సామాజిక మాధ్యమాల్లో ఏదైనా వీడియో ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తే చాలు నెటిజన్లు షేర్లు, కామెంట్‌లు లైకులతో హోరెత్తిస్తుంటారు. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత అనే విషయాల గురించి ఆలోచించకుండానే తమకు తోచిన కామెంట్లు పెట్టి మరీ షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని చారిత్రక ఘట్టాలు కూడా మార్ఫింగ్‌కు గురై వైరల్ అవుతుంటాయి. ఉత్తర కొరియాలో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన హయాంలో అవినీతి అధికారికి మీడియా సమక్షంలోనే మరణశిక్ష ఎలా విధించారో చూడండి.. అంటూ ఓ వీడియో ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేవలం 12 సెకన్ల వీడియోలో కిమ్ మరో వ్యక్తికి కరచాలనం చేసి నవ్వుతూ పలకరిస్తారు. అనంతరం నడుస్తు ఓ ప్రదేశానికి వెళ్లగానే అక్కడ ఇదివరకే ఏర్పాటు చేసిన ఓ పెద్ద గుంతలో సదరు వ్యక్తి పడిపోయి, వెంటనే డోర్లు మూసుకుంటాయి. తర్వాత సింపుల్‌గా కిమ్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. అంతేనా ఇదంతా మీడియా సమక్షంలోనే జరగడంతో రిపోర్టర్లు కూడా వామ్మో అంటూ ఓ లుక్కిస్తారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి.