Moon Jae In
-
ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష
South Korea Park Geun Hye Freed After 5 Years From Prison: అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యున్-హే దాదాపు ఐదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యారు. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017లో పార్క్‌ని అరెస్ట్ చేయడమే కాక 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ గతవారం పార్క్‌కు ప్రత్యేక క్షమాభిక్షను మంజూరు చేశారు. (చదవండి: చేపల వర్షం గురించి విన్నారా!... నిజంగా ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట!) అంతేకాదు గతాన్ని మర్చిపోయి దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి.. కరోనా పరిస్థితులను సమష్టిగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూన్ జే-ఇన్ వెల్లడించారు. పైగా గత ఐదేళ్లుగా కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షురాలు పార్క్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని అందువల్ల తాను దీనిని కూడా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. అయితే పార్క్ విడుదలకు పిలుపునిచ్చేలా పార్క్ మితవాద అనుకూల సమూహాలు వారానికోసారి ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ మేరకు పార్క్కూడా ప్రజల ఆందోళనలకు కారణమైనందుకు క్షమపణలు చెప్పడమేకాక ఈ నిర్ణయం తీసుకున్నందుకు మూన్‌కి ధన్యవాదలు తెలిపారు. పైగా పార్క్ మాజీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అయిన కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీ, మూన్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నందున పార్క్ విడుదలైంది. అంతేకాదు వందలాది మంది పార్క్ మద్దతుదారులు ఆమె విడుదలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రి బయటే గడ్డకట్టే చలిలో ఆమె రాక కోసం పుష్పగుచ్చలతో వేచిఉండటం విశేషం. అయితే ఆమె తదుపరి మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఏదైనా క్రీయాశీల పాత్ర పోషిస్తుందా అనే విషయం పై ఎలాంటి స్పష్టత లేదు. (చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్మెయిల్!) -
కొరియా పునరేకీకరణ దిశగా!
ప్యాంగ్యాంగ్/సియోల్: ఇన్నాళ్లు ఉప్పు, నిప్పుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య స్నేహ బంధం మెల్లిమెల్లిగా బలపడుతోంది. ఇరుదేశాల ప్రజలు రెండు వైపులా ఉన్న తమ వారిని కలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఉభయ కొరియా దేశాల మధ్య 250 కిలోమీటర్ల మేర రెండు కిలోమీటర్ల వెడల్పుతో మిలటరీ రహిత ప్రదేశం (డీమిలటరైజ్డ్ జోన్ – డీఎంజెడ్) ఉంది. ఇందులో దక్షిణ కొరియా వైపు డీఎంఎజ్కు 650 మీటర్ల దూరంలో డోరాసాన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇదే అటువైపు చివరి స్టేషన్. కొంతకాలంగా ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇరుదేశాల జాతీయపతాకాలను పోలిన రిబ్బన్లను కడుతూ సరిహద్దులు చెరిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. దక్షిణ కొరియా రైల్వే సంస్థ ‘కోరైల్’ ఇక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ‘ప్యాంగ్యాంగ్ 250 కి.మీ.లు, సియోల్ 56 కి.మీ.లు. దక్షిణంలో ఇదే చివరి స్టేషన్ కాదు. ఉత్తరాన్ని చేరుకునే తొలి స్టేషన్’ అని ఇరుదేశాలను కలిపేలా అర్థమొచ్చే సందేశాన్ని అందిస్తోంది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్, ఉత్తరకొరియా నేత కిమ్ మధ్య మూడ్రోజులుగా జరుగుతున్న భేటీ గురువారం ముగిసింది. -
మీడియా సమక్షంలోనే అధికారికి కిమ్ మరణశిక్ష?
సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వీడియో ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తే చాలు నెటిజన్లు షేర్లు, కామెంట్లు లైకులతో హోరెత్తిస్తుంటారు. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయాల గురించి ఆలోచించకుండానే తమకు తోచిన కామెంట్లు పెట్టి మరీ షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని చారిత్రక ఘట్టాలు కూడా మార్ఫింగ్‌కు గురై వైరల్ అవుతుంటాయి. ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన హయాంలో అవినీతి అధికారికి మీడియా సమక్షంలోనే మరణశిక్ష ఎలా విధించారో చూడండి.. అంటూ ఓ వీడియో ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేవలం 12 సెకన్ల వీడియోలో కిమ్ మరో వ్యక్తికి కరచాలనం చేసి నవ్వుతూ పలకరిస్తారు. అనంతరం నడుస్తు ఓ ప్రదేశానికి వెళ్లగానే అక్కడ ఇదివరకే ఏర్పాటు చేసిన ఓ పెద్ద గుంతలో సదరు వ్యక్తి పడిపోయి, వెంటనే డోర్లు మూసుకుంటాయి. తర్వాత సింపుల్‌గా కిమ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అంతేనా ఇదంతా మీడియా సమక్షంలోనే జరగడంతో రిపోర్టర్లు కూడా వామ్మో అంటూ ఓ లుక్కిస్తారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి. వామ్మో అవినీతికి మరీ ఇంత పెద్ద శిక్ష వేశాడా కిమ్ అంటూ ఆయన గురించి తెలిసివాళ్లు ముక్కున వేలేసుకుంటుంటే, మరికొందరేమో అవినీతికి సరైన శిక్ష అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఫన్ మూమెంట్స్ అనే ఓ సెటైరికల్ యూట్యూబ్ చానెల్ వాళ్లు ఈ వీడియోను తయారు చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో వీడియోలో కనిపించిన వ్యక్తి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్జే ఇన్. అతనేమీ ఉత్తర కొరియాకు చెందిన అవినీతి అధికారి కాదు. గత ఏప్రిల్‌లో ఇంటర్ కొరియన్ సమ్మిట్‌లో భాగంగా ఈ ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య చోటుచేసుకున్న ఓ అరుదైన చారిత్రక ఘట్టాన్నే ఫన్ మూమెంట్స్ యూట్యూబ్ చానెల్ తన క్రియేటివిటీని జోడించి పై వీడియోను తయారు చేసింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సైనిక సరిహద్దుల్లో అధినేతలు కరచాలనం చేసుకుని ఒకరి భూభాగంలోకి మరొకరు అడుగుపెట్టారు. ఇది ఉభయ కొరియా దేశాల మధ్య సానుకూల వాతావరణానికి సంకేతంగా నిలిచింది. తమ తమ ప్రతినిధి బృందంతో కలిసి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్జే ఇన్ గంటన్నరపాటు సమావేశమయ్యారు. అణునిరాయుధీకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని, కొరియా భూభాగంలో చిరకాల శాంతిని నెలకొల్పేందుకు తాము కలిసి పనిచేస్తామని వారిరువురు ప్రకటించారు. 1953లో జరిగిన కొరియా యుద్ధానంతరం 65 ఏళ్లలో కొరియా దేశాల మధ్య చర్చలు జరుగడం ఇది మూడోసారి కాగా, ఉత్తర కొరియా అధినేత దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం అదే ప్రథమం. ఇరుదేశాలను వేరుచేసే సైనిక విభజనరేఖ వద్ద ఉన్న పన్ముంజోమ్ వారి కలయికకు వేదికైంది. ఇరుదేశాల మధ్య ఉన్న చిన్న దారికి అటువైపు నిలబడిన కిమ్‌ను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు మూన్ ముందుకువెళ్లారు. అయితే ముందుగా మా దేశంలోకి వెళ్దామంటూ కిమ్ ఆయనను తోడ్కోని తమ భూభాగంలోకి తీసుకెళ్లారు. ఇరువురు నేతలు ఒకరిచేతులు మరొకరు పట్టుకుని కొంతదూరం నడిచారు. తర్వాత దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. చిరునవ్వు చిందిస్తూ మూన్తో కరచాలనం చేసిన కిమ్.. ఇది భావోద్వేగ కలయిక అని పేర్కొంటే, మూన్ కూడా చిద్విలాసంగా కరచాలనం చేస్తూ.. ఇలా కలువడం సంతోషంగా ఉందని అన్నారు. అప్పటి వీడియోను మీరు ఓ లుక్కేయండి.. -
దక్షిణ కొరియా అధ్యక్షుడిని కలిసిన కిమ్ జోంగ్ ఉన్
-
మీడియా సమక్షంలోనే అధికారికి కిమ్ మరణశిక్ష?
-
భారత్ కూడా భాగస్వామే
న్యూఢిల్లీ: కొరియా ద్వీపకల్పంలో శాంతి కోసం జరిగిన ప్రయత్నాల్లో భారత్ కూడా ఓ భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, భద్రత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ప్రాంతీయ శాంతి తదితర అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) నవీకరణ ప్రక్రియపై సంప్రదింపులను ప్రారంభించాలని ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. అనంతరం మూన్, మోదీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం సందర్భంగా ఉ.కొరియాతో పాక్‌కు గల అణు వ్యాప్తి లింకేజీల గురించి మూన్ వద్ద మోదీ ప్రస్తావించారు. ద్వైపాక్షిక సహకారం, సముద్ర వివాదాలకు సంబంధించి ఓ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంచాలని, సైనిక మార్పిడి, శిక్షణ, అనుభవ భాగస్వామ్యాన్ని∙పెంపొం దించుకోవాలని చెప్పారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత సభ్యత్వానికి ద.కొరియా మద్దతు తెలిపింది. -
అతిపెద్ద శాంసంగ్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన మోదీ
నోయిడా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేతో కలిసి శాంసంగ్ నూతన మొబైల్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం ఇరు దేశాల అధ్యక్షులు మెట్రో రైలులో ఢిల్లీ నుంచి నోయిడా చేరుకున్నారు. దీని కంటే ముందు మహాత్మాగాంధీ స్మృతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కచేరిలో మహాత్మనికి ఇష్టమైన భజనలను విన్నారు. ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా మోదీ ‘ఒక్క కొరియన్ ఉత్పత్తి అయినా లేని మధ్యతరగతి కుటుంబాలు మన దేశంలో చాలా అరుదు. అంతగా ఈ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాయి. ప్రస్తుతం మన ప్రభుత్వం గవర్నమెంట్ ఈ-మార్కెట్(జీఈఎమ్) విధానాన్ని అవలంభిస్తుంది. దీని ద్వారా ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అందువల్ల వల్ల చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు లాభం కలగడమే కాక పారదర్శకత కూడా పెరుగుతుందని’ అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా హాజరయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కీలక అంశాలను చర్చించనున్నట్లు సమాచారం. ఈ పర్యటన గురించి మూన్ జే.. ‘భారత ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని భావిస్తుంది. ఆ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు మేము ఉత్సాహాంగా ఉన్నాం’ అని తెలిపారు. భారత్‌ను ఓ స్నేహదేశంగా గుర్తిస్తామని, తమకు అవసరమైనప్పుడల్లా భారత్ సాయం చేసిందన్నారు. తమ దేశం సదరన్ పాలసీని చేపట్టిందని, దానిలో భాగంగా భారత్‌తో మరింత బలమైన బంధాన్ని ఏర్పర్చుకోవాలని భావిస్తున్నట్లు మూన్ జే తెలిపారు. శాంసంగ్ ప్లాంట్... దక్షిణ కొరియా బేస్డ్ స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోకెల్ల అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్‌ను నోయిడాలో ఏర్పాటు చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో మొబైల్ ఫోన్స్ మాత్రమే కాక టీవీ, రిఫ్రిజిరేటర్ వంటి ఎలాక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు... 35 ఎకరాల విస్తీరణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 81లో ఏర్పాటు చేశారు. అయితే నోయిడా ప్లాంట్‌కు 1996లోనే శంకుస్థాపన చేశారు. 1997 నుంచి తొలిసారి ఇక్కడ టెలివిజన్లను తయారుచేయడం ప్రారంభించారు. 2003 నాటికి రిఫ్రిజిరేటర్లను కూడా తయారు చేయడం ప్రారంభించారు. 2007 నుంచి ఇక్కడ మొబైల్ ఫోన్లను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం శాంసంగ్ మొబైల్, ఎలాక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తిని రెండు రెట్లు పెంచడం కోసం ఈ నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను సార్క్ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో శాంసంగ్ తయారీ యూనిట్లు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి నోయిడాలో ఉండగా మరొకటి తమిళనాడులోని శ్రీపెరంబ్దూర్లో ఉంది. ఇవే కాక 5 ఆర్ అండ్ డీ సెంటర్లతో పాటు నోయిడాలో ఒక డిజైన్ సెంటర్ కూడా ఉంది. వీటిన్నింటి ద్వారా దాదాపు 70 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవేకాక శాంసంగ్ ఔట్లెట్ల ద్వారా మరో 1.50లక్షల మందికి కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. -
నేను కాదు.. ట్రంప్ అర్హుడు
సియోల్/వాషింగ్టన్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను శాంతి చర్చలకు ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ శాంతి బహుమతి అక్కర్లేదనీ, శాంతి చాలని వ్యాఖ్యానించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొల్పే దిశగా ఉభయకొరియాల అధ్యక్షులు కిమ్, మూన్‌ల మధ్య శుక్రవారం చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ద.కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జుంగ్ భార్య మూన్‌కు అభినందనలు తెలుపుతూ లేఖరాశారు. ఇరుదేశాల మధ్య శాంతిస్థాపనకు చేసిన కృషికి ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించే నోబెల్ బహుమతిని మూన్ అందుకునే అవకాశముందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో నోబెల్ శాంతి బహుమతికి తనకన్నా ట్రంపే అర్హుడని మూన్ సమాధానమిచ్చారు. టైమ్ జోన్ మార్చుకోనున్న ఉ.కొరియా ద.కొరియాకు సమానంగా తమ టైమ్‌జోన్‌ను 30 నిమిషాలు ముందుకు జరపనున్నట్లు ఉ.కొరియా అధికారిక వార్తాసంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఉభయకొరియాల మధ్య ఇటీవల స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2015లో ఉ.కొరియా తమ టైమ్‌జోన్‌ను అరగంట వెనక్కు జరిపింది. -
శత్రు దేశ అధ్యక్షుడితో కిమ్ కరచాలనం
-
కిమ్ చరిత్రాత్మక కరచాలనం
పాన్మున్జోమ్ : ముఖంపై చిరునవ్వుతో కరచాలనం చేస్తూ శత్రు దేశాధినేతను ఆత్మీయంగా పలకరించారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. శుక్రవారం ఇరుదేశాల మధ్య గల శాంతి గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ను కలుసుకున్నారు. అంతకుముందు ఇరు దేశాల సరిహద్దుల్లో నేతలు నిల్చున్నారు. మూన్‌ను ఉత్తరకొరియాలోకి రావాలంటూ కిమ్ ఆహ్వానించారు. అనంతరం మూన్తో కలసి కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. 1953-54ల మధ్య కొరియా యుద్ధం అనంతరం ఓ ఉత్తరకొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. పాన్‌మున్‌జోమ్‌లో కలయికకు గుర్తుగా ఇరువురు దేశాధ్యక్షులు ఓ మొక్కను కూడా నాటనున్నారు. 1953-54ల మధ్య యుద్ధం శాంతియుత ఒప్పందంతో ముగియలేదు. అందుకే ప్రత్యక్ష యుద్ధం జరగకపోయినా ఇరుదేశాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. పాన్మున్జోమ్ సమావేశంలో ఈ సమస్యపై కిమ్, మూన్‌లు చర్చిస్తారని భావిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం ఉత్తర కొరియా అణు పరీక్షల వేదికను మూసివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి కొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్‌తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. -
సరైన పరిస్థితులు కల్పిస్తేనే చర్చలు
సియోల్ : తగిన పరిస్థితులు కల్పిస్తేనే ఉతర్త కొరియాతో చర్చలకు సిద్ధమని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జా ఇన్ తెలిపా రు. అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చల కు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. అక్కడ జరుగుతు న్న వింటర్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల కు హాజరయ్యేందుకు ఉత్తర కొరియా జనరల్ కిమ్ యాంగ్ చోల్ ఆధ్వర్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఉదయం సియోల్‌కు చేరుకుంది. -
మా దేశానికి రండి.. మూన్‌కు కిమ్ ఆహ్వానం
గ్యాంగ్నెయుంగ్: దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ను తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో జరగబోయే సదస్సుకు హాజరు కావాలని మూన్‌ను కోరారు. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో కలసి కిమ్ సోదరి యో జోంగ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిమ్ పంపిన ఆహ్వాన లేఖను మూన్‌కు అందించారు. సదస్సుకు వెళ్తారా లేదా అనే దానిపై మూన్ స్పందించలేదు. అయితే గతేడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కిమ్‌లు వ్యక్తిగత దూషణలకు సైతం దిగడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు మిత్రదేశమైన దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉ.కొరియాకు వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వెళితే మూన్ ట్రంప్ ఆగ్రహానికి గురికావాల్సి రావొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది దుర్మరణం
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో దాదాపు 41 మంది మృతిచెందగా, దాదాపు 80 మంది గాయపడ్డట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాంగ్ నగరంలోని సెజాంగ్ ఆస్పత్రిలో నేటి ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండో అంతస్తులో ఎవర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు అనంతరం భవనం మొత్తం వ్యాపించాయి. దీంతో పేషెంట్లు, వారి బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది. ప్రమాద సమయంలో సుమారు 200 మంది హాస్పిటల్లో ఉన్నారు. 41 మందిని మంటలు పొట్టన పెట్టుకున్నాయని, మరో 80 మందికి కాలిన గాయాలయ్యాయి. ఇందులో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఇతర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో శీతాకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణ కొరియాలో కొన్ని రోజుల ముందు భారీ అగ్ని ప్రమాదం సంభవించడం ఇతర దేశాల క్రీడాకారులను, అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషాద ఘటనపై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంబంధితశాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసిన అధ్యక్షుడు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో పాటు ఘటనపై విచారణకు ఆదేశించారు. గతేడాది డిసెంబర్లో జెచియాన్ నగరంలోని ఫిట్నెస్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 29 మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. -
కిమ్ దేశ సరిహద్దులో బాంబుల వర్షం!
-
కిమ్ దేశ సరిహద్దులో బాంబుల వర్షం!
సాక్షి, సియోల్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మంగళవారం చేసిన క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను ఆందోళనల్లోకి నెట్టేసింది. జపాన్ ద్వీపమైన హోక్కాయ్ మీదుగా ప్రయాణించిన క్షిపణి పసిఫిక్ సముద్ర జలాల్లో మూడు భాగాలుగా విడిపోయి పడింది. అయితే, ఈ క్షిపణి ప్రయోగం గురించి దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్‌కు ముందే సమాచారం ఉంది. దీంతో ఆ దేశం ముందు జాగ్రత్త చర్యగా.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సరిహద్దులో బాంబుల వర్షం కురిపించింది. సరిహద్దులో బాంబుల వర్షం మరోవైపు ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న సరిహద్దులో బాంబుల వర్షం కురిపించి తమ శక్తి సామర్ధ్యాలను కిమ్ కి తెలియచేయాలని దక్షిణ కొరియా భావించింది. సరిహద్దులో ఎనిమిది బాంబులను వేసే ప్రక్రియకు అధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆదేశాల మేరకే జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎఫ్15 కే ఫైటర్ జెట్ల ద్వారా ఎనిమిది మార్క్ 84 బాంబులను సరిహద్దులో వేస్తామని దక్షిణి కొరియా తెలిపింది. వణికిపోయిన జపాన్ మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా చేసిన ప్రయోగానికి జపాన్ వణికిపోయింది. దేశం మీదకు క్షిపణి వస్తోందని ప్రజలంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. -
'ఎప్పుడైనా ఎక్కడైనా కిమ్‌ను నేను కలుస్తా'
హాంబర్గ్: ఉత్తర కొరియా విషయంలో ఎవరూ సహనం కోల్పోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించారు. ఏమాత్రం తొందరపడినా పరిస్థితి చేజారుతుందని ఆయన చెప్పారు. హాంబర్గ్‌లో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం అనధికారికంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో భేటీ అయిన సందర్భంగా పుతిన్ ఈ హెచ్చరిక చేశారు. హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఉత్తర కొరియాతన అణుకార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రమాదకరంగా మారుతోందని మూన్ జే పుతిన్‌తో అన్నారు. అదే సమయంలో ఇక ఉత్తర కొరియా విషయంలో తాము ఏ మాత్రం సహనంగా ఉండలేమని, ఓర్పుకు ఇక రోజులు లేవని సైనిక చర్యకైనా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ స్పందించారు. 'ఉత్తర కొరియా అణు సమస్య చాలా తీవ్రమైనది. అయితే, ఈ విషయంలో ఏ ఒక్కరు తమ సహనాన్ని కోల్పోవద్దు. సున్నితమైన ఈ అంశాన్ని కార్యసాధన ద్వారా పరిష్కరించాలి. మరింత చేయిదాటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం నేనే స్వయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడుని కలుసుకుంటాను.. అది ఎప్పుడైనా ఎక్కడైనా' అని పుతిన్ చెప్పారు. తొందరపడితే ఇంతకాలం ఎదురు చూస్తూ కొనసాగించిన శాంతిమార్గం ధ్వంసం అవతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉత్తర కొరియాపై ఇక నాకు ఓపిక లేదు: ట్రంప్
న్యూయార్క్: ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుర్రుమన్నారు. ఆ దేశంపై తమకు ఇక ఓపిక పోయిందని, ఇక ఏ మాత్రం సహనంతో వ్యవహరించబోమని స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉత్తర కొరియా చేస్తున్న అతి మీదే ఎక్కువగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా మూన్తో మాట్లాడిన ట్రంప్ 'ఉత్తర కొరియా విషయంలో ఇప్పటి వరకు మాకున్న వ్యూహాత్మక సహనం విఫలమైంది. ఎన్నో ఏళ్లుగా విఫలమవుతూ వస్తోంది. మొహమాటం లేకుండా చెప్పాలంటే.. ఇక మా సహనం ముగిసింది' అని అన్నారు. అమెరికా పలు హెచ్చరికలు చేస్తున్నా లెక్కలేనితనంతో అణు కార్యక్రమాన్ని ఉత్తర కొరియా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా దక్షిణ కొరియా, అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక అమెరికా అయితే ఉత్తర కొరియాను నేరుగా విమర్శించింది కూడా. ఈ నేపథ్యంలో ఇక చివరిసారి ఉత్తర కొరియాపై ఏం చేద్దాం అనే దిశగా ట్రంప్, మూన్ జే ఇన్ మధ్య శ్వేతసౌదంలో ప్రత్యేక సమావేశం జరిగింది.