'ఎప్పుడైనా ఎక్కడైనా కిమ్‌ను నేను కలుస్తా' | Vladimir Putin Warns Against 'Losing Cool' On North Korea | Sakshi
Sakshi News home page

కోపమొస్తుందన్న ట్రంప్‌.. కూల్‌ అన్న పుతిన్‌

Published Sat, Jul 8 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

'ఎప్పుడైనా ఎక్కడైనా కిమ్‌ను నేను కలుస్తా'

'ఎప్పుడైనా ఎక్కడైనా కిమ్‌ను నేను కలుస్తా'

హాంబర్గ్‌: ఉత్తర కొరియా విషయంలో ఎవరూ సహనం కోల్పోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ హెచ్చరించారు. ఏమాత్రం తొందరపడినా పరిస్థితి చేజారుతుందని ఆయన చెప్పారు. హాంబర్గ్‌లో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం అనధికారికంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌తో భేటీ అయిన సందర్భంగా పుతిన్‌ ఈ హెచ్చరిక చేశారు. హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఉత్తర కొరియాతన అణుకార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రమాదకరంగా మారుతోందని మూన్‌ జే పుతిన్‌తో అన్నారు.

అదే సమయంలో ఇక ఉత్తర కొరియా విషయంలో తాము ఏ మాత్రం సహనంగా ఉండలేమని, ఓర్పుకు ఇక రోజులు లేవని సైనిక చర్యకైనా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్‌ స్పందించారు. 'ఉత్తర కొరియా అణు సమస్య చాలా తీవ్రమైనది. అయితే, ఈ విషయంలో ఏ ఒక్కరు తమ సహనాన్ని కోల్పోవద్దు. సున్నితమైన ఈ అంశాన్ని కార్యసాధన ద్వారా పరిష్కరించాలి. మరింత చేయిదాటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం నేనే స్వయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడుని కలుసుకుంటాను.. అది ఎప్పుడైనా ఎక్కడైనా' అని పుతిన్‌ చెప్పారు. తొందరపడితే ఇంతకాలం ఎదురు చూస్తూ కొనసాగించిన శాంతిమార్గం ధ్వంసం అవతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement