టోక్యో : ఉత్తర కొరియా వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని జపాన్ అధ్యక్షుడు షింజో అబే విజ్ఞప్తి చేశారు. తన విధానాలను మార్చుకొని ప్రజలకు మంచి చేసే పనులపై ఆ దేశం దృష్టిని సారించాలని అన్నారు. మొత్తం తన అణుకార్యక్రమానికి ఉత్తర కొరియా శుభంకార్డు వేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
గురువారం అబే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'ఉత్తర కొరియా తన పంథాను మార్చుకునేందుకు, అణుకార్యక్రమాలకు ముగింపు పలికేందుకు దక్షిణ కొరియా, అమెరికాతో కలిసి జపాన్ ఎంత మేరకు ఒత్తిడి చేయాలో అంత చేసింది' అని ఆయన అన్నారు. ఉత్తర కొరియాకు అంతర్జాతీయంగా దక్కాల్సినవి తాత్కాలికంగా నిలిపివేస్తుండంతో ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందా అనే విషయాన్ని చాలా సీరియస్‌గా పరిశీలిస్తున్నామని, ముఖ్యంగా ప్రచ్చన్నయుద్ధంలాంటి పరిస్థితుల్లో ఇది తీవ్రంగానే ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి కిమ్ సరైన విధానాలు అనుసరిస్తే ఉత్తర కొరియా అత్యంత ధనిక దేశమవుతుందని చెప్పారు.
'కిమ్ ఒక్కసారి మారితే ఉత్తర కొరియానే టాప్'
Published Thu, Jan 4 2018 7:18 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment