ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం అభినందనీయం | appriciate To the promotion of world peace | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం అభినందనీయం

Published Wed, Aug 24 2016 7:03 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం అభినందనీయం - Sakshi

ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం అభినందనీయం

నల్లగొండ టౌన్‌ : ప్రపంచశాంతి కోసం 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేయడం అభినందనీయమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో గల సెంటనరీ సెల్ప్‌ సపోర్టింగ్‌ తెలుగు బాప్టిస్టు చర్చి 125 సంవత్సరాల చరిత్రపై దివంగత తలకొప్పుల సామ్యూల్, మార్తామ్మల జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాన్ని బుధవారం నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తుంగతుర్తి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఘోరీ గోమ్స్, మైనార్టీ కార్పొరేషన్‌ ఈడీ ఎండీ.సలీం, డాక్టర్‌ కె.మోజస్, టీఎస్‌ కిష్టఫర్, యేసురాజు, అబ్సోలం, డి.కృపానందం, ఆనంద్, ప్రసాద్, మాణిక్యం, చిత్తరంజన్‌దాస్, టీఎస్‌ విలియమ్స్, కొంపల్లి మత్య్సగిరి, ఆశయ్య, టి.ఎలిసా, జీవన్, సర్వోదయమణి, పద్మ, కమలమ్మ, ఫ్రాన్సిస్, డేవిడ్‌రాజు, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement