North Korea crisis
-
నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు
North Korea Economic Crisis: ఆకలి రోదనలు.. లక్షల్లో సొంత ప్రజల మరణాలు చూసి కిమ్ జోంగ్ ఉన్ గుండె కరిగిందా?. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించే కర్కోటకుడిగా పేరుబడ్డ నార్త్ కొరియా నియంతాధ్యక్షుడు.. ఓ మెట్టు దిగాడా? క్షిపణుల ప్రయోగం, అణ్వాయుధాల తయారీతో దాయాదులపై విరుచుకుపడే కిమ్.. ఇప్పుడు స్వరం మార్చాడు. ఇక ప్రజల గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందని ఆయన ఇచ్చిన ప్రసంగం.. అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా ఘోరంగా తయారయ్యింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ పతనం ఏ స్థాయిలో ఉన్నా సరే.. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన పార్టీ వార్షిక సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని కిమ్ నోటి నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి.. స్టేజ్ మీద ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారట. ఈ వ్యాఖ్యల్ని అధికారిక మీడియా హౌజ్ Korean Central News Agency ప్రసారం చేసింది. ముందు ప్రజలు.. తర్వాతే మనం! న్యూక్లియర్ వెపన్స్ తయారీ కారణంగా నార్త్ కొరియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటుపై కరువు, భారీ వర్షాలు, వరదలు.. కొరియా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దిగజార్చాయి. వీటికి కరోనా తోడవ్వడం, చైనా నుంచి పూర్తిగా వర్తకం నిలిచిపోవడంతో పరిస్థితి ఘోరమైన సంక్షోభానికి దారితీసింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆకలి చావులు సంభవిస్తుండగా.. ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కంటే ముందు ప్రజల జీవన విధానం మెరుపరిచే ప్రయత్నం ముమ్మరం చేశాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!. పార్టీ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ.. ఇకపై పార్టీ మూకుమ్మడిగా పని చేయాలని పిలుపు ఇచ్చాడు. ‘‘ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోందాం. కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ప్రజల సంక్షేమమే మన తొలి ప్రాధాన్యం. మిగతావి తర్వాత. అయితే మీరు చేసే పనులు ప్రజలకు మేలు చేస్తాయా? లేదంటే వాళ్ల హక్కుల్ని కాలరాస్తాయా? అనేది సమీక్షించుకోవాలి. ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలిగించే పనులు చేస్తే సహించే ప్రసక్తే లేదు’’ అని అధికారులకు హెచ్చరిక జారీ చేశాడాయన. ఆర్భాటాలకు దూరంగా.. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 76వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం రాజధాని ప్యాంగ్ యాంగ్లో జరిగింది. సమావేశానికి ముందు ఆనవాయితీగా వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. ఈసారి ఆర్భాటానికి దూరంగా వేడుకలు విశేషం. సాధారణంగా ఎలాంటి సందర్భంలోనైనా.. మిలిటరీ పరేడ్‌తో తన దర్పాన్ని ప్రపంచానికి ప్రదర్శించుకుంటాడు కిమ్. అలాంటిది సాదాసీదాగా నిర్వహించడం బహుశా ఇదే ప్రప్రథమం. అమెరికా తిట్టిన తర్వాత.. ఇక ఉత్తర కొరియాలో ఇంత దారుణమైన సంక్షోభానికి కిమ్ నియంతృత్వ పాలనే కారణమని అమెరికా తిట్టిపోసింది. ఈ మేరకు గురువారం అమెరికా విదేశాంగ శాఖ.. కిమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలను అక్కడి(నార్త్ కొరియా) ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రజల కోసం వెచ్చించాల్సిన నిధుల్ని.. మారణాయుధాల తయారీకి మళ్లిస్తున్నారంటూ వైట్‌హౌజ్ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆరోపించారు. ఒకవేళ అవసరం సాయం కోరితే నార్త్ కొరియాను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలోనూ ఆసక్తికర చర్చకు దారి తీశాయి. చదవండి: కిమ్ ఇంట అధికార కుంపటి.. సోదరితో వైరం! -
వామ్మో.. కిలో అరటిపండ్లు రూ.3400
పోంగ్యాంగ్: నేను మోనార్క్‌ని ఎవరి మాట వినే ప్రసక్తే లేదంటూ ప్రవర్తించే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశం కోసం అని కాకుండా తన కోసం అన్నట్లుగా అతని పరిపాలన చేస్తుంటాడు. ప్రపంచీకరణ తర్వాత ప్రతీ దేశం మరొక దేశం పై ఆధారపడడం సర్వ సాధారణంగా మారింది. కానీ కిమ్ మాత్రం తన చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లు ప్రవర్తిస్తూ ఇతరు దేశాలను పక్కన పెడుతుంటాడు. ఇప్పుడు ఈ తీరు కారణంగానే ఉత్తర కొరియా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కోంటోంది. గత కొంత కాలంగా కరోనా ఆంక్షలు అమలు చేస్తుండడంతో ఆ దేశంలోని ఆహార నిల్వలు అడుగంటి పోయాయి. ఆహార పదార్థాలు సరిపడక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ కిలో అరటి పండ్లు 45 డాలర్లు పలుకుతోంది. అనగా మన భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ.3400. కాగా ఇది వరకు ఆహారం , చమురు, ఎరువులు, వంటివి వాటి కోసం చైనా పైనే ఎక్కువగా ఉత్తర కొరియా ఆధారపడుతుంది. చైనాతో సరిహద్దులు మూసేయడంతో ఆ దేశం నుంచి దిగుమతి తగ్గిపోయింది. దీంతో ఆహార కొరత ఏర్పడి అక్కడి ప్రజలు దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరో పక్క నిషేధిత అణు పరీక్షల జరుపుతున్న కారణంగా ఉత్తర కొరియా ఇప్పటికే పలు రకాల అంతర్జాతీయ ఆంక్షలను కూడా ఎదుర్కొంటోంది. చదవండి: ఆఫ్రికాలో దొరకిన ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం -
ఆకలి రోదనలు.. లక్షల్లో మరణాలు?
ఉత్తర కొరియాలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మునుపెన్నడూ లేనంత ఆహార సంక్షోభాన్ని ఆ దేశం చవిచూస్తోంది. కరోనాతో కిందటి ఏడాది తుపాన్లు, వరదలు దేశ ఆర్థిక వ్యవస్థను ఘోరంగా దెబ్బతీయగా.. కరోనా కొనసాగింపుతో ఈ యేడు మరింత దుస్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఆకలి కేకలతో ఒకవైపు జనాలు అల్లలాడుతుంటే.. మరోవైపు లక్షల్లో మరణాలు నమోదు అయ్యినట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కొందరు వార్తలు ప్రచురిస్తున్నారు. కారణాలు.. గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో తగ్గిన ఉత్పత్తి. భారీ వర్షాలు, తుపాన్లు, వరదలతో ఆహార ఉత్పత్తికి నష్టం వాటిల్లడం. ఇక ముఖ్యమైన కారణం.. ఎగుమతి-దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడం. ఉత్తర కొరియా ప్రధానంగా రష్యా, చైనా నుంచి ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా చైనా నుంచి 81 శాతం ఉత్పత్తులు వస్తుంటాయి. అలాంటిది కరోనా విజృంభణ మొదలుకాగానే.. ఉత్తర కొరియా కఠినంగా లాక్డౌన్ అమలు చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్ని మూసేసి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. అయితే ఆకలి కేకల్ని, మరణాల్ని మాత్రం ఆపలేకపోయిందని జీరో ఇషిమారు అనే జర్నలిస్ట్ కథనం ప్రచురించాడు. లక్షల మరణాలు! ఉత్తర కొరియాలో ఏం జరిగినా బయటి ప్రపంచానికి తెలియకుండా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ జాగ్రత్తపడుతుంటాడు. అయితే చైనా సరిహద్దులో సరుకులు అక్రమ రవాణా చేస్తూ బతికేవాళ్లకు అడ్డుకట్ట పడడంతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఈ మేరకు కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టుల విభాగం నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్‌తో నార్త్ కొరియా ప్రజల దీనస్థితి వెలుగు చూసింది. ‘‘సరిహద్దులో ఎంతోమంది అడుక్కుంటున్నారు. కనీస అవసరాలు కూడా లేకుండా బతుకుతున్నారు. వాళ్లలో చాలామంది ఆకలితో చనిపోయిన వాళ్లను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఖ్య వందల నుంచి వేలలో ఉంది. ఇక దేశం లోపల ఆ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని కొందరు యువకులు నాతో చెప్పారు”అని ఇషిమారు అనే జర్నలిస్ట్ తన కథనంలో పేర్కొన్నాడు. ఇక ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం.. పోయినేడాది 60 శాతం నార్త్ కొరియా ప్రజలు.. ఆకలితో అల్లలాడిపోయారు. ఉన్న నిల్వలు దగ్గర పడడంతో పాటు సెప్టెంబర్ నుంచి ఆ దేశానికి కొత్తగా సరుకులు వెళ్లింది లేదు అని యూఎన్వో ఒక నివేదికలో వెల్లడించింది. కిమ్ వైఫల్యం నిజానికి కిమ్ పాలనలో ఉత్తర కొరియాలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని గతంలోనూ రిపోర్టులు వెలువడ్డాయి. అయితే పోయినేడాది కిమ్ జోంగ్ ఉన్ గురించి రకరకాల కథనాలు ప్రచురితం అయ్యాయి. 1990 నాటి దారుణమైన సంక్షోభం రాబోతోందని, కలిసికట్టుగా ఎదుర్కోవాలని జనాలకు పిలుపు ఇచ్చాడు. అయితే ఆ అంచనాలకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు కిమ్. పైగా ఆహార నిల్వలపై విచిత్రమైన ఆదేశాలిచ్చాడు కూడా. వాటిలో ఒకటి పెంపుడు కుక్కలను సైన్యం ఆకలి నింపడానికి ప్రభుత్వానికి ఇచ్చేయాలని ప్రజలను ఆదేశించడం. ఈ నిర్ణయంపై జంతు పరిరక్షణ సంఘాలు మండిపడ్డాయి. అయినా కిమ్ ఆ నిర్ణయాన్ని అమలు చేశాడంటే అక్కడి ఆకలి రోదనల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆహారంతో పాటు ప్రజలకు అవసరం అయ్యే మందులు(అత్యవసర చికిత్సకు అవసరమయ్యే మందులతో సహా) కొరత కూడా కొనసాగుతోంది. దీంతో రాయబార కార్యాలయాలు మూతపడడంతో పాటు దౌత్యవేత్తలు, రాయబారులు కొరియా విడిచి స్వస్థలానికి వెళ్లిపోయారు. చివరికి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్న స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహార కొరతను తట్టుకోలేక అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఈ పరిస్థితులతో నార్త్ కొరియా ప్రజలు కిమ్‌పై విశ్వాసం పూర్తిగా కోల్పోయారని కొన్ని కథనాలు ప్రస్తావించాయి. 70 శాతం ప్రజలకు ఉచిత రేషన్ హమీతో పాటు 2012 నుంచి ‘ప్రజల స్వేచ్ఛను హరించన’ని వాగ్దానం చేసిన కిమ్.. తర్వాతి కాలంలో దానిని పూర్తిగా విస్మరించాడని, ఇప్పుడు ఆకలితో జనాలు చస్తున్నా.. వేడుకలు, ఆర్భాటాలకు పోతున్నాడ’ని లియోన్ అనే చైనీస్ జర్నలిస్ట్ కథనం రాసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్భాట వేడుకలు, క్షిపణి పరీక్షలు పక్కనపెట్టి.. రష్యా, చైనా సరిహద్దుల్ని తెరవడం, ఐక్యరాజ్య సమితి అందించే తక్షణ సాయాన్ని వద్దనకుండా తీసుకోవడం మాత్రమే కిమ్ ముందు ఉన్న మార్గాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. చదవండి: ఒక్క కరోనా కేసు లేదు -
కిమ్ ‘మిస్టిరియస్ ప్రియురాలిని’ చూసి.. షాక్!
ఉత్తర కొరియాలో ఆమె ఒక ‘మిస్టిరియస్ మహిళ’... ఆమె గురించి అనేక పుకార్లు ఉన్నాయి. దేశానికి నియంత పాలకుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్‌కు ఆమె ప్రియురాలు అని, విభేదాల కారణంగా ఆమెను గతంలోనే కిమ్ ఉరితీయించాడని వదంతులు కూడా వచ్చాయి. ఉత్తర కొరియాలో అందమైన భామగా, దేశానికి చెందిన ప్రముఖ యువతుల బ్యాండ్ సారథిగా ఆమె పాశ్చాత్య మీడియాలో పాపులర్ అయ్యారు. ఇలా అనేక వదంతులకు కేంద్ర బిందువుగా ఉన్న హ్యోన్ సాంగ్ వోల్ ఆదివారం ఒక్కసారిగా శత్రుదేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దర్శనమిచ్చారు. ద.కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఉ. కొరియా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆమె సియోల్ వచ్చింది. ఆమెను చూడగానే ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టి టకటకా ఫొటోలు తీసుకున్నారు. కానీ ఆమె మీడియాతో మాట్లాడలేదు. ఉ.కొరియా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షల కారణంగా కొరియా దేశాల నడుమ తీవ్ర శత్రుత్వం, ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద.కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఉ.కొరియా వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఒప్పుకుంది. మిస్టిరియస్ మహిళ హ్యోన్ సాంగ్ వోల్ సియోల్‌లో అడుగుపెట్టగానే నిరసనలు హోరెత్తాయి. ఆమె సియోల్‌కు రాగానే కొందరు నిరసనకారులు కిమ్‌జాంగ్ ఉన్ ఫొటోలను తగులబెట్టి నిరసన తెలిపారు. సోమవారం సియోల్ రైల్వేస్టేషన్ వద్ద ఆమెకు ప్రత్యక్షంగా నిరసన సెగ తగిలింది. ఆమె ఎదురుగానే 150 నుంచి 200 మంది నిరసనకారులు కిమ్ ఫొటోను, ఉత్తర కొరియా జెండాను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ స్పందించలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయినా, ఆ తర్వాత నిరసనకారులు వాటిని తగలబెట్టి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. -
'కిమ్ ఒకసారి మారు.. మీ దేశం రిచ్ అవుద్ది'
టోక్యో : ఉత్తర కొరియా వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని జపాన్ అధ్యక్షుడు షింజో అబే విజ్ఞప్తి చేశారు. తన విధానాలను మార్చుకొని ప్రజలకు మంచి చేసే పనులపై ఆ దేశం దృష్టిని సారించాలని అన్నారు. మొత్తం తన అణుకార్యక్రమానికి ఉత్తర కొరియా శుభంకార్డు వేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం అబే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'ఉత్తర కొరియా తన పంథాను మార్చుకునేందుకు, అణుకార్యక్రమాలకు ముగింపు పలికేందుకు దక్షిణ కొరియా, అమెరికాతో కలిసి జపాన్ ఎంత మేరకు ఒత్తిడి చేయాలో అంత చేసింది' అని ఆయన అన్నారు. ఉత్తర కొరియాకు అంతర్జాతీయంగా దక్కాల్సినవి తాత్కాలికంగా నిలిపివేస్తుండంతో ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందా అనే విషయాన్ని చాలా సీరియస్‌గా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా ప్రచ్చన్నయుద్ధంలాంటి పరిస్థితుల్లో ఇది తీవ్రంగానే ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి కిమ్ సరైన విధానాలు అనుసరిస్తే ఉత్తర కొరియా అత్యంత ధనిక దేశమవుతుందని చెప్పారు. -
'ఉత్తర కొరియా రెడీ అయింది.. మరి మీరు'
ప్యాంగ్యాంగ్ : తమ అణు విధానంపై అమెరికాతో ప్రత్యక్షంగా బహిరంగంగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్ లారోవ్ తెలిపారు. ఈ విషయాన్ని తాను అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్కు కూడా తెలియజేసినట్లు చెప్పారు. గురువారం వియన్నాలో జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో తాను ఈ సందేశాన్ని చెప్పినట్లు వివరించారు. అయితే, టిల్లర్ సన్ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదని, ముందు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను వదిలేసుకుంటేనే ముందుకు వెళతామనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమైందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నత శ్రేణి అధికారి జెఫ్రీ ఫెల్ట్మేన్ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్ హోను ప్యాంగ్యాంగ్లో కలిసిన సందర్భంగా చర్చల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని, అందుకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. -
ఏ క్షణమైనా అణు యుద్ధం: కొరియా
ఐక్యరాజ్యసమితి: అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఏ క్షణమైనా అణు యుద్ధం ముంచుకొస్తుందని ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియా డిప్యూటీ అంబాసిడర్ హెచ్చరించారు. తమ అణు, క్షిపణి కార్యకలాపాలు వ్యూహాత్మకంగా చేపడుతున్నవని, వీటిని నిలిపివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అమెరికా నుంచి అణు ముప్పు పూర్తిగా తొలిగేవరకూ తాము అణ్వాయుధాలు, బాలిస్టిక్ రాకట్లను వీడబోమని స్పష్టం చేశారు.మరోవైపు కొరియా అణు సంపత్తిని, క్షిపణి ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్ సమర్థించుకున్నారు. 1970 నుంచి ప్రపంచంలో కేవలం ఉత్తర కొరియా మాత్రమే అమెరికా నుంచి నేరుగా అణు దాడులకు టార్గెట్‌గా ఉందని, ఆత్మరక్షణ కోసం తాము అణ్వాయుధాలను కలిగిఉండటం తమ హక్కని కిమ్ ఐరాస నిరాయుధీకరణ కమిటీకి స్పష్టం చేశారు. అణు పరీక్షలు ఏటా తాము నిర్వహించే మిలటరీ ఎక్సర్సైజ్ల్లో భాగమేనని, అయితే తమ అగ్రనాయకత్వాన్ని తొలగించేందుకు అమెరికా నిర్వహించే సీక్రెట్ ఆపరేషనే అన్నింటికన్నా ప్రమాదకరమని కిమ్ ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం అమెరికా భూభాగం తమ ఫైరింగ్ రేంజ్లో ఉందని, తమ భూభాగంలో ఓ అంగుళంపైనా దండెత్తే దుస్సాహసానికి అమెరికా పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
విరుచుపడిన ట్రంప్: చర్చలు శుద్ధ దండగ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా విషయంలో మరోసారి విరుచుపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతామంటూ తమ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపడం శుద్ధ దండగని, సమయాన్ని వృధా చేయడమేనని ఆయనకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా లాగా తాను విఫలం చెందనని చెప్పారు. ''మా అత్యంత అద్భుతమైన విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లరసన్కి చెబుతున్నా. లిటిల్ రాకెట్ మ్యాన్‌తో సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృధా చేసుకోవడమే. మీలో ఉన్న శక్తిని ఆదా చేసుకోండి. ఇప్పటి వరకు చేసిన మాదిరిగానే మేము మా పనిచేస్తాం'' అని హెచ్చరిస్తూ ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. రాకెట్ మ్యాన్‌తో మంచిగా ఉండటం గత 25 సంవత్సరాలుగా కుదరలేదని, మరి ఇప్పుడెందుకు జరుగుతుందంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో క్లింటన్, బుష్, ఒబామాలు విఫలయ్యారని, తాను మాత్రం అసలు ఓడిపోదలుచుకోలేదని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ట్రంప్ అంతకముందు రాకెట్ మ్యాన్‌గా అభివర్ణించారు. చైనాలో ఉన్న టిల్లర్సన్.. ఉత్తర కొరియాతో నేరుగా మాట్లాడగల కమ్యునికేషన్ వ్యవస్థ తమకు ఉందని, దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్పారు. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. టిల్లర్సన్పై నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్రంప్ చేసిన ట్వీట్లను అమెరికా మీడియా భారీ ఎత్తున ఎత్తిచూపింది. అధ్యక్షుడికి, విదేశాంగ మంత్రికి మధ్య ఉన్న తేడాను అమెరికా మీడియా ఎక్కువగా హైలైట్ చేసింది. -
'మళ్లీ యుద్ధం వద్దనుకుంటున్నాం'
సియోల్ : వచ్చే నెలలో ఉత్తర కొరియా మరిన్ని కవ్వింపుచర్యలకు పాల్పడవచ్చని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు అణు క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లుగానే అక్టోబర్‌లో కూడా అలాంటి పరంపరనే కొనసాగించే అవకాశం ఉందన్నారు. వచ్చే నెలలో కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవం నేపథ్యంలో దానికి సమాంతరంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో ఆ దేశ రక్షణశాఖ సలహాదారు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వరుసగా ఉత్తర కొరియా ఏదో ఒక చర్యలకు దిగబోతోందని తమ వద్ద సమాచారం ఉందన్నారు. పూర్తి వివరాలు అందించేందుకు నిరాకరించారు. అయితే, సైనిక చర్యలు, దౌత్యం ద్వారా ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోందని, అయితే, మరోసారి యుద్ధానికి వెళ్లడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల వరుసగా అణు కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉభయ కొరియా ప్రాంతాలతోపాటు అటు ప్రపంచ అగ్ర దేశాల్లో కూడా గుబులు బయలుదేరిన విషయం తెలిసిందే. -
ఇక సమరమేః ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియాపై సైనిక చర్యకు అమెరికా సర్వ సన్నద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కొరియా అణు కార్యకలాపాలకు దూరంగా ఉండేలా బాధ్యతాయుత దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపు ఇచ్చారు. అమెరికా బాంబర్లను కూల్చివేయడం ద్వారా తమను తాము రక్షించుకుంటామని ఉత్తర కొరియా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ కొరియాను గట్టిగా హెచ్చరించారు. దౌత్య, ఆర్థిక చర్యలకు బదులు తాము మరో ప్రత్యామ్నాయం ఎంచుకుంటే అది ఉత్తర కొరియా విధ్వంసానికి దారితీస్తుందని అన్నారు. ఉత్తర కొరియా నేత కిమ్ తీరు బాగా లేదని ట్రంప్ ఆరోపించారు. ఉత్తర కొరియాలో పరిస్థితిని దశాబ్ధాల కిందటే పరిష్కరించాల్సి ఉందని, అమెరికా గత పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు తాను ఈ పనికి ఉపక్రమించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాపై అమెరికా పలు ఆంక్షలు విధించినా అణు పరీక్షల నుంచి కొరియా వెనక్కి తగ్గకపోవడంతో కొద్ది రోజులుగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. -
కిమ్ జాంగ్ ఉన్ ఆస్తులపై కొరడా!
సాక్షి, ఐరాస: ప్రపంచ దేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. వరుస అణు పరీక్షలతో గుబులు రేపుతున్న ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలకు రంగం సిద్ధమైంది. ఉత్తరకొరియాకు చమురు ఎగుమతిని నిషేధించాలని, ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు ఉన్న ఆస్తులన్నింటినీ స్తంభింపజేయాలని తాజాగా అమెరికా ప్రతిపాదించింది. ఈ మేరకు ఉత్తర కొరియాపై కొత్త ఆంక్షలకు సంబంధించిన ముసాయిదాను భద్రతా మండలి సభ్యులకు అమెరికా పంచింది. వరుసగా ఆరోసారి అణుపరీక్షలు నిర్వహించడమే కాకుండా.. హైడ్రోజన్ బాంబును సైతం పరీక్షించామని, అమెరికాపై దాడి చేస్తామని ఉత్తర కొరియా రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆంక్షలను ప్రతిపాదిస్తూ అమెరికా ముసాయిదా రూపొందించింది. అయితే, అణు పరీక్షలు మానుకోవాలని హెచ్చరిస్తూ ఐరాస ఇప్పటికే అత్యంత కఠినమైన ఆంక్షలను ఉత్తర కొరియాపై విధించింది. ఈ నేపథ్యంలో మరిన్ని ఆంక్షలను భద్రతా మండలి సభ్యులైన రష్యా, చైనా వ్యతిరేకించే అవకాశముంది. ఇప్పటికే ఉత్తర కొరియా నుంచి బొగ్గు గనుల ఎగుమతులను ఐరాస నిషేధించింది. దేశ ఎగుమతుల్లో మూడోవంతు వాటాఈ బొగ్గు ఎగుమతులదే. వీటిని నిషేధించడంతో కొరియాకు బిలియన్ డాలర్ల మేర భారం పడనుంది. ఇక, కొరియాకు ఇంధన ఉత్పత్తుల సరఫరాను పూర్తిగా నిలిపివేయాలని, ఆ దేశ వస్త్ర పరిశ్రమ ఎగుమతులను నిషేధించాలని అమెరికా తాజాగా ప్రతిపాదించింది. అంతేకాకుండా కిమ్ జాంగ్ ఉన్, కొరియా ప్రభుత్వ ఆస్తులను స్తంభింపజేయాలని, ఆ దేశ అధికారుల విదేశీ పర్యటనలను నిషేధించాలని సూచించింది. కొరియా కార్మికులు విదేశాల్లో పనిచేయకుండా నిషేధించాలని పేర్కొంది. దుస్తుల ఎగుమతులు, విదేశాల్లో పనిచేస్తున్న తమ కార్మికుల ఆదాయం వల్లే విదేశీ ద్రవ్యాన్ని కొరియా ఆర్జించగలుగుతోంది. వీటిని నిలిపేస్తే.. కొరియా మనుగడ కష్టమై.. దారిలోకి వస్తుందని అమెరికా భావిస్తోంది. అయితే, ఈ ఆంక్షల అమలుకు భద్రతా మండలిలో వీటో అధికారమున్న చైనా, రష్యా ఎంతవరకు సహకరిస్తాయనేది ప్రశ్నార్థకమే. -
దుస్సాహసానికి సిద్దమవుతున్న ఉత్తరకొరియా
-
'ఎప్పుడైనా ఎక్కడైనా కిమ్‌ను నేను కలుస్తా'
హాంబర్గ్: ఉత్తర కొరియా విషయంలో ఎవరూ సహనం కోల్పోవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హెచ్చరించారు. ఏమాత్రం తొందరపడినా పరిస్థితి చేజారుతుందని ఆయన చెప్పారు. హాంబర్గ్‌లో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా శుక్రవారం సాయంత్రం అనధికారికంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో భేటీ అయిన సందర్భంగా పుతిన్ ఈ హెచ్చరిక చేశారు. హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఉత్తర కొరియాతన అణుకార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రమాదకరంగా మారుతోందని మూన్ జే పుతిన్‌తో అన్నారు. అదే సమయంలో ఇక ఉత్తర కొరియా విషయంలో తాము ఏ మాత్రం సహనంగా ఉండలేమని, ఓర్పుకు ఇక రోజులు లేవని సైనిక చర్యకైనా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ స్పందించారు. 'ఉత్తర కొరియా అణు సమస్య చాలా తీవ్రమైనది. అయితే, ఈ విషయంలో ఏ ఒక్కరు తమ సహనాన్ని కోల్పోవద్దు. సున్నితమైన ఈ అంశాన్ని కార్యసాధన ద్వారా పరిష్కరించాలి. మరింత చేయిదాటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం నేనే స్వయంగా ఉత్తర కొరియా అధ్యక్షుడుని కలుసుకుంటాను.. అది ఎప్పుడైనా ఎక్కడైనా' అని పుతిన్ చెప్పారు. తొందరపడితే ఇంతకాలం ఎదురు చూస్తూ కొనసాగించిన శాంతిమార్గం ధ్వంసం అవతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.