భారత్‌ కూడా భాగస్వామే | Modi, Moon Jae-in hold bilateral talks | Sakshi
Sakshi News home page

భారత్‌ కూడా భాగస్వామే

Published Wed, Jul 11 2018 1:58 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM

Modi, Moon Jae-in hold bilateral talks - Sakshi

రాష్ట్రపతి సమక్షంలో మూన్‌తో మోదీ కరచాలనం

న్యూఢిల్లీ: కొరియా ద్వీపకల్పంలో శాంతి కోసం జరిగిన ప్రయత్నాల్లో భారత్‌ కూడా ఓ భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, భద్రత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ప్రాంతీయ శాంతి తదితర అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) నవీకరణ ప్రక్రియపై సంప్రదింపులను ప్రారంభించాలని ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. అనంతరం మూన్, మోదీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం సందర్భంగా ఉ.కొరియాతో పాక్‌కు గల అణు వ్యాప్తి లింకేజీల గురించి మూన్‌ వద్ద మోదీ  ప్రస్తావించారు. ద్వైపాక్షిక సహకారం, సముద్ర వివాదాలకు సంబంధించి ఓ విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంచాలని, సైనిక మార్పిడి, శిక్షణ, అనుభవ భాగస్వామ్యాన్ని∙పెంపొం దించుకోవాలని చెప్పారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత సభ్యత్వానికి ద.కొరియా మద్దతు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement