South Korea Park Geun Hye Freed After 5 Years From Prison: అవినీతి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్యున్-హే దాదాపు ఐదేళ్ల తర్వాత జైలు నుండి విడుదలయ్యారు. అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 2017లో పార్క్‌ని అరెస్ట్ చేయడమే కాక 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ గతవారం పార్క్‌కు ప్రత్యేక క్షమాభిక్షను మంజూరు చేశారు.
(చదవండి: చేపల వర్షం గురించి విన్నారా!... నిజంగా ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట!)
అంతేకాదు గతాన్ని మర్చిపోయి దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి.. కరోనా పరిస్థితులను సమష్టిగా ఎదుర్కోవాలనే లక్ష్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మూన్ జే-ఇన్ వెల్లడించారు. పైగా గత ఐదేళ్లుగా కారాగార శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షురాలు పార్క్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందని అందువల్ల తాను దీనిని కూడా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పారు. అయితే పార్క్ విడుదలకు పిలుపునిచ్చేలా పార్క్ మితవాద అనుకూల సమూహాలు వారానికోసారి ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చాయి.
ఈ మేరకు పార్క్‌కూడా ప్రజల ఆందోళనలకు కారణమైనందుకు క్షమపణలు చెప్పడమేకాక ఈ నిర్ణయం తీసుకున్నందుకు మూన్‌కి ధన్యవాదలు తెలిపారు. పైగా పార్క్ మాజీ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం అయిన కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీ, మూన్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల పోటీలో ఉన్నందున పార్క్ విడుదలైంది. అంతేకాదు వందలాది మంది పార్క్ మద్దతుదారులు ఆమె విడుదలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రి బయటే గడ్డకట్టే చలిలో ఆమె రాక కోసం పుష్పగుచ్చలతో వేచిఉండటం విశేషం. అయితే ఆమె తదుపరి మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఏదైనా క్రీయాశీల పాత్ర పోషిస్తుందా అనే విషయం పై ఎలాంటి స్పష్టత లేదు.
(చదవండి: రోగితో నర్సు చాటింగ్.. రూ. 20 లక్షలు ఇవ్వమంటూ బ్లాక్‌మెయిల్!)
Comments
Please login to add a commentAdd a comment