కార్మికులకు పర్మినెంట్ హామీ అమలయ్యేనా ? | to assurance Implementation of workers permanent ? | Sakshi
Sakshi News home page

కార్మికులకు పర్మినెంట్ హామీ అమలయ్యేనా ?

Published Mon, May 5 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

to assurance Implementation of workers permanent  ?

బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : విడతల వారీగా కార్మికులను పర్మినెంట్ చేస్తామనే హామీని నిజాం దక్కన్ చక్కెర కర్మాగారం (ఎన్‌డీఎస్‌ఎల్) యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కర్మాగారం ప్రభుత్వ పరం నుంచి 2002లో ప్రైైవే ట్ పరమైంది. కర్మాగారంలో సీజనల్ కార్మికులుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 102 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ, మజ్దూర్ యూనియన్‌తో పాటు పలు కార్మిక సంఘాల వారు ఉద్యమించారు. వారి పోరాటానికి దిగివచ్చిన యాజమాన్యం, ఏడాదికి 25 మంది కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. ఏటా క్రషింగ్ సీజన్ అనంతరం 25 మంది కార్మికుల చొప్పున పర్మినెంట్ చేస్తామని 30 డిసెంబర్ 2011న హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలులో మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వ హిస్తోంది.

 పర్మినెంటు ఆర్డర్లు ఏవీ..
 2012లో చెరకు క్రషింగ్ అనంతరం 25 మంది కార్మికులను సీజనల్ నుంచి పర్మినెంట్ చేస్తున్నట్లుగా యాజమాన్యం కాపీని జారీచేసి వారిని వివిధ భాగాల్లో విధులు నిర్వహించుకుంటోంది. దీంతో పాటు 2013లో చెరుకు క్రషింగ్ ముగిసిన ఆరు నెలలకు మరో 25 మంది సీజనల్ కార్మికులను ఒప్పందం ప్రకారం పర్మినెంట్  చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. యాజమాన్యం కార్మికులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 50 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేసిందే తప్ప, వారికి ఇప్పటివరకు వ్యక్తిగతంగా పర్మినెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. అంతేకాకుండా వారి విభాగంలో కాకుండా ఇతర పనులను పురమాయిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

50 మంది పర్మినెంట్ అయిన కార్మికుల్లో తనకు ఇవ్వాల్సిన విభాగంలో కాకుండా మరో విభాగంలో పర్మినెంట్ చేస్తున్నారని ఓ కార్మికుడు ఒప్పుకోలేదు. మరో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ నలుగురితో పాటు మరో 50 మంది కార్మికులు పర్మినెంట్ అవుతామనే ఆశల్లో తేలియాడుతున్నారు. 2014 చెరుకు క్రషింగ్‌కు మందు కార్మికులు ఒప్పందం ప్రకారం 25 మందిని పర్మినెంట్ చేయాలని యాజమాన్యాన్ని కొరగా, సీజన్ ముగిసిన అనంతరం చూద్దామని దాటవేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ఫ్యాక్టరీ ప్రైవేట్ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానం చేసింది.

దీంతో తమకు రావాల్సిన పెట్టుబడి మొత్తం ఇవ్వాలని యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ వస్తే ఫ్యాక్టరీ ప్రభుత్వపరం అవుతుందని అలోచనలో పడ్డ ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం, మరో 25 మంది కార్మికులను పర్మినెంట్ చేయడానికి దాటవేత దోరణిని అవలంభిస్తోంది. దీంతో కార్మికులు ఉద్యమాల బాట పట్టాల్సిన పరిస్థితి దాపురించింది. కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏటా 25 మంది సీజనల్ కార్మికులను పర్మినెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు పర్మినెంట్ చేయకపోతే తాము ఎప్పటికి కాలేమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 క్యాజవల్ కార్మికుల పరిస్థితి... ?
 ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర కర్మాగారంలో సుమారు 200 మంది కార్మికులు క్యాజవల్ లేబర్స్‌గా పనిచేస్తున్నారు. వీరిలో నుంచి సైతం ఏటా 25 మందిని ఎఫ్‌టీసీ కార్మికులుగా యాజమాన్యం గుర్తించాల్సి ఉంది. హక్కుల కాలరాస్తూ యాజమాన్యం కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement