు గిట్టుబాటు ధరను కల్పించకపోవడం, క్రషింగ్‌కు తరలించిన పంటకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో రైతులకు ఇబ్బంది కర పరిస్థితులు ఎదురయ్యాయి. చెరకు సాగుకు ప్రోత్సాహం కరువు కావడంతో రైతులు ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించారు. చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం మొదలు కాగా చివరకు పూర్తి గా పంట అంతరించిపోయింది. ఇప్పటి తరం వారికి చెరకు గడల రుచి తెలియదంటే అతిశయోక్తి కాదు. చెరకు పంట సాగు చేయడం వల్ల కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు, చెరకు రుచులు ప్రజలకు అందేవి. చెరకును పంచదార తయారీ కోసమే కాకుండా చెరకు ఆకులు, గడలను శుభ కార్యాలకు ఇండ్లలో వినియోగించేవారు. ఆరేళ్లు చెరకు పంట అంతరించిపోయినా పంటను సాగు చేయించడంపై ముత్యంపేట ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టిని సారించలేదు. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో కొనసాగిన చెరకు కార్యాలయాలనూ ఎత్తివేశారు. -
‘నిజాం షుగర్స్’ను సర్కార్ స్వాధీనం చేసుకోవాలి
బోధన్ టౌన్ : బోధన్‌లోని నిజాం దక్కన్ షుగర్‌ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని చెప్పిన కేసీఆర్, ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో సోమవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే దళితున్ని ముఖ్య మంత్రి చేస్తానని వెయ్యిసార్లు చెప్పి దళితులను మోసంచేశారని విమర్శించారు. ఉద్య మ సమయంలో, ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు బోధన్ వచ్చిన కేసీఆర్, కవిత, కేటీఆర్ ఫ్యాక్టరీని ప్రభుత్వంలోకి రాగానే స్వాధీనం చేసుకుంటామని హామీలు ఇచ్చారని, దళితులను మోసం చేసినట్లు ఫ్యాక్టరీ పై ఆధారపడి ఉన్న కార్మికుల, నిరుద్యోగుల కుటంబాలను మో సం చేయవద్దని కోరారు. ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకునే దిశగా ఉద్యమిస్తామని, త్వరలో ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఒకే రోజు సర్వే నిర్వహించానని గొప్ప లు చెప్పుకునే కేసీఆర్ ఒకే రోజు దళితులకు భూపంపిణీ ఎందుకు చేయలేదన్నారు. ప్రభుత్వ, మిగులు భూములను పరిశ్రమలకు ఇస్తే సహించేది లేదన్నారు. ఎన్నికలకు ముందు నక్సల్స్ ఎజెండాలను అమలు చేస్తామని చెప్పిన సీఎం, వారి ఎజెండాను ఎందుకు వారితో చర్చిం చరన్నారు. వారిపై నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు మానికొల్ల గంగాధర్, జిల్లా ఇన్చార్జి సామ్యెల్, జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, వీహెచ్‌పీ రాష్ట్ర మహిళా వి భాగం అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ పాల్గొన్నారు. -
కార్మికులకు పర్మినెంట్ హామీ అమలయ్యేనా ?
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : విడతల వారీగా కార్మికులను పర్మినెంట్ చేస్తామనే హామీని నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కర్మాగారం ప్రభుత్వ పరం నుంచి 2002లో ప్రైైవే ట్ పరమైంది. కర్మాగారంలో సీజనల్ కార్మికులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 102 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ, మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల వారు ఉద్యమించారు. వారి పోరాటానికి దిగివచ్చిన యాజమాన్యం, ఏడాదికి 25 మంది కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఏటా క్రషింగ్ సీజన్ అనంతరం 25 మంది కార్మికుల చొప్పున పర్మినెంట్ చేస్తామని 30 డిసెంబర్ 2011న హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలులో మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వ హిస్తోంది. పర్మినెంటు ఆర్డర్లు ఏవీ.. 2012లో చెరకు క్రషింగ్ అనంతరం 25 మంది కార్మికులను సీజనల్ నుంచి పర్మినెంట్ చేస్తున్నట్లుగా యాజమాన్యం కాపీని జారీచేసి వారిని వివిధ భాగాల్లో విధులు నిర్వహించుకుంటోంది. దీంతో పాటు 2013లో చెరుకు క్రషింగ్ ముగిసిన ఆరు నెలలకు మరో 25 మంది సీజనల్ కార్మికులను ఒప్పందం ప్రకారం పర్మినెంట్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. యాజమాన్యం కార్మికులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేసిందే తప్ప, వారికి ఇప్పటివరకు వ్యక్తిగతంగా పర్మినెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. అంతేకాకుండా వారి విభాగంలో కాకుండా ఇతర పనులను పురమాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. 50 మంది పర్మినెంట్ అయిన కార్మికుల్లో తనకు ఇవ్వాల్సిన విభాగంలో కాకుండా మరో విభాగంలో పర్మినెంట్ చేస్తున్నారని ఓ కార్మికుడు ఒప్పుకోలేదు. మరో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ నలుగురితో పాటు మరో 50 మంది కార్మికులు పర్మినెంట్ అవుతామనే ఆశల్లో తేలియాడుతున్నారు. 2014 చెరుకు క్రషింగ్‌కు మందు కార్మికులు ఒప్పందం ప్రకారం 25 మందిని పర్మినెంట్ చేయాలని యాజమాన్యాన్ని కొరగా, సీజన్ ముగిసిన అనంతరం చూద్దామని దాటవేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఫ్యాక్టరీ ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేసింది. దీంతో తమకు రావాల్సిన పెట్టుబడి మొత్తం ఇవ్వాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ వస్తే ఫ్యాక్టరీ ప్రభుత్వపరం అవుతుందని అలోచనలో పడ్డ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, మరో 25 మంది కార్మికులను పర్మినెంట్ చేయడానికి దాటవేత దోరణిని అవలంభిస్తోంది. దీంతో కార్మికులు ఉద్యమాల బాట పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏటా 25 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే తాము ఎప్పటికి కాలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాజవల్ కార్మికుల పరిస్థితి... ? ఎన్డీఎస్ఎల్ చక్కెర కర్మాగారంలో సుమారు 200 మంది కార్మికులు క్యాజవల్ లేబర్స్‌గా పనిచేస్తున్నారు. వీరిలో నుంచి సైతం ఏటా 25 మందిని ఎఫ్‌టీసీ కార్మికులుగా యాజమాన్యం గుర్తించాల్సి ఉంది. హక్కుల కాలరాస్తూ యాజమాన్యం కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కుతోంది.