మోర్తాడ్ : అందరికీ తీపిని పంచే చెరకును సాగు చేసే రైతుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గంలో ఫలితంగా చెరకు సాగు అంతరించిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని పల్లెల్లో ఒకప్పుడు చెరకు పంట అత్యధికంగా సాగయ్యేది. పం టపండిన తర్వాత చెరకును నరకడానికి వచ్చే కూలీలు, ఫ్యాక్టరీకి పంటను తరలించడానికి వినియోగించే వాహనాలతో పల్లెలు కళక ళలాడేవి.
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో బాల్కొండ నియోజకవర్గం ఉండేది. ఒక్కో గ్రామంలో 50 నుంచి 100 హెక్టార్‌లలో చెరకును సాగు చేసేవారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో పండించే చెరకును ముత్యంపేట్ ఫ్యాక్టరీకి తరలించేవారు.
చెరకుకు గిట్టుబాటు ధరను కల్పించకపోవడం, క్రషింగ్‌కు తరలించిన పంటకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో రైతులకు ఇబ్బంది కర పరిస్థితులు ఎదురయ్యాయి. చెరకు సాగుకు ప్రోత్సాహం కరువు కావడంతో రైతులు ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించారు. చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం మొదలు కాగా చివరకు పూర్తి గా పంట అంతరించిపోయింది. ఇప్పటి తరం వారికి చెరకు గడల రుచి తెలియదంటే అతిశయోక్తి కాదు.
చెరకు పంట సాగు చేయడం వల్ల కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు, చెరకు రుచులు ప్రజలకు అందేవి. చెరకును పంచదార తయారీ కోసమే కాకుండా చెరకు ఆకులు, గడలను శుభ కార్యాలకు ఇండ్లలో వినియోగించేవారు. ఆరేళ్లు చెరకు పంట అంతరించిపోయినా పంటను సాగు చేయించడంపై ముత్యంపేట ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టిని సారించలేదు. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో కొనసాగిన చెరకు కార్యాలయాలనూ ఎత్తివేశారు.
చేదెక్కిన చెరకు సాగు
Published Thu, Nov 13 2014 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement